• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  సచిన్.. కాస్త సైడ్...

సచిన్.. కాస్త సైడ్ అవ్వండి! రికార్డులపై ‘బేబీ బాస్’ వైభవ్ సూర్యవంశీ కన్నేసాడు!

| భారత సీనియర్ క్రికెట్ జట్టుకు అతి చిన్న వయసులో ఎంపికైన ఆటగాడిగా దశాబ్దాలుగా సచిన్ పేరిట ఉన్న ఆ రికార్డుకు ఇప్పుడు ఒక సరికొత్త సంచలనం నుండి ముప్పు పొంచి ఉంది. అతడే బీహార్‌కు చెందిన 15 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ‘బేబీ బాస్’ వైభవ్ సూర్యవంశీ!

By - A.N.Kumar
Update: 2026-06-05 05:51 GMT

క్రికెట్ ప్రపంచంలో రికార్డులు అనేవి కేవలం కాలక్రమేణా చెరిగిపోవడానికే ఉంటాయని అంటుంటారు. కానీ కొన్ని రికార్డులు చూస్తే మాత్రం "ఇవి బ్రేక్ చేయడం ఎవరికైనా సాధ్యమేనా?" అనే సందేహం కలగక మానదు. అలాంటి అసాధ్యమైన రికార్డుల్లో ఒకటి... గాడ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఘనత. భారత సీనియర్ క్రికెట్ జట్టుకు అతి చిన్న వయసులో ఎంపికైన ఆటగాడిగా దశాబ్దాలుగా సచిన్ పేరిట ఉన్న ఆ రికార్డుకు ఇప్పుడు ఒక సరికొత్త సంచలనం నుండి ముప్పు పొంచి ఉంది. అతడే బీహార్‌కు చెందిన 15 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ‘బేబీ బాస్’ వైభవ్ సూర్యవంశీ!

సచిన్ రికార్డుకు ముప్పు.. చరిత్ర సృష్టించే దిశగా వైభవ్!

ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. త్వరలోనే ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరగబోయే టీ20 సిరీస్‌లకు వైభవ్ సూర్యవంశీ ఎంపిక దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే భారత క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడుతుంది.

ఎందుకంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 1989లో పాకిస్తాన్‌పై భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పుడు ఆయన వయసు 16 ఏళ్ల 205 రోజులు. కానీ ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వయసు కేవలం 15 ఏళ్లు 70 రోజులు మాత్రమే! అంటే వైభవ్ గనుక రాబోయే సిరీస్‌లో బ్లూ జెర్సీ ధరిస్తే సచిన్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డు స్క్రీన్ నుంచి కాస్త సైడ్ అవ్వాల్సిందే. రికార్డుల పుస్తకంలో సచిన్ స్థానంలో వైభవ్ పేరు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

ఐపీఎల్‌లో ‘బాస్’ రేంజ్ విధ్వంసం.. సెలెక్టర్లు ఫిదా!

ఇటీవల జరిగిన ఐపీఎల్ లో దంచి కొట్టి ఆరేంజ్ క్యాప్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్ మైదానంలోనూ అదే రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. వయసు చిన్నదే అయినా, సీనియర్ బౌలర్లను సైతం బెంబేలెత్తించేలా అతడు ఆడే షాట్లు సెలెక్టర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. "పెద్ద పెద్ద బౌలర్లు రకరకాల ప్లాన్‌లు వేసుకుని వస్తుంటే ఈ కుర్రాడు మాత్రం ‘బంతి కనిపిస్తే బౌండరీ అవతల పడేయాలి’ అనే ఒకే ఒక్క సింపుల్ ప్లాన్‌తో దూసుకుపోతున్నాడు. అతనిలోని ఈ ఫియర్-లెస్ క్రికెట్ ఆడే తత్వమే అతడిని టీమిండియా తలుపులు తట్టేలా చేసింది.

రాబోయే షెడ్యూల్ ఇదే.. సోషల్ మీడియాలో ట్రెండింగ్!

భారత జట్టు త్వరలోనే కింది షెడ్యూల్ ప్రకారం టీ20 సిరీస్‌లు ఆడనుంది. జూన్ 26 నుండి ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్... జూలై 1 నుండి ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ టూర్ల కోసం ప్రకటించబోయే భారత జట్టులో వైభవ్ పేరు ఉంటే మాత్రం సోషల్ మీడియాలో మరోసారి "బేబీ బాస్" హవా నడవడం ఖాయం. నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు ఇప్పటికే ఈ విషయంపై చర్చలు మొదలుపెట్టారు. "సచిన్ రికార్డు బ్రేక్ చేయడం ఓకే... కానీ ఈ కుర్రాడి అగ్రెసివ్ బ్యాటింగ్‌ను అంతర్జాతీయ వేదికలపై ఎవరు ఆపుతారు?" అంటూ ఫ్యాన్స్ అప్పుడే కాలర్‌ ఎగరేస్తున్నారు.

కొత్త తరం పవర్ హౌస్!

ఏదేమైనా భారత క్రికెట్‌లో కొత్త తరం ఎంత వేగంగా ఎంత పవర్‌ఫుల్‌గా దూసుకొస్తోందో చెప్పడానికి వైభవ్ సూర్యవంశీ కంటే అద్భుతమైన ఉదాహరణ ప్రస్తుతానికి మరొకటి లేదు. రికార్డులు సచిన్‌వి కావచ్చు... కానీ వాటిని తిరగరాయడానికి కొత్త తరం బాస్ సిద్ధమయ్యాడు. మరి ఈ వండర్ కిడ్ టీమిండియాలో అడుగుపెట్టి ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలి!

Tags:    
  • vaibhavsuryavanshi 
  • sachintendulkar 
  • teamindia 
  • indiancricket 
  • cricketnews 
  • iplt20 
  • bcci 
  • testformat 

Similar News

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

Copyright @2026

Powered by Blink CMS