• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిఠాపురంలో ఎన్టీఆర్...

పిఠాపురంలో ఎన్టీఆర్ బామ్మర్ది 'ఆయ్' హవా

| పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత పిఠాపురంకి మరింత ఎక్కువ గుర్తింపు లభించింది.

By - Tupaki Desk
Update: 2024-08-04 08:10 GMT

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పిఠాపురం పేరు చాలా గట్టిగా వినిపిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే దేశ వ్యాప్తంగా పిఠాపురం పేరుకి ప్రాచూర్యం లభించింది. దానికి కారణం పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడమే. అక్కడి నుంచి భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత పిఠాపురంకి మరింత ఎక్కువ గుర్తింపు లభించింది. టాలీవుడ్ ఇండస్ట్రీ సైతం పిఠాపురం పైన ఫోకస్ చేసింది.


పిఠాపురాన్ని టూరిస్ట్ ప్రదేశంగా అభివృద్ధి చేస్తానని ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం నిహారిక తన కొత్త సినిమా కమిటీ కుర్రాళ్ళు ప్రమోషన్స్ లో భాగంగా పిఠాపురం వెళ్లి దాత్తాత్రేయ స్వామిని దర్శించుకుంది. ఇప్పుడు నిర్మాత బన్నీ వాస్ తన కొత్త సినిమా ఆయ్ మూవీ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించబోతున్నారు. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ హీరోగా గోదావరి బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది.


ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆగష్టు 15న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. నయన సారిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. గోదావరి నేపథ్యం, అవుట్ అండ్ అవుట్ కామెడీ కంటెంట్ తో ఆయ్ సినిమా తెరకెక్కడంతో కచ్చితంగా సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ చిత్ర యూనిట్ లో ఉంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ లాంచింగ్ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో సత్యకృష్ణ కన్వెన్షన్ లో జరగబోతోందని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. హీరో, హీరోయిన్ కి సంబందించిన లవ్ బుల్ స్టిల్ ని రిలీజ్ చేసి ట్రైలర్ లాంచింగ్ కన్ఫర్మ్ చేశారు. ఆగష్టు 5న ఉదయం 11 గంటలకి ట్రైలర్ లాంగింగ్ ఈవెంట్ ఉంటుందని తెలిపారు. ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. బన్నీ వాస్ కూడా జనసేనలో కీలక నాయకుడిగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ స్థానిక నాయకులు పాల్గొనే ఛాన్స్ ఉంది.

మొత్తానికి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచిన తర్వాత టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్ కి ఆ నియోజకవర్గం గెట్ వేగా మారిందనే మాట బలంగా వినిపిస్తోంది. పిఠాపురంలో సినిమా ఈవెంట్ అంటే ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ అభిమానులని మూవీ ఎట్రాక్ట్ చేస్తుంది. ఇది ఆ చిత్రానికి అదనపు ప్రమోషన్స్ అవుతుంది. పిఠాపురంలో ఈవెంట్స్ నిర్వహించిన సినిమాలని మెగా ఫ్యాన్స్ కూడా ఓన్ చేసుకొని చూడటానికి ఆసక్తి చూపించే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • AAY 
  • Trailer 
  • Bunnyvas 
  • GA2pictures 
  • Pithapuram 
  • SatyaKrishnaConvention 
  • Gollaprolu 
  • Pawankalyan 
  • DeputyCM 
  • PithapuramMla 
  • Telugufilmindustry 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS