అల్లరోడు మూవీ.. మూడో రోజు మరింత ఎక్కువగా..

ఇక మూడో రోజు.. గత రెండు రోజుల కన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ.. మూడో రోజు రూ.1.76 కోట్లు రాబట్టింది.

Update: 2024-05-06 09:00 GMT

తెలుగు సినీ ఇండస్ట్రీలో కామెడీ చిత్రాలతో హీరో అల్లరి నరేష్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఆయన నటించిన కామెడీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' ఇటీవల విడుదలైంది. బ్యాక్ టు బ్యాక్ సీరియస్ సినిమాలతో హిట్స్ అందుకున్న నరేష్.. మరోసారి కామెడీ జానర్ లో మూవీ చేయడంతో సినీ ఆడియన్స్ దృష్టి ఈ చిత్రంపై పడింది.

ఈ సినిమాకు డైరెక్టర్ మల్లి అంకం దర్శకత్వం వహించగా.. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా నిర్మించారు. జాతిరత్నాలు సినిమాతో చిట్టిగా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా యాక్ట్ చేసింది. మే 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రమోషన్స్ బాగా చేయడంతో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. ఇప్పుడు వసూళ్లు కూడా బాగానే రాబడుతోంది.

ఈ సినిమా మొదటి రోజు రూ.1.62 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టగా.. రెండో రోజు ఫస్ట్ డే కన్నా ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. తొలి రెండు రోజులు కలిపి రూ.3.34 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక మూడో రోజు.. గత రెండు రోజుల కన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ.. మూడో రోజు రూ.1.76 కోట్లు రాబట్టింది. దీంతో ఇప్పటి వరకు 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా.. రూ.5.10 కోట్లు వసూలు చేసింది.

ఇక ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా మంచి ఎంటర్టైనింగ్ గా ఉండడంతో థియేట్రికల్ రన్ అద్భుతంగా సాగే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. చిలకా ప్రొడక్షన్ బ్యానర్ పై డెబ్యూ మూవీగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుందని తెలిపారు. ఈ చిత్రంలో కమెడియన్ వెన్నెల కిషోర్, అరియానా గ్లోరీ, హర్ష, జమ్మీ సహా పలువురు కీలక పాత్రలను పోషించారు.

Read more!

స్టోరీ లైన్ ఇదే..సినిమాలో 30 ఏళ్లు వచ్చినా పెళ్లి కాని అల్లరి నరేష్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో పని చేస్తుంటాడు. అప్పటికే తన తమ్ముడికి పెళ్లి చేస్తాడు. కానీ తనకు మాత్రం ఎవరూ పిల్లనివ్వరు. చివరకు మాట్రిమోనిలో చేరుతాడు. దాని ద్వారా పరిచయమైన ఫరియాతో ప్రేమలో పడతాడు. కానీ ఆ తర్వాత హీరోయిన్.. మాట్రిమోనిలో చేరిన అబ్బాయిలను మోసం చేస్తుందనే వార్త బయటకు వస్తుంది. మరి అప్పుడు హీరో ఏం చేశాడు? చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా.

Tags:    

Similar News