చదువుల్లో టాప్ .. ఏపీ యువతనే విదేశాల్లో దున్నేస్తోంది..

కేంద్ర ప్రభుత్వ థింక్ ట్యాంక్ నీతి అయోగ్ సోమవారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. విదేశాలకు వెళుతున్న విద్యార్థుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.;

Update: 2025-12-23 12:30 GMT

ఉన్నత విద్య కోసం విదేశీ బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. గ్లోబల్ డిగ్రీలే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ యువత దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటారు. కేంద్ర ప్రభుత్వ థింక్ ట్యాంక్ నీతి అయోగ్ సోమవారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. విదేశాలకు వెళుతున్న విద్యార్థుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది.

రాష్ట్రాల వారీగా అగ్రస్థానంలో ఏపీ

నీతి అయోగ్ నివేదికలోని 2020 గణాంకాలను పరిశీలిస్తే.. విదేశీ విద్య కోసం వెళ్లిన వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా 35412 మంది విద్యార్థులున్నారు. ఈ జాబితాలో పంజాబ్ (33412) రెండో స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర (29079) మూడో స్థానాన్ని దక్కించుకుంది. గుజరాత్ ఢిల్లీ, తమిళనాడు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా అదే ఏడాది లెక్కల ప్రకారం.. తెలుగు రాష్ట్రమైన తెలంగాణ టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. గత కొన్నేళ్ల ట్రెండ్ ను పరిశీలిస్తే.. ఏపీ నుంచి 2016లో 46818 మంది, 2018లో ఏకంగా 62771 మంది విదేశీయులకు వెళ్లారు. అయితే 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ సంఖ్య కొంత తగ్గినప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ విద్యార్థులే పై చేయి సాధించారు.

2024లో ‘గ్లోబల్ ఎడ్యూకేషన్’ హవా

2024 సంవత్సరానికి సంబంధించి భారతీయ విద్యార్థుల విదేశీ చదువులపై నివేదిక పలు కీలక అంశాలను వెల్లడించింది. 2024లో మొత్తం 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ దేశాల్లో విద్యనభ్యసిస్తున్నారు. భారత విద్యార్థుల మొదటి ఛాయిస్ గా కెనగా (4.27 లక్షలు) నిలిచింది. ఆ తర్వాత అమెరికా (3.37 లక్షలు) , బ్రిటన్ (1.85 లక్షలు) , ఆస్ట్రేలియా (1.22 లక్షలు), జర్మనీ (42997) ఉన్నాయి. విదేశీ విద్య కోసం భారతీయ విద్యార్థులు ఏకంగా రూ.6.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది మన దేశ జీడీపీలో దాదాపు 2శాతంకి సమానం కావడం గమనార్హం.

ఆందోళన కలిగిస్తున్న ‘బ్రెయిన్ డ్రైన్’

భారత్ నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటే విదేశాల నుంచి భారత్ కు వచ్చేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని నీతి అయోగ్ పేర్కొంది. ‘భారతదేశానికి వచ్చే ప్రతీ ఒక్క అంతర్జాతీయ విద్యార్థికి బదులుగా.. 28 మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. ఇది దేశంలో ‘మేధో వలస’ తీవ్రతను సూచిస్తోంది అని నివేదిక హెచ్చరించింది.

విద్యార్థులు మొగ్గుచూపుతున్న కోర్సులు ఇవీ

మారుతున్న కాలానికి అనుగుణంగా ఏపీ విద్యార్థులు సాంప్రదాయ కోర్సులతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) , డేటా సైన్స్, మెషిన్ లర్నింగ్, స్టెమ్ కోర్సులపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. మెరుగైన ఉపాధి అవకాశాలు.. అంతర్జాతీయ స్థాయిలో లభించే వేతన ప్యాకేజీలే యువతను విదేశాల వైపు నడిపిస్తున్నాయి.

రాబోయే రోజుల్లో ఏపీ యువత ఇదే జోరును కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు సరైన గైడెన్స్, ఫైానాన్షియల్ సపోర్ట్ అందిస్తే వీరు గ్లోబల్ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంది.

Tags:    

Similar News