ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, సీరిస్ లు ఇవే!

ప్రతివారం లాగే ఈవారం కూడా ఓటీటీలో ఎన్నో వినోదాత్మకమైన సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.;

Update: 2026-01-19 07:41 GMT

2020వ సంవత్సరం నుండి ఓటీటీ ఆదరణ భారీగా పెరిగిపోయింది.దీనికి కారణం కరోనా.. కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అవడంతో.. సమయం గడపడానికి కుటుంబ సభ్యులతో కలిసి తమకు ఇష్టమైన సినిమాను ఓటీటీలో వీక్షిస్తూ వీటికి భారీ పాపులారిటీని అందించారు. ఇక అప్పటినుంచి సినిమా ఇండస్ట్రీనే శాసించే స్థాయికి ఓటీటీ పరిశ్రమ ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు మంచి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వినోదాన్ని పంచుతున్న ఈ ఓటీటీలు

ప్రతివారం లాగే ఈవారం కూడా ఓటీటీలో ఎన్నో వినోదాత్మకమైన సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. రొమాన్స్, క్రైమ్, థ్రిల్లర్, స్పోర్ట్స్, హర్రర్ వంటి జానర్ లో పలు చిత్రాలు ఇప్పటికే కొన్ని స్ట్రీమింగ్ కి రాగా.. మరికొన్ని స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం ఓటీటీలలో సందడి చేస్తున్న చిత్రాలు / వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే..

జీ -5:

1).45 (కన్నడ మూవీ): జనవరి 23

2). కాళీ పోట్కా (బెంగాలీ సిరీస్): జనవరి 23

3). మస్తీ 4 (హిందీ కామెడీ మూవీ): జనవరి 23

4). సిరాయ్ ( తమిళ్ క్రైమ్ డ్రామా మూవీ).. జనవరి 23

నెట్ ఫ్లిక్స్:

1). ఎ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీ - జనవరి 20

2). క్వీర్ ఐ సీజన్ 10 (ఇంగ్లీష్ సిరీస్ ) : జనవరి 21

3). తేరీ ఇష్క్ మెయిన్ ( తెలుగు డబ్బింగ్ మూవీ -అమర కావ్యం): జనవరి 23

4). సండోకన్ (ఇంగ్లీష్ సిరీస్) : జనవరి 19

5). జస్ట్ ఏ డ్యాష్ సీజన్ 3(ఇంగ్లీష్ సిరీస్) : జనవరి 20

6). రిజోలి అండ్ ఐల్స్ సీజన్ 1- 7 (ఇంగ్లీష్ సిరీస్) : జనవరి 20

7). సింగిల్స్ ఇన్ ఫెర్నో సీజన్ 5 (కొరియన్ సిరీస్): జనవరి 20

8). స్టార్ సెర్చ్ (ఇంగ్లీష్ సిరీస్) :జనవరి 20

9). కిడ్నాపెడ్ :ఎలిజిబెత్ స్మార్ట్ (ఇంగ్లీష్ సినిమా): జనవరి 21

జియో హాట్ స్టార్:

1).ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్: జనవరి 19

2). గుస్తాక్ ఇష్క్: జనవరి 23

3). హిమ్: స్పోర్ట్స్ సైకలాజికల్ హర్రర్.. జనవరి 19

4). మార్క్: జనవరి 23

5).స్పేస్ జెన్: జనవరి 23

ప్రైమ్ వీడియో:

1). చీకటిలో(తెలుగు క్రైం థ్రిల్లర్ మూవీ) : జనవరి 23

2). ఇట్స్ నాట్ లైక్ దట్: జనవరి 25

3). స్టీల్: జనవరి 21

4). ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్ (ఇంగ్లీష్ మూవీ): జనవరి 19

ఆహా:

సల్లియర్గళ్ (తమిళ్ మూవీ): జనవరి 20

ఆపిల్ టీవీ ప్లస్:

డ్రాప్ ఆఫ్ గాడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ ): జనవరి 21

Tags:    

Similar News