• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తప్పు తనదేనన్న సూపర్‌...

తప్పు తనదేనన్న సూపర్‌ స్టార్‌

| హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ఫారెస్ట్‌ గంప్‌ కి రీమేక్ గా రూపొందిన లాల్‌ సింగ్‌ చద్దా సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

By - Tupaki Desk
Update: 2024-08-26 06:51 GMT

2016లో వచ్చిన దంగల్ సినిమా తర్వాత అమీర్ ఖాన్‌ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతూ వస్తోంది. 2022 లో వచ్చిన లాల్‌ సింగ్ చద్దా సినిమా పై చాలా ఆశలు పెట్టుకుని అమీర్ ఖాన్ నటించడం జరిగింది. హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ఫారెస్ట్‌ గంప్‌ కి రీమేక్ గా రూపొందిన లాల్‌ సింగ్‌ చద్దా సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అమీర్ ఖాన్‌ ఆ సినిమా ఫలితం నుండి తేరుకోవడానికి చాలా సమయం పట్టిందని, అదే సమయంలో ఆయన వ్యక్తిగతంగా కూడా విడాకులు తీసుకోవడంతో ఇబ్బందులకు గురి అయినట్లు బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరిగింది.

అమీర్ ఖాన్‌ లాల్ సింగ్ చద్దా సినిమా ఫ్లాప్‌ అవ్వడం పై స్పందించాడు. ఫారెస్ట్‌ గంప్ సినిమా నాకు చాలా ఇష్టమైన మూవీ. దాని రీమేక్‌ చేసేందుకు చాలా ఆసక్తిని కనబర్చాను. అందులోని నా నటన వల్ల సినిమా ఫ్లాప్‌ అయ్యిందని నేను భావిస్తున్నాను. నా నటన మరో రకంగా ఉండి ఉంటే కచ్చితంగా సినిమా ఫలితం మరో విధంగా ఉండేది అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్‌ చెప్పుకొచ్చాడు. లాల్ సింగ్ చద్దా సినిమా ఫ్లాప్‌ కి పూర్తి కారణం తానే అంటూ అమీర్ ఖాన్‌ ఒప్పుకోవడం మాత్రమే కాకుండా భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాదే అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

రియా చక్రవర్తి నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌ లో అమీర్ ఖాన్ పాల్గొని పలు విషయాలను షేర్‌ చేసుకున్నాడు. లాల్ సింగ్‌ చద్దా సినిమా ఫ్లాప్‌ తో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా ఆమెతో షేర్‌ చేసుకున్నాడు. అమీర్ ఖాన్‌ ను రియా చక్రవర్తి పెళ్లి వ్యవస్త గురించి ప్రశ్నించిన సమయంలో ఆయన స్పందిస్తూ... నేను రెండు సార్లు వివాహం లో విఫలం అయ్యాను. కనుక పెళ్లి విషయంలో నా సలహాలు తీసుకోవడం అనేది కరెక్ట్‌ కాదు అన్నాడు. నా మాజీ భార్యలతో ఇప్పటికి కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. వారు ఇప్పటికి కూడా నా కుటుంబ సభ్యులే అన్నాడు.

మూడో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా అంటూ రియా చక్రవర్తి ప్రశ్నించిన సమయంలో అమీర్‌ ఖాన్ స్పందిస్తూ... ప్రస్తుతం నా వయసు 59 ఏళ్లు. నాకు మళ్లీ పెళ్లి అంటే కష్టం. ప్రస్తుతం నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నా కుటుంబంతో, పిల్లలతో రీ కనెక్ట్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను. స్నేహితులు ఇంకా నాకు ఎంతో ఇష్టమైన వారితో సమయం గడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా పెళ్లి ఆలోచన లేదు అన్నట్లుగా అమీర్‌ ఖాన్‌ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అమీర్‌ ఖాన్‌ పాడ్‌ కాస్ట్‌ ఇంటర్వ్యూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Tags:    
  • Bollywood 
  • Filmindustry 
  • LaalSinghChadda 
  • Aamirkhan 
  • RheaChakraborty 
  • PodcastInterview 
  • Family 
  • Kids 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS