పాకిస్తాన్ లో 'దంగల్' గుట్టు విప్పేసిన అమీర్ ఖాన్!
అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన `దంగల్` ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.;
అమీర్ ఖాన్ కథానాయకుడిగా నటించిన `దంగల్` ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. కుస్తీ పోటీ నేపథ్యంలో తెరకెక్కిన గొప్ప చిత్రమిది. బలమైన భావోద్వేగంతో నితష్ కుమార్ పండిచిన ప్రతీ సన్నివేశం షెభాష్ అనిపిస్తుంది. అందుకే అంత గొప్ప విజయం సాధించింది. భారతీయ చిత్ర పరిశ్రమలోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది.
2000 కోట్ల వసూళ్లతో ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర రాసింది. ఇప్పటికీ ఆ రికార్డు అంతే పదిలంగా ఉంది. ఆ రికార్డును కొట్టే ప్రయత్నాలు టాలీవుడ్ చేస్తున్నా పనవ్వడం లేదు. ఈ సినిమా ఒక్క చైనాలోనే వందల కోట్ల వసూళ్లను రాబట్టడంతోనే ఈ ఫీట్ సాధ్యమైంది. అయితే ఈసినిమా అప్పట్లో పాకిస్తాన్ లో విడుదల కాలేదు. రిలీజ్ అయితే అక్కడ నుంచి భారీ వసూళ్లు వచ్చేవి.
అమీర్ ఖాన్ సినిమాలకు అక్కడ మాంచి డిమాండ్ ఉంది. కానీ రిలీజ్ కాలేదు. దీంతో అక్కడ రిలీజ్ అన్నది సస్పెన్స్ గా మారింది. కారణాలు ఏంటి? అన్నది వరకూ అమీర్ ఖాన్ కూడా రివీల్ చేయలేదు. అయితే తొలిసారి ఈ విషయం గురించి అమీర్ ఖాన్ స్పందించారు. `సినిమాలో మన జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను తొలగించాలని పాకిస్తాన్ సెన్సార్ సూచించింది. అలా చేయకపోతే వాళ్ల దేశంలో విడుదల చేయలేమన్నారు.
వాళ్లు ఆలా చెప్పిన ఒక్క క్షణంలోనే పాకిస్తాన్ లో మా సినిమా విడుదల కాదని వాళ్లకు చెప్పేసాను. అలా చెప్పడానికి క్షణం కూడా ఆలోచించలేదు. నేను అలా చేయడం వల్ల సినిమా వసూళ్ల ప్రభావం చూపు తుందని నిర్మాతలు భావించారు. అయినప్పటికీ భారత్ కి వ్యతిరేకంగా దేనికి మద్దతివ్వనని స్పష్టంగా చెప్పాను` అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. భారత్ పై అమీర్ కు ఎంత దేశ భక్తి ఉన్నది ఈ వ్యాఖ్యలే చెబుతున్నాయంటూ పోస్టులు పెడుతున్నారు.