Viral: ముద్దు అడిగిన భర్త నాలుకను కొరికేసిన భార్య
శుక్రవారం ఉదయం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది
ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని ఏం అడిగినా.. ఆమె నోటి నుంచి 'నో' అన్న మాట వస్తే 'నో' అన్నట్టే. ఈ మాటను ఎవరూ కాదనరు. కానీ.. భార్యను భర్త ముద్దు అడిగితే.. ఆమె నో చెప్పొచ్చు. కానీ.. అందుకు భిన్నంగా రక్తం కారిపోయేలా నాలుకను కొరికేస్తే? షాకింగ్ గా ఉంది కదూ? నిజమే.. ఇలాంటి అనూహ్య ఉదంతానికి వేదికగా మారింది కర్నూలు జిల్లా.
ముద్దు అడిగిన భర్తకు జీవితంలో మర్చిపోలేని షాకింగ్ గిఫ్టుగా ఇచ్చిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలంలోని యల్లమ్మ గుట్ట తండాకు చెందిన తారా చందునాయక్ కు ఎదురైంది. గుంటూరు జిల్లాకు చెందిన ఇతగాడు 2015లో తుగ్గలి మండలానికి చెందిన పుష్పవతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.
చందునాయక్ అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రాంతంలో చేనేత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అయితే.. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుంటాయి.
ఇదిలా ఉంటే..శుక్రవారం ఉదయం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమెను ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. అందుకు సిద్ధంగా లేని ఆమె.. నో చెప్పలేదు కానీ.. అనూహ్యంగా భర్త నాలుకను బలంగా కొరికేసింది. దీంతో.. తీవ్రమైన రక్తస్రావమైంది.
ఎంతకూ నాలుక నుంచి రక్తం ఆగకపోవటంతో ఆసుపత్రికి వెళ్లాడు.మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి సిఫార్సు చేశాడు. ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేస్తే.. తన భార్య తన నాలుకను కొరికేసిందంటూ భోరుమన్న అతగాడి మాటలు వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే.. భార్యకు ఇష్టం లేకున్నా బలవంతంగా ముద్దు పెట్టేందుకు వచ్చినందుకే ఇలా జరిగిందని భార్య తరఫు బంధువులు వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు మీడియాతో మాట్లాడిన తారా చంద్.. ''మేమిద్దరం బాగుండాలని మా నాన్న ప్రతి నెలా డబ్బులు పంపిస్తుంటాడు. ఊళ్లో ఎవరితోనో ఎపైర్ ఉందని తెలుస్తోంది. అయినా.. నా భార్య అన్న ఉద్దేశంతో పట్టించుకోలేదు. ఈ రోజు దగ్గరకు వెళితే నాలుక కొరికేసింది. అది నన్ను చంపినా చంపేస్తుంది. నా పరిస్థితి.. నా పిల్లల పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు'' అంటూ భోరుమన్నాడు. ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది.