ఈ వారం ఓటీటీలోకి రానున్న కంటెంట్ ఇదే!
గత కొన్నాళ్లుగా ఓటీటీలో పెద్దగా ఇంట్రెస్టింగ్ కంటెంట్ రిలీజవకపోవడం ఆడియన్స్ ను నిరాశకు గురి చేస్తోంది.;
గత కొన్నాళ్లుగా ఓటీటీలో పెద్దగా ఇంట్రెస్టింగ్ కంటెంట్ రిలీజవకపోవడం ఆడియన్స్ ను నిరాశకు గురి చేస్తోంది. థియేటర్లలో వచ్చిన సినిమాలు ఓటీటీలో పెద్ద హడావిడి చేయలేకపోవడంతో ఈ వారమైనా కొత్త ఉత్సాహాన్ని కలిగించే కంటెంట్ ఏమైనా ఓటీటీలోకి రానుందా అని ఆడియన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వారం ఏయే సినిమాలు ఓటీటీలోకి రానున్నాయో తెలుసుకుందాం.
డెకాయిట్
వాటిలో మొదటిగా అడివి శేష్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన డెకాయిట్ మే 8 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. శేష్ కెరీర్లో వీకెస్ట్ సినిమాగా దీనికి పేరొచ్చింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన డెకాయిట్, ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ
ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. మంచి అంచనాలతో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాల్ని అందుకోలేకపోయింది. ఫ్యూచరిస్టిక్ లవ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఈ మూవీ కొన్ని లోపాల వల్ల ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. ఈ సినిమా మే 6 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
సిటాడెల్ సీజన్2
ప్రముఖ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటించిన సిటాడెల్ సీజన్2 ఈ వారమే రిలీజవనుంది. ఫస్ట్ సీజన్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 6 నుంచి ప్రైమ్ వీడియోలో సిటాడెల్2 స్ట్రీమింగ్ కానుంది. ఈ వారం రిలీజుల్లో ఇదే పెద్ద హైలైట్ అవుతున్న కంటెంట్.
వాజా2
ఈ వీక్ ఓటీటీ రిలీజ్‌లు లిమిటెడ్ గానే ఉన్నప్పటికీ, నెక్ట్స్ వీక్ ఓ ప్రముఖ సినిమా ఓటీటీలోకి రానుంది. అదే వాజా2. మలయాళంలో భారీ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా ఈ ఇయర్ హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. మే 16 నుంచి ఈ సినిమా మనోరమ మ్యాక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలుండటంతో ఓటీటీలో కూడా ఇది భారీ రెస్పాన్స్ అందుకునేట్లు కనిపిస్తుంది.
మొత్తానికి ఈ వారం ఓటీటీ ఆడియన్స్ కు కంటెంట్ లిమిటెడ్ గానే ఉండటంతో, కొన్ని మాత్రం సరైన ఎంటర్టైన్మెంట్ ను అందించేవిగా కనిపిస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీ విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి.