• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  District News >  Andhra Pradesh >  నిన్న రామ‌చంద్ర‌పురం.....

నిన్న రామ‌చంద్ర‌పురం.. ఇప్పుడు స‌త్తెన‌ప‌ల్లి.. వైసీపీలో కాక రేగుతోందిగా!

| ఆయ‌న ఇంట్లో తాజాగా స‌త్తెనప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ నేత‌లు భేటీ అయ్యారు.

By - Tupaki Desk
Update: 2023-07-20 04:21 GMT

"ఏపీ అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు ప్ర‌తిప‌క్షాలు ఎందుకు తొంద‌ర‌ప‌డుతున్నాయి. వారు మౌనంగా ఉండి. వారి ప‌నివా రు చేసుకుంటే చాలు. ఎందుకంటే.. వైసీపీ నేత‌ల‌ను వైసీపీ నాయ‌కులే ఓడించుకుంటారు. అలా ఉంది రాష్ట్రంలో ప‌రిస్థితి"- ఇది ఓ వారం కింద‌ట జాతీయ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌లో ఒక సీనియ‌ర్ ఢిల్లీ జ‌ర్న‌లిస్టు రాసిన వ్యాసంలో పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో రాసిన మాట‌.

ఇప్పుడు నిజ‌మే అవుతోంది. రెండురోజులుగా ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని రామ‌చంద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుపై.. రాజ్య‌స‌భ స‌భ్యుడు, సీనియ‌ర్ నాయ‌కుడు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ నిప్పులు చెరిగారు.

మంత్రి వేణు వ్య‌తిరేక వ‌ర్గాన్ని కూడ‌గ‌ట్టుకుని మ‌రీ స‌మావేశాలు పెట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ త‌మ‌దేన‌ని ప్ర‌క‌టించుకున్నా రు. ఇక‌, మంత్రి కూడా త‌న అనుచ‌ర వ‌ర్గంతో పిల్లి వ‌ర్గంపై నిప్పులు చెరిగించారు.

మొత్తానికి రామ‌చంద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య అగ్గి రాజుకుని..రోజురోజుకు సెగ‌లు..పొగ‌లు క‌క్కుతోంది. దీనిని చ‌ల్లార్చేందుకు వైసీపీ అధిష్టానం ప్ర‌య‌త్నిస్తున్నా.. అవి ఎక్క‌డా చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా జోక్యం చేసుకున్నా.. మంత్రి అక్ర‌మాలు.. పోలీసుల‌తో కేసులు పెట్టించ‌డాన్ని పిల్లి వ‌ర్గం తీవ్రంగా భావిస్తోంది.

క‌ట్ చేస్తే.. రామ‌చంద్ర‌పురం నుంచి ఆ సీన్ ఇప్పుడు ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపించింది. తాజాగా మంత్రి అంబ‌టి రాంబాబుకు వ్య‌తిరేకంగా ఇక్క‌డ వైసీపీ నాయ‌కులు కూట‌ములు క‌ట్టారు.

వైసీపీ ముఖ్య‌నాయ‌కుడు.. పొరుగు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేకు స‌న్నిహితంగా ఉండే.. రెడ్డి నేత చిట్టా విజయ బాస్కర్ రెడ్డి ఈ కూట‌మికి సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఆయ‌న ఇంట్లో తాజాగా స‌త్తెనప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ నేత‌లు భేటీ అయ్యారు. వీరంతా కూడా మంత్రి అంబ‌టి వ్య‌తిరేక‌వ‌ర్గం కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ స‌మ‌యంలో మంత్రి అంబ‌టి వ్య‌వ‌హార శైలిపై వారు చ‌ర్చించారు. ముఖ్యంగా సొంత నేత‌ల‌కు ఆయ‌న అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డం.. త‌మ‌కు క‌నీసం క‌నిపించ‌క‌పోవ‌డం.. వంటివి చ‌ర్చించారు.

అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఏ కార్య‌క్ర‌మానికీ త‌మ‌ను ఆహ్వానించ‌క‌పోవ‌డం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అంబటి అనుచరుల పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు కూడా అంబటిని కలిసే అవకాశం ఉండటం లేదని తమ ఆవేదనను వెలుబుచ్చారు. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ స‌మావేశానికి స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు హాజరయ్యారు.వీరంతా కూడా గ‌త ఎన్నిక‌ల్లో అంబ‌టి గెలుపున‌కు కృషి చేసిన వారే కావ‌డం గ‌మ‌నార్హం.

Tags:    
  • Ramachandrapurram 
  • Sattenapallly 
  • Elections 
  • PilliSubhash 
  • ChellaboinaVenu 
  • AmbatiRambabu 
  • PoliticalNews 

Similar News

కొడాలికి లోకల్ షాక్.. గుడివాడలో తొలిసారి టీడీపీ ఇలా..

2026-11-08 13:34 GMT

నాడు సస్పెండ్ చేశారు.. నేడు దండలేసి ఆహ్వానిస్తున్నారు! స్థానిక రాజకీయంలో తిరగబడ్డ సీన్

2026-11-08 13:30 GMT

కాంగ్రెస్ బ‌ల‌మా... ప‌ర్స‌న‌ల్ ఎటాచ్‌మెంటా.. ?

2026-11-08 11:15 GMT

జ‌గ‌న్ - అదానీ భేటీ.. పొలిటిక‌ల్ చ‌ర్చ నిజ‌మేనా ..?

2026-11-08 11:14 GMT

స్థానికం అంటే ఇంతేమరి.. ఓటర్ల లెక్క వేరే, ఈ ఫలితాలే నిదర్శనం

2026-11-08 11:12 GMT

వైసీపీ గెలుపు లెక్క...కిందా పడినా పైచేయి అంటూ !

2026-11-08 07:52 GMT

విశాఖకు అమిత్ షా చంద్రబాబు...మరోసారి అంతర్జాతీయ వేదికగా !

2026-11-08 04:43 GMT

ఎంపీగా గెలిచి.... జెడ్పీటీసీగా ఓడి....ఎందుకలా ?

2026-11-08 03:07 GMT

అక్కడ కూటమి క్లీన్ స్వీప్...వైసీపీ ఎక్కడ ?

2026-11-08 03:05 GMT

ఎమ్మెల్యే కళా వెంకటరావు ఆశలు గల్లంతు.. షాక్ ఇచ్చిన బొత్స

2026-11-08 03:05 GMT

సాయిరెడ్డి కొత్త పార్టీ: ఎవరికి ఎంతెంత ఎఫెక్ట్‌?

2026-11-08 03:05 GMT

ఎంపీటీసీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు: ఒకరిపై ఒకరు పోటీ పడి గెలిచిన రక్తసంబంధీకులు!

2026-11-08 03:01 GMT

Copyright @2026

Powered by Blink CMS