హీరోయిన్ల ఆన్-స్క్రీన్ vs ఆఫ్-స్క్రీన్ ఇమేజ్!
సినీ తారల ప్రపంచం అద్దాల మేడల లాంటిది. తెరపై కనిపించే విధానానికి, నిజ జీవితంలో వారు ఉండే శైలికి చాలా వ్యత్యాసం ఉంటుంది.;
సినీ తారల ప్రపంచం అద్దాల మేడల లాంటిది. తెరపై కనిపించే విధానానికి, నిజ జీవితంలో వారు ఉండే శైలికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వెండి తెరపై పాత్రల అవసరాల కోసం ఎంతో పద్ధతిగా హోమ్లీగా కనిపించే నటీమణులు ఆఫ్-స్క్రీన్‌లో మాత్రం పూర్తి భిన్నమైన గ్లామరస్ ఇమేజ్‌ను కలిగి ఉంటారు. మృణాల్ ఠాకూర్, సంయుక్త మీనన్, మాళవిక మోహనన్ వంటి భామలు అందుకు ఉదాహరణలు. పాత్రల ఎంపికలో ఎంతటి విచక్షణ ప్రదర్శిస్తారో? ఫ్యాషన్ ప్రపంచంలో కూడా అంతటి ట్రెండ్‌ను వారు సృష్టిస్తున్నారు. `సీతారామం`లో సీతగా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మృణాల్ ఠాకూర్, ఆ సినిమాలో చీరకట్టులో ఎంత పద్ధతిగా కనిపించిందో? బయట ఫ్యాషన్ ఫోటోషూట్స్ లో అంతే హాట్ గా కనిపిస్తుంది.
ఆమె పాత్రల ఎంపికలో ఎంత హుందాతనం ఉంటుందో? సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలలో అంతటి గ్లామర్ ఉంటుంది. అలాగే భీమ్లా నాయక్, విరూపాక్ష వంటి చిత్రాలతో పద్ధతైన తెలుగు అమ్మాయిలా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ నిజానికి మోడ్రన్ గాళ్. సినిమాకు సినిమాకు తన రూపాన్ని మార్చుకుం టూనే ఉంటుంది. తనలోని గ్లామర్ కోణాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. మాళవిక మోహనన్ విషయానికొస్తే? మలయాళ ముద్దుగుమ్మ సినిమాల్లో క్యారెక్టర్ ఓరియంటెడ్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.
కానీ ఫ్యాషన్ విషయంలో మాత్రం ఎప్పుడూ ముందుంటుంది. బోల్డ్ ఫోటోషూట్స్ తో నెట్టింట నిత్యం హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ఇలాంటి నటీమణులు తెరపై పాత్రకు తగ్గట్టుగా తమను తాము మలచుకోవడమే కాక తెర వెనుక వ్యక్తిగత ఇష్టాలను, ఫ్యాషన్ అభిరుచులను ధైర్యంగా ప్రదర్శిస్తుంటారు. ఇది ఒకరకంగా వారి వృత్తిపరమైన పరిణితికి నిదర్శనం.
సినిమా అంటే ఒక భ్రమ ప్రపంచం. అక్కడ నటీమణులు కేవలం పాత్రలే. కానీ నేటి సోషల్ మీడియా కాలంలో నటీమణులకు తమకు నచ్చినట్లుగా కనిపించే స్వేచ్ఛ ఉంది. చాలా మంది నటీమణులు వెండితెరపై హోమ్లీ పాత్రలు చేసినంత మాత్రాన బయట కూడా అలాగే ఉండాలని ఆశించడం తప్పు అని వారు నిరూపి స్తున్నారు. అభిమానులు కూడా వీరిని కేవలం వెండితెర సీతగానో, పద్ధతైన అమ్మాయిగానో చూడకుండా, ఒక నటిగా, ఒక ఫ్యాషన్ ఐకాన్ గా ఆదరిస్తున్నారు.
తెరపై మరియు తెర వెనుక ఉన్న ఈ వైవిధ్యం నటీమణులకు ఒక బలమైన ఇమేజ్‌ను ఇస్తుంది. ఇది వారిని కేవలం ఒక పాత్రకు పరిమితం కాకుండా మల్టీ-డైమెన్షనల్ వ్యక్తిత్వంగా తీర్చిదిద్దుతుంది. గ్లామర్ షో అనేది కేవలం ఒక ఫ్యాషన్ మాత్రమేనని అది వారి నటనకు ఏమాత్రం అడ్డుకాదని వీరు నిరూపిస్తున్నారు. ఇలాంటి వైవిధ్యమైన శైలిని కలిగి ఉండటం వల్ల నేటి తరం నటీమణులు యూత్ లో క్రేజ్ పెంచుకుంటున్నారు. ఒక స్టైల్ స్టేట్‌మెంట్‌ను కూడా క్రియేట్ చేస్తు న్నారు. నటీమణుల ఆన్-స్క్రీన్ ఇమేజ్, ఆఫ్-స్క్రీన్ గ్లామర్ అనేవి రెండు వేర్వేరు కోణాలు. ఒక నటిగా వారు పాత్రల్లో జీవిస్తే? ఒక వ్యక్తిగా వారు తమలోని అందాన్ని బయట ప్రపంచానికి చూపిస్తున్నారు.