మహాభారతం కోసం పిలుపునిచ్చిన స్టార్ హీరో!
మహాభారాతాన్ని వెండి తెరకెక్కించాలని బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ సంకల్పించిన సంగతి తెలిసిందే.;
మహాభారాతాన్ని వెండి తెరకెక్కించాలని బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ సంకల్పించిన సంగతి తెలిసిందే. గత నాలుగైదేళ్లగా ఈ ప్రాజెక్ట్ గురించి అమీర్ ఖాన్ సమయం వచ్చినప్పుడల్లా చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో మహాభారతం జనాల్లోకి అంతే బలంగా వెళ్తుంది. మరోవైపు టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి కూడా తాను మహా భారతం తీస్తానంటూ ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్నారు. ఇలా ఇద్దరు లెజెండ్స్ నోట మహా భారతం తరుచూ వినిపించడంతో? మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇద్దరి కలల ప్రాజెక్ట్ గా ప్రకటించడం మరింత విశేషం.
రెండు నెలల్లో పనులు మొదలు:
దీంతో ఆ మహాద్భుతాన్ని వెండితెరపై ఎప్పుడు చూస్తామంటూ ప్రేక్షకాభిమానుల్లోనూ ఆసక్తి అంతకంతకు రెట్టింపు అవుతోంది. ఈనేపథ్యంలో తాజాగా అమీర్ ఖాన్ మరోసారి 'మహాభారతం కల ఈ నాటిది కాదు. మూడు దశాబ్దాల క్రితమే తన మనసులో మహాభారతానికి బీజం పడింద'ని తెలిపారు. 30 ఏళ్లగా ఇతిహాసం మహాభారాతాన్ని తెరకెక్కించాలనుకుంట్లు వెల్లడించారు. తన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ గా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రాజెక్ట్ అప్ డేట్స్ ను రివీల్ చేసారు. మరో రెండు నెలల్లో స్క్రిప్ట్ పనులు మొదలవుతాయన్నారు.
జీవితంలోనే అతిముఖ్యమైన ప్రాజెక్ట్:
దీన్ని ఓ సినిమాలా కాకుండా ఓ యజ్ఞంలా భావించి చేస్తున్నట్లు తెలిపారు. 30 ఏళ్లగా ప్రణాళిక వేస్తుంటే అది ఇప్పుడు అమలు పరుస్తున్నట్లు పేర్కొన్నారు. తన జీవితంలో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ గా తెలిపారు. మొదలు పెట్టిన తర్వాత ముగించడానికి కూడా చాలా సమయం పడుతుందని...ప్రేక్షకులు అంతే ఓపికగా ఎదురు చూడాలన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులంతా ఈ ప్రాజెక్ట్ కోసం సిద్దమవ్వవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్ట్ మొదలైతే? భారతీయ చిత్ర పరిశ్రమలోభారీ బడ్జెట్ తో మొదలైన సినిమాగా సరికొత్త రికార్డును సృష్టిస్తుంది.
డైరెక్టర్ పై నిరంతరం చర్చే:
ఇప్పటి వరకూ నిర్మాణమైన అన్ని సినిమాల బడ్జెట్ రికార్డులను మహాభారంతం బ్రేక్ చేస్తుంది. వేల కోట్ల రూపాయలు ఈ సినిమాకు పెట్టుబడిగా అమీర్ ఖాన్ పెట్టబోతున్నారు. అయితే ఈసినిమాకు దర్శకుడు ఎవరు? అన్నది ఇంకా ఖరారు కాలేదు. రాజమౌళి అయితే బాగుంటుందని అంతా భావిస్తున్నా? తాను మాత్రం అప్పుడే మహాభారతం తీయడానికి తన అనుభవం సరిపోదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? అన్నది నెట్టింట నిరంతరం చర్చకు దారి తీస్తోంది.