• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమీర్ ఖాన్ నిక‌ర ఆస్తుల...

అమీర్ ఖాన్ నిక‌ర ఆస్తుల విలువ‌?

| ఖాన్‌ల త్ర‌యంలో 6,300 కోట్ల ఆస్తుల‌తో నంబ‌ర్ 1 స్థానంలో ఉన్నాడు కింగ్ ఖాన్ షారూఖ్‌. ఆ త‌ర్వాత సల్మాన్ ఖాన్ 2,850 కోట్ల‌తో లీడ్ లో ఉన్నాడు

By - Tupaki Desk
Update: 2024-03-14 10:30 GMT

ఖాన్‌ల త్ర‌యంలో 6,300 కోట్ల ఆస్తుల‌తో నంబ‌ర్ 1 స్థానంలో ఉన్నాడు కింగ్ ఖాన్ షారూఖ్‌. ఆ త‌ర్వాత సల్మాన్ ఖాన్ 2,850 కోట్ల‌తో లీడ్ లో ఉన్నాడు. ఆ ఇద్ద‌రితో పోలిస్తే అమీర్ ఖాన్ బాలీవుడ్ లో అత్యంత ధనవంతుడు కాకపోవచ్చు.. కానీ పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారాల‌ గ్రహీతగా అతడికి ఉన్న గౌర‌వం వేరు. అమీర్ ఖాన్ నికర విలువ రూ. 1862 కోట్లుగా ఉంది. అతడు తన సినిమాలు, నిర్మాణ సంస్థ, ఎండార్స్‌మెంట్‌లు, రియల్ ఎస్టేట్ , వ్యవస్థాపక పెట్టుబడులు సహా ర‌క‌ర‌కాల మార్గాల్లో తన ఆదాయాన్ని పొందుతాడు.

అమీర్ ఖాన్ కొన్ని సంవత్సరాలుగా నటన నుండి విరామం తీసుకున్నాడు. చివ‌రిగా నటించిన లాల్ సింగ్ చ‌ద్దా కోసం అమీర్ ఖాన్ రూ. 50 కోట్లు తీసుకున్నాడు. కానీ సినిమా ఫ్లాప‌వ్వ‌డంతో నష్టాల‌ను భ‌రించేందుకు అత‌డు స‌హ‌క‌రించాడ‌ని స‌మాచారం.

అమీర్ ఖాన్‌కు చెందిన 5 అత్యంత ఖరీదైన ఆస్తులేవి? అన్న వివ‌రాల్లోకి వెళితే... అమీర్ ఖాన్ బెవర్లీ హిల్స్‌లో ఒక ఖరీదైన ఇంటిని కలిగి ఉన్నాడు. దీని ధర రూ. 75 కోట్లు. లాస్ ఏంజెల్స్ లోని బెవర్లీ హిల్స్ ఒక అధునాతన హాట్‌స్పాట్. చాలా మంది హాలీవుడ్ ప్రముఖులు ఇక్క‌డ నివ‌సిస్తారు. విలాసవంతమైన LA శివారు ప్రాంతంలో పెట్టుబడులు పెట్టిన బాలీవుడ్ నటులలో అమీర్ ఖాన్ కూడా ఉన్నారు.

అమీర్ ఖాన్ బాంద్రా ఇంటి ఖ‌రీదు 60 కోట్లు. 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తులతో విస్తరించి ఉన్న సముద్రానికి ఎదురుగా ఉన్న విశాలమైన బాంద్రా నివాసంలో అత‌డు నివసిస్తున్నారు. అందులో ఒక అంతస్తును అమీర్ ఖాన్ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. అమీర్ ఖాన్ త‌న‌ కుటుంబం సహా తరచుగా న‌గ‌ర ఔట‌ర్‌లోని విశాలమైన పంచగని ఫామ్‌హౌస్‌లో తమ సమయాన్ని వెచ్చిస్తారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రాజభవనాన్ని అమీర్ 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

అమీర్ ఖాన్ లగ్జరీ కార్లకు పెద్ద అభిమాని. ఖరీదైన కార్ల‌ను అత‌డు కలిగి ఉన్నాడు. కార్‌బైక్ఇండియా వివ‌రాల ప్రకారం.. అతడి అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి మెర్సిడెస్-బెంజ్ S600. దీని ధర రూ. 10.50 కోట్లు. అమీర్ ఖాన్ కార్లలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఖ‌రీదైన‌ది. ఇది బాలీవుడ్ ప్రముఖులకు ఇష్టమైనది. కార్‌దేఖో ప్రకారం.. ఈ లగ్జరీ కారు ధర రూ.6.95 కోట్ల నుండి రూ.7.95 కోట్ల మధ్య ఉంటుంది. అమీర్ సొంతంగా సినిమాల నిర్మాణ సంస్థ‌ను క‌లిగి ఉన్నాడు. (14 మార్చి అమీర్ ఖాన్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ స్పెష‌ల్)

Tags:    
  • Aamirkhan 
  • Networth 
  • Bollywoodhero 
  • Aamirkhanassets 
  • Filmindustry 
  • Aamirnetworth 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS