పెళ్లయిన మరుసటి రోజే రికార్డు సృష్టించిన విరోష్ జంట.. 12 గంటల్లోనే!
విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ కు ఏకంగా 12 గంటల్లోనే 12 మిలియన్ లైక్స్ రాగా.. రష్మిక పెట్టిన పోస్ట్ కి 14 మిలియన్ లైక్స్ వచ్చాయి.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ రూమర్డ్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గీత గోవిందం సినిమాతో మొదలైన వీరి పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారింది. అప్పటినుంచి మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతూ తమ బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. కలిసి వెకేషన్ కి వెళ్లడం, కలిసి పండుగలను సెలబ్రేట్ చేసుకోవడం లాంటివి చేస్తూ వచ్చారు. అయితే విడివిడిగా ఫోటోలు షేర్ చేయడంతో వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే విషయాన్ని.. వీరు షేర్ చేసిన ఫోటోల బ్యాక్ గ్రౌండ్ స్పష్టం చేసింది.
ఉదయపూర్ ప్యాలెస్ సాక్షిగా ఒక్కటైనా విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న..
అయితే ఎప్పుడెప్పుడు వీరు తమ బంధం గురించి ఓపెన్ అవుతారా అని అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. కానీ ఎక్కడ కూడా ఆ విషయాన్ని బయట పెట్టలేదు. పైగా గతేడాది రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక దీంతో వీరి పెళ్లి వార్తలకు ఊపందుకుంది. ఇక ఎట్టకేలకు అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ అభిమానులు ముద్దుగా పెట్టుకున్న "విరోష్" అనే పదాన్ని స్వీకరించి.. "ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్" అంటూ ప్రకటించారు. ఇక అన్నట్టుగానే ఉదయపూర్ లోని హై ప్రొఫైల్ ప్యాలెస్ లో హిందూ సాంప్రదాయం ప్రకారం ఉదయం 10:10 గంటలకు అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య విజయ్ - రష్మిక ఏడడుగులు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు రష్మిక మందన్న మత ఆచారాల ప్రకారం కొడవ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. అలా రెండుసార్లు ఈ జంట వివాహం చేసుకోవడం జరిగింది.
12 గంటల్లోనే ఊహించని రికార్డ్ సొంతం చేసుకున్న పెళ్లి ఫోటోలు..
ఇకపోతే వివాహం అనంతరం అటు విజయ్ దేవరకొండ రష్మిక మందన్న తమ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాల ద్వారా పెళ్లి ఫోటోలను షేర్ చేయగా .. షేర్ చేసిన 12 గంటల్లోనే ఇవి రికార్డు సృష్టించాయి. విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ కు ఏకంగా 12 గంటల్లోనే 12 మిలియన్ లైక్స్ రాగా.. రష్మిక పెట్టిన పోస్ట్ కి 14 మిలియన్ లైక్స్ వచ్చాయి. దీంతో ఈ పెళ్లి ఫోటోలకు కేవలం 12 గంటల్లోనే 2.6 కోట్ల లైక్స్ రావడం నిజంగా సంచలనం అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
రిసెప్షన్ ఆరోజే..
మరోవైపు అతి తక్కువ సమయంలోనే ఈ స్థాయి రికార్డు క్రియేట్ చేయడానికి కారణం ఈ జంటకి ఉన్న క్రేజ్ అనే చెప్పాలి. గత ఎనిమిది సంవత్సరాలుగా అభిమానులకు, సెలబ్రిటీలకు ఎక్కడ తమ బంధాన్ని రివీల్ చేయకుండా ఉత్కంఠ రేపిన ఈ జంట.. ఎట్టకేలకు ఫోటోలు షేర్ చేయడంతో ఇక ఆ ఫోటోలు చూడడానికి చాలామంది ఆసక్తి కనబరిచారు. అదే ఇప్పుడు ఈ రికార్డ్స్ క్రియేట్ చేయడానికి కారణమైందని చెప్పాలి. ఇక మరొకవైపు హైదరాబాదులోని తాజ్ కృష్ణ హోటల్ విజయ్ , రష్మిక మందన్న రిసెప్షన్ మార్చి 4న జరగనుంది . ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.