• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  'బాహుబ‌లులు' కూడా...

'బాహుబ‌లులు' కూడా బ‌ల‌హీన‌మ‌య్యారే..!

| శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి చెందిన బొత్స, ధర్మాన, కృష్ణదాస్ వంటి కీలక నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. బొత్స వారసురాలు అనూష కూడా ఓటమి పాలయ్యారు. గత ప్రభుత్వంపై అసంతృప్తి, అభ్యర్థుల ఎంపికలో లోపాలు, నేతల రాజీనామాలు పార్టీ పరాజయానికి కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లోనూ పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

By - Garuda Media
Update: 2026-11-09 06:39 GMT

వైసీపీలో బాహుబ‌లి నాయ‌కులుగా పేరున్న వారు కూడా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కుదేల‌య్యారు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర కు చెందిన వారిలో రాష్ట్ర‌స్థాయి నాయ‌కులు, మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు. వీరిలో బొత్స స‌త్య‌నారాయ ణ, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, కృష్ణ‌దాస్ వంటి హేమాహేమీ నాయ‌కులు ఉన్నారు. అలానే.. మాజీ స్పీక‌ర్ తమ్మినేని సీతారాం వంటి ఆలోచ‌నా ప‌రులు, దురంధరులు కూడా వైసీపీ సొంతం. అయిన‌ప్ప‌టికీ.. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం రెండు జిల్లాల్లో వైసీపీకి మెరుగైన ప‌రిస్థితి క‌నిపించ‌క‌పోగా.. బొత్స వార‌సురాలు అనూష సైతం ప‌రాజ‌యం పాల‌య్యారు.

ఏంటి కార‌ణం..?

1) పాత త‌ప్పులు మ‌రువ‌ని జ‌నం

గత వైసీపీ ప్రభుత్వ కాలంలో గ్రామీణ, పట్టణ స్థాయిల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యుల కంటే వాలంటీర్ వ్యవస్థకే ఎక్కువ ప్రాధాన్యత లభించిందనే అసంతృప్తి క్యాడర్‌లో బలంగా ఉండిపోయింది. దీనికి తోడు స్థానిక సంస్థల పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, స్థానిక నాయకులకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది ఎన్నికల సమయంలో వారి పనితీరుపై తీవ్ర ప్రభావం చూపింది.

2) అభ్యర్థుల ఎంపికలో లోపాలు

స్థానిక సంస్థల ఎన్నికలను పార్టీ అగ్రనాయకత్వం అంత సీరియస్‌గా తీసుకోలేదనే విమర్శ ఉంది. చాలా చోట్ల అర్హత, స్థానిక బలం లేని వారికి టిక్కెట్లు కేటాయించారని విశ్లేషకులు భావిస్తున్నారు. గెలుపు కోసం వ్యూహాలు రచించాల్సిన నియోజకవర్గ ఇన్ఛార్జ్‌లు, ముఖ్య నాయకులు ధ‌ర్మాన‌, బొత్స వంటి వారు సొంతంగా ఖర్చు పెట్టడానికి వెనుకడుగు వేసి చేతులెత్తేయడం అభ్యర్థుల ఓటమికి దారితీసిందనే చ‌ర్చ న‌డుస్తోంది.

3) పార్టీ నేతల రాజీనామాలు

స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీకి రాజీనామా చేసి అధికార కూటమిలో చేరిపోయ‌రు. మ‌రికొంద‌రు మౌనంగా ఉండి పోయారు. దీంతో పార్టీ కేడర్ నైతికంగా బలహీనపడింది. మ‌రోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే ఈ ఎన్నికలు జరగడం వల్ల సహజంగానే ఓటర్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు. కూటమి నేతలు పూర్తి అంగబలం, అర్థబలాన్ని ఉపయోగించి వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

ఎవ‌రికి న‌ష్టం..

శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో వైసీపీ ప‌రాజ‌యం పాల‌వ‌డానికి కార‌ణాలు ఎలా ఉన్నా.. ఈ ప‌రిణామాలు.. ముఖ్య నేత‌ల‌కు పెద్ద స‌మ‌స్య‌గా మార‌నుంది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి.. క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్ లేక‌పోతే.. ఇబ్బందులు ప‌డేది ఈ నేత‌లే. గెలుపు గుర్రం ఎక్కాల‌న్నా.. పార్టీలు గెల‌వాల‌న్నా.. స్థానిక పునాదులు బ‌లంగా ఉంటే త‌ప్ప జ‌ర‌గ‌దు. ఇప్పుడు అలాంటి బాహుబ‌లులే.. బ‌ల‌హీన‌మ‌య్యే ప‌రిస్థితివ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    
  • ysrcp 
  • northandhra 
  • srikakulam 
  • vizianagaram 
  • andhrapolitics 

Similar News

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

కూటమిలో భారీ ఉత్కంఠ.. ఎవరికెన్ని జెడ్పీలు ?

2026-11-19 03:09 GMT

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

Copyright @2026

Powered by Blink CMS