విజయ్ 'భద్రకాళి' మూవీ.. మీడియా ముందు గన్ షూట్!
అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మిస్తున్నారు.;
విజయ్ ఆంటోనీ గురించి అందరికీ తెలిసిందే. హీరోగా, నిర్మాతగా, లిరిసిస్ట్ గా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, ఎడిటర్ గా ఇలా అన్ని రకాలుగా తన టాలెంట్ తో మెప్పిస్తున్నారు. రీసెంట్ గా మార్గన్ మూవీతో వచ్చి మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ 25వ మూవీ భద్రకాళితో సందడి చేయనున్నారు.
అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మిస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, పొలిటికల్ అంశాలతో ఆసక్తి క్రియేట్ చేసింది. 197 కోట్ల కుంభకోణం చుట్టూ సినిమా తిరుగుతుందని టీజర్ ద్వారా అనిపిస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుందని చెప్పారు.
తెలుగులో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఎవరు రిలీజ్ చేస్తారో అనౌన్స్ చేయలేదు. అయితే విజయ్ మార్గన్ మూవీని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేసిన ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఇప్పుడు భద్రకాళి మూవీని విడుదల చేయనుంది. ఈ మేరకు తెలుగు మీడియాతో ఇంటరాక్షన్ నిర్వహించారు.
ఆ సమయంలో మూవీ టీమ్ అంతా ఫన్నీగా గన్ ఫైరింగ్ చేశారు. హీరో విజయ్, నిర్మాత దగ్గుబాటి సురేష్ సహా మూవీ టీమ్ కు సంబంధించిన వారు గన్ తో ఫన్నీ షూట్ చేస్తూ సందడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోస్ వైరల్ గా మారాయి. క్రేజీ ప్రమోషన్స్ తో ఇదో భాగమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. సినిమాటోగ్రాఫర్ షెల్లీ కెమెరా బాధ్యతలు చూడగా, విజయ్ ఆంటోనీ స్వయంగా సంగీతం సమకూర్చారు. రేమండ్ డెరిక్ ఎడిటింగ్ బాధ్యతలు, రాజశేఖర్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పర్యవేక్షిస్తున్నారు శ్రీరామన్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కు నాయకత్వం వహిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి తెలుగు డైలాగ్స్ రాశారు. అలా ప్రాజెక్టుకు బలమైన సాంకేతిక బృందం మద్దతు ఇవ్వడంతో అంచనాలు నెలకొన్నాయి.