వారం ముందు వచ్చి డ్యామేజ్ కంట్రోల్..!
'డీజే టిల్లు'తో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆ తర్వాత టిల్లు స్క్వేర్ సినిమాతోనూ విజయాన్ని సొంతం చేసుకోవడంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నాడు.;
'డీజే టిల్లు'తో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆ తర్వాత టిల్లు స్క్వేర్ సినిమాతోనూ విజయాన్ని సొంతం చేసుకోవడంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన నుంచి సినిమా వస్తుందంటే మినిమం బజ్ క్రియేట్ కావడం కామన్ విషయం. పైగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో కావడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. బొమ్మరిల్లు భాస్కర్ ట్రాక్ రికార్డ్ సరిగా లేకున్నా సిద్దుపై నమ్మకంతో 'జాక్' సినిమాపై అంచనాలు పెరిగాయి. ఏప్రిల్ 10న జాక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు నెగటివ్ రివ్యూలు వచ్చాయి. సిద్దు మార్క్ అయితే ఉంది.. కానీ ఆ ఒక్కటి సరిపోదు కదా అంటూ విమర్శలు వచ్చాయి.
RAW నేపథ్యంలో సాగే ఈ సినిమాలోనూ సిద్దు జొన్నలగడ్డ తన గత చిత్రాల్లో మాదిరిగానే టిల్లు పాత్రలోనే ఉండి పోయాడు అని రివ్యూలు వచ్చాయి. సినిమాకు సిద్దు అభిమానులు పర్వాలేదు అంటూ టాక్ ఇచ్చినా, సోషల్ మీడియాలో చెప్పే ప్రయత్నం చేసినా ఓవరాల్‌గా సినిమా అంతగా అలరించలేదు. సినిమాకు పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కలేదు. సినిమాకు అంతంత మాత్రంగానే వసూళ్లు నమోదు అయ్యాయి. సెకండ్ వీక్‌లో కలెక్షన్స్ మరీ వీక్ అయ్యాయి. దాంతో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై మేకర్స్ దృష్టి పెట్టారనే టాక్ వినిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అనుకున్న దాని కంటే ముందుగానే సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. సినిమాకు ఎలాగూ కలెక్షన్స్ రూపంలో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ దక్కలేదు. కనీసం ఓటీటీ లో ముందు స్ట్రీమింగ్ చేయడం ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయవచ్చు, అంతే కాకుండా ముందు స్ట్రీమింగ్ చేస్తే నెట్‌ఫ్లిక్స్ నుంచి కొంత మొత్తం అయినా ఎక్కువ ఆశించే అవకాశాలు ఉంటాయని మేకర్స్ భావిస్తున్నారట. ఈ సినిమాను థియేట్రికల్ స్క్రీనింగ్ అయిన మూడు వారాల్లో ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లుగా డేట్‌ను దాదాపుగా కన్ఫర్మ్ చేశారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
మే 1వ తారీకు లేదా మే 2వ తారీకున సినిమాను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల షెడ్యూల్ అనుసారం ఈ సినిమా తేదీని ఒకటి రెండు రోజుల్లోనే ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సినిమాలకు ఓటీటీలో మంచి స్పందన దక్కుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా హీరోయిన్‌గా బేబీ ఫేం వైష్ణవి చైతన్య నటించిన విషయం తెల్సిందే. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో కనిపించాడు. సిద్దు జొన్నలగడ్డ వరుస విజయాలకు జాక్ సినిమా చిన్న స్పీడ్ బ్రేకర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.