• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  ఒకే క్లిక్‌తో 10 లక్షల...

ఒకే క్లిక్‌తో 10 లక్షల మందికి సందేశం.. టీడీపీని నడిపిస్తున్న డిజిటల్ వెన్నెముక

| నారా లోకేశ్ అభివృద్ధి చేసిన మైటీడీపీ యాప్ ద్వారా 10 లక్షల మంది కార్యకర్తలు ఒకే డిజిటల్ వేదికపైకి వచ్చారు. అధినేత సందేశాలు, పార్టీ సూచనలు క్షణాల్లో చేరడంతో పాటు, కార్యకర్తల అభిప్రాయాలు, స్థానిక సమస్యలు నేరుగా అధిష్ఠానానికి చేరుతున్నాయి. పార్టీ బలోపేతానికి ఈ యాప్ కీలకంగా మారింది.

By - Tupaki Political Desk
Update: 2026-11-25 12:05 GMT

దేశంలోని ప్రతి పార్టీకి డిజిటల్ వేదికలు, మొబైల్ యాప్‌లు ఉన్నాయి. అగ్రనాయకుల ప్రసంగాలు, పార్టీ ప్రకటనలను కింది స్థాయికి చేరవేసేలా ఈ డిజిటల్ మాధ్యమాలను ఉపయోగిస్తుంటారు. దాదాపు ప్రతిపార్టీ ఇదే విధానం అనుసరిస్తుండగా, టీడీపీ మాత్రం భిన్నమైన పంథాను అనుసరిస్తూ డిజిటల్ టెక్నాలజీలో సరికొత్త పుంతలు తొక్కుతోందని విశ్లేషిస్తున్నారు. ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కునే లక్ష్యంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ దూరదృష్టితో అభివృద్ధి చేసిన మైటీడీపీ యాప్ ఇప్పుడు ఆ పార్టీకి బలమైన సైన్యాన్ని తయారు చేసిందని అంటున్నారు. కార్యకర్త నుంచి అధినేత వరకు ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా అనుసంధానం కల్పించే ఒక సమగ్ర డిజిటల్ వ్యవస్థగా మైటీడీపీ యాప్ ను అభివృద్ధి చేసి టీడీపీ సరికొత్త రికార్డులు నమోదు చేసిందని అభివర్ణిస్తున్నారు.

ప్రభుత్వంలో రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) ద్వారా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించిన అనుభవంతో, పార్టీలోనూ అదే తరహా వేగవంతమైన స్పందన ఉండేలా లోకేశ్ మై టీడీపీ యాప్‌ను తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. దీని ద్వారా పార్టీ అధినేత సందేశాలు, నాయకత్వ సూచనలు క్షణాల్లో 10 లక్షల మంది కార్యకర్తలకు చేరడంతో పాటు, క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలు, స్థానిక సమస్యలు నేరుగా పార్టీ అధిష్ఠానానికి చేరుతున్నాయి. పార్టీ తీసుకునే నిర్ణయాలు, కార్యక్రమాల రూపకల్పనలో కార్యకర్తల స్పందనను ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా, వారి విలువైన సూచనలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఈ వేదికను రూపొందించారు. తద్వారా పార్టీ విధాన నిర్ణయాల్లో సామాన్య కార్యకర్త కూడా భాగస్వామి అయ్యే అవకాశం లభించింది.

కేవలం రాజకీయ కార్యక్రమాలకే పరిమితం కాకుండా, పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి సంబంధించిన అంశాలను పర్యవేక్షించేందుకు కూడా ‘మైటీడీపీ’లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. కార్యకర్తల సమావేశాలు, శిక్షణా తరగతుల నిర్వహణతో పాటు, సోషల్ మీడియా వేదికగా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతున్నారు. ఒకే పసుపు కుటుంబంగా 10 లక్షల మంది కార్యకర్తలు ఒకే డిజిటల్ వేదికపైకి రావడం వల్ల, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం మరింత వేగంగా, సమన్వయంతో పనిచేయడానికి వీలు కలిగింది.

రాబోయే రోజుల్లో రాజకీయ పోరాటాలు, ఎన్నికల వ్యూహాలు పూర్తిగా డేటా మరియు సాంకేతికత ఆధారంగానే నడవనున్నాయి. ఈ వాస్తవాన్ని ముందుగానే గుర్తించిన నారా లోకేశ్, ‘మైటీడీపీ’ ద్వారా పార్టీకి ఒక బలమైన డిజిటల్ వెన్నెముకను నిర్మించారు. కార్యకర్త కష్టానికి గుర్తింపు, ప్రతిభకు ప్రోత్సాహం, అంకితభావానికి తగిన అవకాశాలు కల్పిస్తూ రూపొందించిన ఈ సమగ్ర వ్యవస్థ, రాబోయే దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ సంస్థాగత బలోపేతానికి ఒక తిరుగులేని పునాదిగా నిలవనుంది.

Tags:    
  • naralokesh 
  • mytdpapp 
  • tdp 
  • telugudesam 

Similar News

జ‌న‌సేన 'క‌ట్టు' త‌ప్పుతోంది: సాగ‌దీతే కార‌ణమా.. ?

2026-11-25 12:04 GMT

టీడీపీలో సామాన్య కార్యకర్తలకు పదవులు.. అసలు సీక్రెట్ ఇదే.. పనిచేసిన లోకేశ్ మాస్టర్ ప్లాన్!

2026-11-25 11:01 GMT

10 లక్షల మందితో ‘మైటీడీపీ’ యాప్ సరికొత్త రికార్డు.. లోకేశ్ డిజిటల్ వ్యూహం సక్సెస్!

2026-11-25 10:31 GMT

విశాఖ పేరు మారుతోందా...క్లారిటీ ఇదే !

2026-11-25 04:03 GMT

అటు గుండమ్మ...ఇటు రాధమ్మ

2026-11-25 04:02 GMT

సీట్లు పెరగకపోతే కూటమికి కష్టమే సుమా !

2026-11-24 18:22 GMT

గుడివాడలో అగ్గి రాజుకుంటోంది... కోస్తాంధ్రాలో మరో తాడిపత్రి !

2026-11-24 18:22 GMT

చివ‌ర‌కు.. ప‌వ‌న్ మాటే 'గెలిచింది'!

2026-11-24 18:17 GMT

డిసెంబర్ 3న విజయసాయిరెడ్డి కీలక ప్రకటన.. 'పరివర్తన రాజనీతి పార్టీ' దిశ, దశపై ఉత్కంఠ!

2026-11-24 18:11 GMT

కాకినాడ మత్స్యకారుల మిస్సింగ్ మిస్టరీ : రెండు బోట్లు వెళ్తే.. తిరిగొచ్చింది ఒక్కటే!

2026-11-24 18:01 GMT

బొత్స వర్సెస్ చిన్న శ్రీను.. చీపురుపల్లిలో డైరెక్ట్ ఫైట్

2026-11-24 08:43 GMT

Copyright @2026

Powered by Blink CMS