• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  Visakhapatnam >  అయ్యన్న ఫ్యామిలీ...

అయ్యన్న ఫ్యామిలీ ప్యాక్...టీడీపీలోనే స్పెషల్

| నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు కుటుంబం సత్తా చాటింది. ఆయన సతీమణి పద్మావతి భారీ మెజారిటీతో చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. మొత్తం 40 వార్డులకు గాను 39 స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకుంది. మరోవైపు పెద్ద కుమారుడు విజయ్ రాజ్యసభ సభ్యుడిగా ఉండగా, చిన్న కుమారుడు రాజేష్ రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. 2029లో రాజేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.

By - Satya P
Update: 2026-11-07 03:52 GMT

ఉమ్మడి విశాఖ జిల్లాలో మంత్రిగా పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో కొనసాగుతున్నారు. 2024 గెలుపుతో అయ్యన్న అసెంబ్లీకి ఏడు సార్లు నెగ్గినట్లు అయింది. ఏపీలో ఇన్ని సార్లు గెలిచిన వారు అతి తక్కువ మంది ఉన్నారు. ఇక రాజకీయంగా చూస్తే అయ్యన్న సీనియారిటీ నాలుగున్నర దశాబ్దాల పైబడి ఉంది. అయ్యన్న 1983లోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ వెంటనే మంత్రి కూడా అయ్యారు. ఎన్టీఆర్ చంద్రబాబు రెండు ప్రభుత్వాలలో పనిచేసిన ఘనత అయ్యన్నకే దక్కుతుంది. ఇపుడు అయ్యన్న ఏడు పదుల వయసులో ఉన్నారు. ఆయన రాజకీయ వారసులు కూడా అందుకొచ్చారు. అలాగే ఆయన సతీమణి కూడా 2021 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

చైర్ పర్సన్ గా విక్టరీ :

అయ్యన్న సతీమణి పద్మావతి తాజాగా జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో వైసీపీ మీద భారీ మెజారిటీతో గెలిచి చైర్ పర్సన్ అయ్యారు. ఇక 40 వార్డులు ఉన్న నర్శీపట్నం మునిసిపాలిటీలో 39 వార్డులను కూటమి గెలుచుకుని రికార్డులను తిరగరాసింది. ఇక్కడ ప్రత్యర్ధికి ఏ విధంగానూ చాన్స్ ఇవ్వలేదు. దాంతో మొత్తం నర్శీపట్నం అంతా కూటమే పాలించనుంది. ఇంతటి ఘన విజయం దక్కించుకున్న పద్మావతి ఈ నెల 23న చైర్ పర్సన్ గా ప్రమాణం చేయనున్నారు. ఆమె 2021లో వైసీపీ హయాంలో అనివార్య పరిస్థితుల్లో కౌన్సిలర్ గా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా 28 వార్డులు ఉంటే 12 దాకా టీడీపీ గెలుచుకుని బలమైన ప్రతిపక్షం అయింది. పద్మావతి కౌన్సిలర్ గా గెలిచి ప్రతిపక్ష పాత్రని పోషించారు. ఇపుడు అదే ఆమెని చైర్ పర్సన్ గా కూర్చోబెట్టింది అని అంటున్నారు.

విజయ్ రాజ్యసభకు :

మరో వైపు చూస్తే అయ్యన్న పెద్ద కుమారుడు విజయ్ రాజ్యసభ సభ్యుడిగా నాలుగు నెలల క్రితం నామినేట్ అయ్యారు. ఆయన ఉత్తరాంధ్ర నుంచి ఈ కీలక పదవిని అందుకున్నారు. ఇలా అయ్యన్న కుటుంబంలో విజయ్ ఎంపీగా పెద్దల సభకు వెళ్లడం కూడా ఒక అరుదైన అవకాశంగా చెబుతున్నారు. అయ్యన్న గతంలో అంటే 1998లో అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచి 13 నెలల పాటు లోక్ సభలో ఉన్నారు. ఇపుడు రాజ్యసభకు విజయ్ నెగ్గారు, అలా అయ్యన్న ఫ్యామిలీ రెండు సభలలోనూ ఉన్నట్లు అయింది. విజయ్ కి ఈ పదవి దక్కడంతో అయ్యన్న ఫ్యామిలీలో మూడు పదవులు ఇప్పటికి ఉన్నట్లు అయింది.

ఎమ్మెల్యేగా పోటీకి :

ఇక అయ్యన్న రెండవ కుమారుడు రాజేష్ కూడా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఆయన 2021లో కౌన్సిలర్ గా టీడీపీ తరఫున గెలిచారు. గత అయిదేళ్ళూ మునిసిపల్ రాజకీయాల్లో రాజేష్ దే కీలక పాత్రగా ఉంది. నిజానికి చైర్మన్ పదవికి రాజేష్ పోటీ చేస్తారు అని అనుకున్నారు. కానీ మహిళకు రిజర్వ్ కావడంతో అయ్యన్న సతీమణి రంగంలోకి దిగారని అంటున్నారు. అయితే రాజేష్ 2029 ఎన్నికల్లో నర్శీపట్నం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేస్తారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే అయ్యన కుటుంబం నుంచి నాలుగవ వారు కూడా చట్ట సభలలో ప్రవేశించినట్లు అవుతుంది. మొత్తానికి టీడీపీలో అత్యంత సీనియర్ నేత అయిన అయ్యన్న ఫ్యామిలీని టీడీపీ అధినాయకత్వం ఈ విధంగా గుర్తించి గౌరవిస్తోంది అని అంటున్నారు.

Tags:    
  • ayyannapatrudu 
  • narsipatnam 
  • tdp 
  • andhrapradeshpolitics 
  • padmavathi 

Similar News

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

విశాఖలో ఎలక్ట్రిక్ బస్సులు...వారికి ఫ్రీగానే !

2026-11-16 18:55 GMT

అభివృద్ధి మ్యాప్ లో భీమిలీ మారుమూల గ్రామం !

2026-11-14 03:22 GMT

సమ్మిట్ సూపర్ హిట్... 303 ప్రాజెక్టులు...9.89 లక్షల కోట్ల పెట్టుబడులు !

2026-11-14 03:20 GMT

ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు....బాబు కీలక కామెంట్స్

2026-11-13 18:30 GMT

మీ తాత మా తాత గ్రేట్...లోకేష్ తో ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

2026-11-13 04:06 GMT

ఫస్ట్ డే సమ్మిట్ హిట్.. ఒప్పందాలో బిగ్ షాట్స్

2026-11-12 18:29 GMT

సీఎం చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్ : ఏపీకి రూ. 32.49 లక్షల కోట్ల పెట్టుబడులు

2026-11-12 11:34 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

Copyright @2026

Powered by Blink CMS