• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  OTT - Streaming Apps >  జీ5లోకి న‌వాజుద్దీన్...

జీ5లోకి న‌వాజుద్దీన్ సిద్ధిఖీ పీరియాడిక్ ఫిల్మ్‌!

| బాలీవుడ్‌లో విభిన్న‌మైన క్యారెక్ట‌ర్ల‌తో వెర్స‌టైల్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ. తెలుగులోనూ న‌టించిన న‌వాజుద్దీన్ ఇక్క‌డ స‌క్సెస్ కాలేక‌పోయాడు.

By - Tupaki Desk
Update: 2025-05-01 15:30 GMT

బాలీవుడ్‌లో విభిన్న‌మైన క్యారెక్ట‌ర్ల‌తో వెర్స‌టైల్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ. తెలుగులోనూ న‌టించిన న‌వాజుద్దీన్ ఇక్క‌డ స‌క్సెస్ కాలేక‌పోయాడు. ఆయ‌న న‌టించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా `కోస్టావో`. సెజ‌ల్ షా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రియా బాప‌ట్‌, క‌న్న‌డ న‌టుడు కిషోర్‌, మ‌హికా శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో గోవాలో సాగే క్రైమ్ డ్రామాగా ఈ మూవీని రూపొందించారు. క‌థే హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ గురువారం నుంచి నేరుగా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇందులో న‌వాజుద్దీన్ సిద్ధిఖీ క‌స్టావో ఫెర్నాండెజ్ అనే క‌స్ట‌మ్స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించారు. సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న సంద‌ర్భంగా న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ప్ర‌చార కార్యక్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న పాత్ర‌కు సంబంధించిన కీల‌క విష‌యాల్ని వెల్ల‌డించారు. సినిమాలో త‌న పాత్ర అంద‌రిని న‌వ్విస్తుంద‌న్నారు. `కోస్టావో అంద‌రిని న‌వ్విస్తాడు. కానీ త‌న న‌వ్వు వెన‌క దాగివున్న ఒక విష‌యం కోసం ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటాడు.

ఆ కాన్సెప్ట్ న‌చ్చ‌డంతో దీనికి అంగీక‌రించా. సినిమాలో నా పాత్ర చాలా ధ‌:ర‌్యంగా ఉంటుంది. నిజాయితీగా ఉంటుంది. నిజాయితీగ‌ల కస్ట‌మ్స్ ఆఫీస‌ర్ ఎదుర్కొన్న బాధ‌లు న‌న్ను ఎంత‌గానో క‌దిలించాయి. ఆ పాత్ర‌లో న‌టించ‌డానికి ముందు భ‌య‌ప‌డ్డాను.ఒక స‌న్నివేశాన్ని రూపొందించ‌డానికి చిత్ర బృందం 1000 మార్గాలు క‌నుగొంది. అది నాకు ఎంతో ఆస‌క్తిగా అనిపించింది. అందుకే ఈ చిత్రానికి వెంట‌నే ఓకే చెప్పాను`అని వివ‌రించారు.

1990లో గోవా స్మ‌గ్లింగ్ నెట్‌వ‌ర్క్‌ను ఛేదించిన క‌స్ట‌మ్స్ అధికారి కోస్టావో ఫెర్నాండెజ్ క‌థ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. వృత్తిప‌రంగా ఆయ‌న ఎదుర్కొన్న స‌వాళ్ల‌తో పాటు వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న ఫేస్ చేసిన కొన్ని విష‌యాల‌ని ఇందులో చ‌ర్చించారు.

Tags:    
  • NawazuddinSiddiqui 
  • ZEE5Original 
  • OTTRelease 
  • CrimeDrama 
  • Goa1990 
  • IndianCinema 
  • VersatileActor 
  • PeriodDrama 
  • COSTAO 
  • CostaoOnZEE5 

Similar News

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

నాగార్జున సమర్పిస్తున్న సినిమా ని బాయికాట్ చేస్తాం అంటున్న నెటిజన్లు

2026-11-01 12:04 GMT

Copyright @2026

Powered by Blink CMS