• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  ఇంటింటికీ వచ్చి క్షమాపణ...

ఇంటింటికీ వచ్చి క్షమాపణ చెబుతా: గౌతు శిరీష సంచలన వీడియో

| పలాస-కాశీబుగ్గ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని కళింగ కోమటి సామాజికవర్గానికి ఇస్తానని హామీ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష మాట నిలబెట్టుకోలేకపోయారు. కూటమి పొత్తులో భాగంగా ఆ పదవిని జనసేనకు కేటాయించడంతో ఆమె భావోద్వేగ వీడియో విడుదల చేసి క్షమాపణలు కోరారు. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

By - Tupaki Desk
Update: 2026-11-25 12:50 GMT

రాజకీయాల్లో హామీలు నెరవేరనప్పుడు సాధారణంగా కారణాలు చెప్పి దాటవేయడం లేదా మరో కొత్త వాగ్దానంతో సర్దిచెప్పడం పరిపాటిగా కనిపిస్తుంది. కానీ, పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష విడుదల చేసిన ఒక భావోద్వేగ వీడియో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవి విషయంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని బహిరంగంగా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఆమె క్షమాపణ కోరడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎమ్మెల్యేగా తన చేతుల్లో నిర్ణయాధికారం ఉంటుందని భావించి హామీ ఇచ్చానని, అయితే కూటమి ధర్మం అడ్డు పడటంతో తన మాట నిలబెట్టుకోలేకపోయానని ఎమ్మెల్యే శిరీష చెప్పడం అందరినీ కదిలిస్తోందని అంటున్నారు.

ఇటీవల జరిగిన పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో వైస్ చైర్మన్ పదవిని కళింగ కోమటి (వైశ్య) సామాజికవర్గానికి ఇస్తానని ఎమ్మెల్యే గౌతు శిరీష హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి పొత్తు ధర్మంలో భాగంగా పార్టీ అధిష్టానం ఆ పదవిని జనసేనకు కేటాయించింది. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహించక తప్పని పరిస్థితి ఏర్పడటంతో కళింగ కోమట్లకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డుల్లో కూటమి 32 స్థానాలను కైవసం చేసుకుంది. వీటిలో టీడీపీ 28 వార్డుల్లో గెలుపొందగా, జనసేన మూడు స్థానాల్లో విజయం సాధించింది. అత్యధిక వార్డుల్లో గెలిచిన టీడీపీకి కాకుండా, తక్కువ స్థానాల్లో గెలిచిన జనసేనకు వైస్ చైర్మన్ పదవి దక్కడంపై స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమైంది.

అయినప్పటికీ అధిష్టానం ఆదేశాలతో వైస్ చైర్మన్ పదవిని జనసేనకు వదిలేశారు. అయితే ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నెరవేరకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది గ్రహించిన ఎమ్మెల్యే శిరీష ప్రత్యేక వీడియో విడుదల చేశారు. వైస్ చైర్మన్ అభ్యర్థిని ఎమ్మెల్యేనే నిర్ణయిస్తారని భావించానని, కానీ అధిష్టానమే నేరుగా నిర్ణయం తీసుకుని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిందని ఆ వీడియోలో శిరీష వివరించారు. తన చేతుల్లో ఏమీ లేని పరిస్థితి ఏర్పడిందని, గౌతు కుటుంబ చరిత్రలో మాట తప్పిన సందర్భం లేదని చెబుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలిచిన కళింగ కోమటి సామాజికవర్గానికి ముఖం చూపించ లేకపోతున్నానని శిరీష పేర్కొన్నారు. తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయినందుకు ఇంటింటికీ వచ్చి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు.

సాధారణంగా ఇలాంటి పరిణామాలు సంబంధిత వర్గాల్లో అసంతృప్తిని రాజేస్తాయి. అయితే మహిళా ఎమ్మెల్యే స్వయంగా క్షమాపణ కోరడంతో కళింగ కోమటి సామాజికవర్గ నాయకులు, పెద్దలు చలించిపోయారు. ఊహించని విధంగా ఎమ్మెల్యే క్షమాపణలు కోరడంతో వారంతా షాక్ కు గురయ్యారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తిరిగి ఎమ్మెల్యేనే సముదాయించేలా మాట్లాడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పలాస నియోజకవర్గ ప్రజలతో గౌతు కుటుంబానికి దశాబ్దాల రాజకీయ అనుబంధం ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడిగా, సోషలిస్టు పార్టీ నేతగా సర్దార్ గౌతు లచ్చన్న ప్రజాసేవలో, నిబద్ధతలో చెరగని ముద్ర వేశారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న గౌతు శిరీష, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా విలువలకు కట్టుబడి బహిరంగంగా క్షమాపణ కోరడం ద్వారా పలాస రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    
  • gouthusireesha 
  • palasa 
  • tdp 
  • janasena 
  • andhrapradeshpolitics 
  • kalingakomati 

Similar News

ఒకే క్లిక్‌తో 10 లక్షల మందికి సందేశం.. టీడీపీని నడిపిస్తున్న డిజిటల్ వెన్నెముక

2026-11-25 12:05 GMT

జ‌న‌సేన 'క‌ట్టు' త‌ప్పుతోంది: సాగ‌దీతే కార‌ణమా.. ?

2026-11-25 12:04 GMT

టీడీపీలో సామాన్య కార్యకర్తలకు పదవులు.. అసలు సీక్రెట్ ఇదే.. పనిచేసిన లోకేశ్ మాస్టర్ ప్లాన్!

2026-11-25 11:01 GMT

10 లక్షల మందితో ‘మైటీడీపీ’ యాప్ సరికొత్త రికార్డు.. లోకేశ్ డిజిటల్ వ్యూహం సక్సెస్!

2026-11-25 10:31 GMT

విశాఖ పేరు మారుతోందా...క్లారిటీ ఇదే !

2026-11-25 04:03 GMT

అటు గుండమ్మ...ఇటు రాధమ్మ

2026-11-25 04:02 GMT

సీట్లు పెరగకపోతే కూటమికి కష్టమే సుమా !

2026-11-24 18:22 GMT

గుడివాడలో అగ్గి రాజుకుంటోంది... కోస్తాంధ్రాలో మరో తాడిపత్రి !

2026-11-24 18:22 GMT

చివ‌ర‌కు.. ప‌వ‌న్ మాటే 'గెలిచింది'!

2026-11-24 18:17 GMT

డిసెంబర్ 3న విజయసాయిరెడ్డి కీలక ప్రకటన.. 'పరివర్తన రాజనీతి పార్టీ' దిశ, దశపై ఉత్కంఠ!

2026-11-24 18:11 GMT

కాకినాడ మత్స్యకారుల మిస్సింగ్ మిస్టరీ : రెండు బోట్లు వెళ్తే.. తిరిగొచ్చింది ఒక్కటే!

2026-11-24 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS