• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Education >  కెనడాకు వెళ్లే భారత్ ...

కెనడాకు వెళ్లే భారత్ విద్యార్థుల్లో భారీ తగ్గుదల... కారణం ఇదే!

| దీంతో కెనడా 41 మంది దౌత్యాధికారులను వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో స్టడీ పర్మిట్లను ఎక్కువమొత్తంలో ప్రాసెస్‌ చేయడం కుదరలేదని ఆ దేశ ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

By - Tupaki Desk
Update: 2024-01-17 09:40 GMT

ప్రస్తుతం కెనడాలో నెలకొన్న పరిస్థితులతోపాటు.. భారత్ తో ఏర్పడిన దౌత్యపరమైన విభేదాలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు ఇండియన్ ఏజెంట్సే కారణమంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన నిరాధార ఆరోపణలు రెండు దేశాల మధ్య తీవ్ర విభేదాలను రాజేశాయి. దీంతో ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది.

దీంతో దేశరాజధాని ఢిల్లీలోని తమ రాయబారులను భారీ సంఖ్యలో తగ్గించుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది. దీంతో కెనడా 41 మంది దౌత్యాధికారులను వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో స్టడీ పర్మిట్లను ఎక్కువమొత్తంలో ప్రాసెస్‌ చేయడం కుదరలేదని ఆ దేశ ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదే సమయంలో సమీప భవిష్యత్తులో పెరిగే సంకేతాలు కూడా కనిపించడం లేదని పేర్కొన్నారు.

ఫలితంగా... భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా ప్రభుత్వం గణనీయంగా తగ్గించింది. ఈ క్రమంలో... గత ఏడాది డిసెంబర్‌ తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 14,910 పర్మిట్లను మాత్రమే జారీ చేసింది. అంతకుముందు మూడు నెలల వ్యవధిలో ఈ సంఖ్య 1,08,940గా ఉండటం గమనార్హం. అంటే... పర్మిట్లలో సుమారు 86 శాతం తగ్గుదల నమోదైందన్నమాట.

కాగా... కెనడాలో చదువుకోవడానికి వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికం అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... 2022లో కెనడా ప్రభుత్వం 2,25,835 స్టడీ పర్మిట్లను జారీ చేయగా.. అందులో సుమారు 41 శాతం భారతీయ విద్యార్థులే సొంతం చేసుకున్నారు. మరోవైపు విదేశీ విద్యార్థుల వలసలు పెరగడంతో కెనడాలో నిరుద్యోగం, ఇళ్ల కొరత సమస్యలు తలెత్తుతున్నాయని ఇటీవల మార్క్‌ మిల్లర్‌ వెల్లడించారు.

Tags:    
  • India 
  • Canada 
  • Students 
  • Abroad 
  • Higherstudies 
  • Hardeepsinghnijjar 
  • Khalistani 
  • Marcmiller 
  • Canadian 
  • Immigrationminister 

Similar News

F-1 వీసా రిజెక్ట్ అయితే 300 రోజులు ఆగాలా?

2026-10-25 04:52 GMT

మళ్లీ పుస్తకాల వైపు స్వీడన్ అడుగులు.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

2026-04-20 10:30 GMT

పెరిగిపోతున్న నిరక్షరాస్యత.. పెద్దలే కాదు యువతలో భారీ మార్పు!

2026-03-17 11:30 GMT

భారత రాష్ట్రాల్లో అక్షరాస్యత రేటు ఎంత? రాష్ట్రాల వారీగా అక్షరాస్యత గణాంకాలు!

2026-03-10 08:30 GMT

పెళ్లయిన మరుసటి రోజే రికార్డు సృష్టించిన విరోష్ జంట.. 12 గంటల్లోనే!

2026-02-27 05:13 GMT

విదేశీ విద్యపై తగ్గుతున్న ఆసక్తి: రెండేళ్లలో 31 శాతం పడిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య!

2026-02-26 11:30 GMT

చదువుల్లో టాప్ .. ఏపీ యువతనే విదేశాల్లో దున్నేస్తోంది..

2025-12-23 12:30 GMT

కాలేజీల్లో రాజకీయాలు, జెండాలు.. లోకేష్ సంచలన నిర్ణయాలు!

2025-11-22 05:41 GMT

School Holiday: పిల్లలు ఎగిరిగంతేసే వార్త..ఈరోజు ఆంధ్రప్రదేశ్, చెన్నైలో అన్ని స్కూళ్లకు సెలవు..

2025-10-23 02:05 GMT

దేశంలో టాప్ 10 కాలేజీలు ఇవే.. తెలుగు రాష్ట్రాలకు వందలోనూ నో ప్లేస్

2025-09-25 04:00 GMT

తెలుగు రాష్ట్రాల వారికి పండుగ లాంటి వార్త.. వరుసగా 3 రోజులు సెలవులు

2025-08-01 04:12 GMT

అసలైన మిడిల్ క్లాస్‌ కిల్లర్ ఇదే... దాదాపు అందరూ బాధితులే!

2025-07-17 04:00 GMT

Copyright @2026

Powered by Blink CMS