సూప‌ర్‌స్టార్ ఫేట్ మార్చ‌గ‌ల ఒక్క‌డు

బాలీవుడ్‌లో ఖాన్‌ల ప‌రిస్థితి అయోమ‌యంగా ఉంది. 60 ప్ల‌స్ ఏజ్ లో స‌ల్మాన్- షారూఖ్‌- అమీర్ ఖాన్ బాక్సాఫీస్ వ‌ద్ద‌ ప్ర‌భావం చూపాలంటే అంత సులువు కాదు.;

Update: 2025-07-27 19:30 GMT

బాలీవుడ్‌లో ఖాన్‌ల ప‌రిస్థితి అయోమ‌యంగా ఉంది. 60 ప్ల‌స్ ఏజ్ లో స‌ల్మాన్- షారూఖ్‌- అమీర్ ఖాన్ బాక్సాఫీస్ వ‌ద్ద‌ ప్ర‌భావం చూపాలంటే అంత సులువు కాదు. ఇప్ప‌టికే ఖాన్ ల చుట్టూ గేమ్ మారిపోయింది. అందుకే ఇప్పుడు వారంతా కంటెంట్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త ప‌డాల్సిన ప‌రిస్థితి ఉంది. షారూఖ్ కి ప‌ఠాన్, జ‌వాన్ లేక‌పోయి ఉంటే, ఘోర‌మైన ప‌రిస్థితి ఉండేది. లాల్ సింగ్ చ‌డ్డా, సీతారే జ‌మీన్ పార్ చిత్రాల‌తో అమీర్‌కి ఆశించిన‌ది ద‌క్క‌లేదు. స‌ల్మాన్ ఖాన్ వ‌రుస ప‌రాజ‌యాలతో రేసులో వెన‌క‌బ‌డిపోయాడు.

అయితే వీళ్లంతా సౌత్ ద‌ర్శ‌కులే దిక్కు అని భావించే ప‌రిస్థితి నేడు ఉంది. స‌ల్మాన్ కి మురుగ‌దాస్ తో భిన్న‌మైన ఫ‌లితం వ‌చ్చినా కానీ, ఇప్ప‌టికీ సౌత్ ద‌ర్శ‌కుల హ‌వాపై న‌మ్మకం ఉంది. అలాగే మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కొత్త సినిమాని ప్ర‌క‌టిస్తే అది ఒక సౌత్ ద‌ర్శ‌కుడితోనే అయి ఉంటుంద‌ని ఊహిస్తున్నారు. నిజానికి అతడు సీతారే జ‌మీన్ పార్ త‌ర్వాత ఇద్ద‌రు ద‌ర్శ‌కుల‌పై ఫోక‌స్ పెట్టాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఆ ఇద్ద‌రిలో ఒక‌రు రాజ్ కుమార్ హిరాణీ, మ‌రొక‌రు లోకేష్ క‌న‌గ‌రాజ్. హిరాణీతో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించాడు గ‌నుక అమీర్ ఖాన్ ఈసారి కూడా అత‌డికి ఓకే చెబుతాడు. అయితే ఇది బ‌యోపిక్ కేట‌గిరీ చిత్రం. దాదా సాహెబ్ ఫాల్కే జీవిత‌క‌థ‌తో రూపొందించ‌నున్నారు.

దీనితో పాటు లోకేష్ క‌న‌గ‌రాజ్ తో కూడా సినిమా చేయ‌డానికి అమీర్ సిద్ధంగా ఉన్నారు. ఖైది, లియో, విక్ర‌మ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్ని రూపొందించిన క‌న‌గ‌రాజ్ తో సినిమా చేస్తే అది మాస్ కి క‌నెక్ట‌వుతుంద‌ని అమీర్ భావిస్తున్నారు. ఫాల్కే బ‌యోపిక్ తో పాటు, క‌న‌గ‌రాజ్ తో మూవీని వెంట‌నే ప‌ట్టాలెక్కిస్తాడా? అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేం. ప్ర‌స్తుతం లోకేష్ క‌న‌గ‌రాజ్ ఎల్.సి.యులో భారీ లైన‌ప్ తో ముందుకు వెళుతున్నాడు. ర‌జ‌నీతో కూలీ త‌ర్వాత కార్తీతో ఖైది సీక్వెల్, క‌మ‌ల్ తో విక్ర‌మ్ సీక్వెల్స్ ని తెర‌కెక్కించే ప్ర‌ణాళిక‌లో ఉన్నాడు. అందుకే అమీర్ కొంత కాలం వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు. ఇక అమీర్ ఫేట్ మార్చాలంటే లోకేష్‌తో సినిమా చేయ‌డం విధి. అయితే ఇంత‌లోనే సూప‌ర్ స్టార్ అమీర్ ఖాన్ 29 జూలై 2025న మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రత్యేక ప్రకటన కోసం మీడియాని ఆహ్వానించ‌డంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం మొద‌లైంది. ఇది లోకేష్ తో సినిమానా? లేక హిరాణీతో సినిమానా? అంటూ అంద‌రూ ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. `కూలీ` సినిమాలో అతిథి పాత్ర‌లో న‌టింప‌జేసిన లోకేష్ ఇప్ప‌టికే అమీర్ ఖాన్ కి లైన్ చెప్పి ఒప్పించ‌కుండా ఉంటాడా? అనేది వేచి చూడాలి. ఇప్పుడు అమీర్ కి కావాల్సిన‌ది క్లాసిక్ మూవీ కాదు, మ్యాసివ్ పాన్ ఇండియా హిట్టు. అది క‌చ్ఛితంగా లోకేష్ తోనే సాధ్యం.

Tags:    

Similar News