'సెహ్వాగ్ 300' రికార్డును ఎవరు బద్దలు కొట్టగలరంటే?.. ఇదిగో సమాధానం!

అవును... వెస్టిండీస్‌ తో జరిగిన రెండో టెస్టులో జైస్వాల్ 175 పరుగులకు అవుటైన సంగతి తెలిసిందే. అప్పటికే అతని టెస్ట్ కెరీర్ చరిత్ర ఓ సంచలనంగా మారుతోంది.;

Update: 2025-10-12 06:17 GMT

టీమిండియా స్టార్ బ్యాటర్స్ లో వీరేంద్ర సెహ్వాగ్ స్థానం ప్రత్యేకమైందని అంటారు. ఆయన బ్యాటింగ్ కు వన్డే, టెస్ట్ మ్యాచ్, టీ20, ఐపీఎల్ అనే తారతమ్యాలేవీ ఉండవని.. ఒక్కసారి మైదానంలో అడుగుపెట్టిన తర్వాత తనకు బంతి, బౌండరీ మాత్రమే కనిపిస్తాయని చెబుతారు. ఆ దూకుడుతోనే ఊహించని రీతిలో టెస్టు క్రికెట్ లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా... 2004లో పాకిస్థాన్‌ పై 309, 2008లో దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేశాడు. దీంతో... ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా వీరేంద్రుడు చరిత్రలో రెండుసార్లు ఈ ఘనత సాధించిన నలుగురు ఆటగాళ్లలో ఒకడుగా నిలిచారు. 2008లో అతని 319 పరుగుల ఇన్నింగ్స్ ఆ సమయంలో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీగా నిలిచింది.

ఆ 300 పరుగులు కేవలం 278 బంతుల్లోనే రావడం గమనార్హం. ఇదే సమయంలో టెస్టుల్లో 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌ తో అత్యధిక స్కోరు కూడా అదే. దీంతో.. ఇది ఐసీసీ ర్యాంకింగ్స్ ద్వారా ఆల్ టైమ్ టాప్ 10 టెస్ట్ ఇన్నింగ్స్‌ లలో ఒకటిగా నిలిచింది. ఈ సమయంలో సెహ్వాగ్ తర్వాత ఆస్థాయి రికార్డ్స్ నెలకొల్పగలిగే స్టార్ బ్యాటర్ ఎవరంటే..? కైఫ్ సమాధానం చెబుతున్నారు.

అవును... వెస్టిండీస్‌ తో జరిగిన రెండో టెస్టులో జైస్వాల్ 175 పరుగులకు అవుటైన సంగతి తెలిసిందే. అప్పటికే అతని టెస్ట్ కెరీర్ చరిత్ర ఓ సంచలనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో... తాజా ఇన్నింగ్స్ తర్వాత ‘సెహ్వాగ్ 300’ పరుగుల రికార్డును బద్దలు కొట్టే టీమిండియా ఆటగాడు జైస్వాల్ అని భారత మాజీ స్టార్ మహ్మద్ కైఫ్ నమ్ముతున్నాడు.

తాజాగా ఈ విషయంపై స్పందించిన కైఫ్... యశస్వి జైస్వాల్ పెద్ద సెంచరీలు సాధించి కొత్త రికార్డులు నమోదు చేసే ఓపిక ఉన్న బ్యాట్స్‌ మన్ అని అన్నారు. ఇదే సమయంలో... అతని మొదటి 26 మ్యాచ్‌ లలో చేసిన సెంచరీలు సచిన్, కొహ్లీ ల మాదిరిగానే ఉన్నాయని.. సెహ్వాగ్ 300 పరుగుల రికార్డును జైస్వాల్ మాత్రమే బద్దలు కొడతాడని అభిప్రాయపడ్డాడు!

కాగా... 23 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌ మన్ ఇప్పటివరకు తన 25 టెస్ట్ కెరీర్‌ లో 2245 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం వెస్టిండీస్‌ లో అరంగేట్రం చేసినప్పటి నుండి ఏడు సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు చేయగా... వాటిలో ఐదు సెంచరీలు 150 పరుగులు లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లే కావడం గమనార్హం!

Tags:    

Similar News