ఓజీ కోసం ఆద్య.. ఆ స్పెషల్ ప్రమోషన్ చూశారా?

ప్రస్తుతం రేణూ దేశాయ్ పెట్టిన కామెంట్ తో పాటు ఓజీ సినిమా కోసం అకీరా నందన్ , ఆద్య ఇద్దరు కలిసి వెళ్లిన ఫోటోలు అలాగే ఆద్య ఓజి సినిమాకి సంబంధించిన హుడీ వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.;

Update: 2025-09-26 05:28 GMT

పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ.. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 25న విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ సినిమా ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 24న అర్ధరాత్రి నుండే కొన్ని చోట్ల ప్రీమియర్ షోస్ పడిపోయాయి. ప్రీమియర్ షోస్ తోనే సినిమా రిజల్ట్ ఏంటో బయటపడింది. చాలా సినిమాలకు ప్రీమియర్ షోల నుండి వచ్చిన టాక్ వల్లే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎందుకంటే ప్రీమియర్స్ చూసినవాళ్లు బాగుంది అంటే సినిమా చూడడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు. ఒకవేళ బాలేదు అని రివ్యూ ఇస్తే సినిమాకి నెగిటివ్ టాక్ పడిపోతుంది.

 

కానీ ఓజీ సినిమా మాత్రం ప్రీమియర్స్ తోనే అదరగొట్టేసింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బ్లాక్ బస్టర్.. వీర మాస్ అంతే అంటూ రివ్యూలు ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్ మరింత పెరిగింది. సినిమా చూడడానికి థియేటర్లలో ప్రేక్షకులు క్యూ కట్టారు.అయితే పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి కేవలం ఆయన వీరాభిమానులు, ఇతర సామాన్య జనాలు మాత్రమే కాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మొత్తం థియేటర్లకు క్యూ కట్టింది. ముఖ్యంగా చాలామంది సెలబ్రిటీలు ఒకరోజు ముందుగానే అంటే అర్ధరాత్రి ప్రీమియర్ షోస్ చూసి సినిమాని ఆస్వాదించారు.అయితే ఈ అర్ధరాత్రి ప్రీమియర్ షోలు చూసిన వారిలో మెగా ఫ్యామిలీ కూడా ఉన్నారు.

 

మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పవన్ కళ్యాణ్ ఓజీ మూవీని థియేటర్లలో అందరితో కలిసి చూసి ఆనందించారు. వీళ్ళు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్య కూడా సినిమా చూడడం కోసం ప్రీమియర్ షో కి వెళ్లారు.. పైగా వీరిద్దరూ థియేటర్ కి వెళ్ళిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా తన కూతురికి సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది రేణు దేశాయ్. తన సోషల్ మీడియా ఖాతాలో రేణుదేశాయ్ ఓజీ సినిమాకి ఆద్య వెళ్లడంపై స్పందిస్తూ.. ఆద్య తన అన్నయ్య అకీరా నందన్ తో కలిసి సినిమా చూడడానికి చాలా ఎక్జైటింగ్ గా వెళ్లడం చూసి నేను హ్యాపీగా ఫీలయ్యాను. ఎందుకంటే ఆద్య ఇప్పుడే అంతలా ఎదిగిపోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది"అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టింది.

 

ప్రస్తుతం రేణూ దేశాయ్ పెట్టిన కామెంట్ తో పాటు ఓజీ సినిమా కోసం అకీరా నందన్ , ఆద్య ఇద్దరు కలిసి వెళ్లిన ఫోటోలు అలాగే ఆద్య ఓజి సినిమాకి సంబంధించిన హుడీ వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇదే అత్యంత స్పెషల్ ప్రమోషన్ అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. అలా తండ్రి సినిమాను చూసి అకీరా నందన్, ఆద్య ఇద్దరు చాలా ఎంజాయ్ చేశారు.. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు నిర్మాత నాగ వంశీ, ఎస్ కే ఎన్, డైరెక్టర్ బాబి,హీరో నాని వంటి వాళ్ళు సినిమాకి భారీ హైప్ ఇస్తూ పెట్టిన ట్వీట్లు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పుట్టిస్తున్నాయి.పైగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 90 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం.

Tags:    

Similar News