• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  రాజమండ్రికి 'మహా...

రాజమండ్రికి 'మహా కుంభమేళా' వైభవం.. గోదావరి పుష్కరాల ప్రత్యేకతలు ఇవే..!

| వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల కోసం ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాలకు రూ.904 కోట్లు, రాజమండ్రి అభివృద్ధికి రూ.456 కోట్లు కేటాయించింది. 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తోంది. కుంభమేళా తరహాలో టెంట్ సిటీలు, 50 వేల హోమ్‌స్టే గదులు ఏర్పాటు చేయడంతో పాటు 440 ఘాట్ల వద్ద ఏఐ నిఘా ఏర్పాటు చేయనుంది.

By - Tupaki Desk
Update: 2026-11-25 13:13 GMT

గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది జూన్ 26న మొదలయ్యే పుష్కరాలు జులై 7వ తేదీ వరకు జరగనున్నాయి. మరో ఏడు నెలల్లో ప్రారంభమయ్యే ఈ మహా క్రతువును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం భారీగా నిధులు సమకూర్చింది. పుష్కరాల కోసం రూ.904 కోట్లు, రాజమండ్రి నగరంలో రోడ్లు, వంతెన అభివృద్ధి కోసం మరో రూ.456 కోట్లు విడుదల చేశారు. అదేవిధంగా ఆర్ అండ్ బీ పరిధిలో పనుల కోసం రూ.678 కోట్లతో వివిధ రకాల పనులు చేస్తున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాలను ఈ సారి మహా కుంభమేళా తరహాలో నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటోందని చెబుతున్నారు.

ప్రధాని మోదీకి ఆహ్వానం

మహా గోదావరి పుష్కరాలకు ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీలైతే ప్రధాని మోదీ చేతుల మీదుగా పుష్కర సంబరం ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికార వర్గాలను ఆదేశించారని అంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు చర్చించారని అంటున్నారు. అయితే అప్పటి పరిస్థితులను బట్టి ప్రధాని కార్యక్రమం నిర్ణయిస్తారని చెబుతున్నారు. ప్రతి 12 ఏళ్లకు జరిగే పుష్కరాలను మూడు సార్లు నిర్వహించే అరుదైన అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చిందని అంటున్నారు. గతంలో 2003, 2015ల్లో గోదావరి పుష్కరాలు జరిగాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన నేతృత్వంలోనే పుష్కరాలు నిర్వహించే అరుదైన అవకాశం మరోసారి వచ్చిందని అంటున్నారు. దీంతో ఈ సారి కనీవినీ ఎరుగని రీతిలో పుష్కరాలకు ఏర్పాట్లు చేసి చరిత్రలో చెరగని ముద్ర వేయాలని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు.

కుంభమేళా తరహా ఏర్పాట్లు

గోదావరి పుష్కరాలను దక్షిణ భారత్ కుంభమేళాగా పిలుస్తారు. ఎంతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టత ఉన్న వేడుకను అత్యద్భుతంగా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా వసతి సమస్య నివారణకు కుంభమేళాలో నిర్మించిన టెంట్ సిటీ తరహాలో రాజమండ్రిలో కూడా భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా పుష్కరాలకు దాదాపు 8 నుంచి పది కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రతి రోజు కనీసం 75 లక్షల మంది పుష్కర స్నానాలు చేస్తారని భావిస్తున్నారు. దీంతో భక్తులకు వసతి సమస్య తలెత్తకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. గోదావరి పరిసర ప్రాంతాల్లో ప్రధాన ఆలయాలతోపాటు లంక గ్రామాల్లో భారీ ఎత్తున టెంట్ సిటీలను నిర్మించాలని భావిస్తోంది. రాజమండ్రి సమీపంలోని పిచ్చుకలంకతోపాటు 21 ప్రధాన ఆలయాల పక్కన ఈ టెంట్ సిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తులు కేవలం పుష్కర స్నానం చేసి వెళ్లిపోకుండా, కనీసం 2 నుండి 3 రోజులు అక్కడే బస చేసి పరిసర ప్రాంతాలను సందర్శించేలా ఈ విడిది కేంద్రాలను తీర్చిదిద్దుతున్నారు. ఇక టెంట్ సిటీలకు అదనంగా, గోదావరి జిల్లాల్లో సంప్రదాయ ఇళ్లను ఎంపిక చేసి 'హోమ్ స్టే' విధానం ద్వారా 50 వేల గదులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఏఐతో రద్దీ నివారణ

ఇక పుష్కరాలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వాడుకోవాలని నిర్ణయించింది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో తొక్కిసలాట ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు నిరంతరం సీసీ కెమెరాల ద్వారా ఏఐ నిఘా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న 440 పుష్కర ఘాట్ల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత క్రౌడ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను ఉపయోగించాలని నిర్ణయించారు. దీనిద్వారా ఘాట్లు వద్ద యాత్రికులు ప్రవేశ, నిష్క్రమణ మార్గాల వద్ద ఉన్న ఏఐ కెమెరాలు భక్తుల కదలికలను నిరంతరం విశ్లేషిస్తాయి. ఏదైనా ప్రాంతంలో సామర్థ్యానికి మించి రద్దీ పెరుగుతుంటే వెంటనే కంట్రోల్ రూమ్‌కు తక్షణ హెచ్చరికలు అందజేస్తాయి. ఫలితంగా రద్దీ పెరగకుండా భక్తులను ఇతర చోట్లకు మళ్లించేలా ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. అదేవిధంగా ఏఐ చాట్ బాట్ ను అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో బహుభాషల ద్వారా భక్తులు సమాచారం తెలుసుకోవచ్చునని అంటున్నారు.

Tags:    
  • godavaripushkaralu 
  • godavaripushkaralu2027 
  • andhrapradesh 
  • apgovernment 
  • chandrababunaidu 

Similar News

ఇంటింటికీ వచ్చి క్షమాపణ చెబుతా: గౌతు శిరీష సంచలన వీడియో

2026-11-25 12:50 GMT

ఒకే క్లిక్‌తో 10 లక్షల మందికి సందేశం.. టీడీపీని నడిపిస్తున్న డిజిటల్ వెన్నెముక

2026-11-25 12:05 GMT

జ‌న‌సేన 'క‌ట్టు' త‌ప్పుతోంది: సాగ‌దీతే కార‌ణమా.. ?

2026-11-25 12:04 GMT

టీడీపీలో సామాన్య కార్యకర్తలకు పదవులు.. అసలు సీక్రెట్ ఇదే.. పనిచేసిన లోకేశ్ మాస్టర్ ప్లాన్!

2026-11-25 11:01 GMT

10 లక్షల మందితో ‘మైటీడీపీ’ యాప్ సరికొత్త రికార్డు.. లోకేశ్ డిజిటల్ వ్యూహం సక్సెస్!

2026-11-25 10:31 GMT

విశాఖ పేరు మారుతోందా...క్లారిటీ ఇదే !

2026-11-25 04:03 GMT

అటు గుండమ్మ...ఇటు రాధమ్మ

2026-11-25 04:02 GMT

సీట్లు పెరగకపోతే కూటమికి కష్టమే సుమా !

2026-11-24 18:22 GMT

గుడివాడలో అగ్గి రాజుకుంటోంది... కోస్తాంధ్రాలో మరో తాడిపత్రి !

2026-11-24 18:22 GMT

చివ‌ర‌కు.. ప‌వ‌న్ మాటే 'గెలిచింది'!

2026-11-24 18:17 GMT

డిసెంబర్ 3న విజయసాయిరెడ్డి కీలక ప్రకటన.. 'పరివర్తన రాజనీతి పార్టీ' దిశ, దశపై ఉత్కంఠ!

2026-11-24 18:11 GMT

Copyright @2026

Powered by Blink CMS