• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  అంతన్నారు.. ఇంతన్నారు.....

అంతన్నారు.. ఇంతన్నారు.. స్టార్లంతా ఒక్క రంజీ మ్యాచ్ కే చాలించారు

| ఫిబ్రవరి 19 నుంచి జరిగే చాంపియన్స్ ట్రోఫీ కోసం నిర్వహించనున్న సన్నాహక శిబిరంలో పాల్గొనేందుకే టీమ్ ఇండియా స్టార్లు రోహిత్, అయ్యర్, గిల్ లు రంజీ ట్రోఫీ మ్యాచ్ కు దూరమైనట్లు చెబుతున్నారు.

By - Tupaki Desk
Update: 2025-01-30 09:30 GMT

కెప్టెన్ రోహిత్ శర్మ.. టెస్టుల్లో తీవ్రంగా విఫలం అవుతున్నాడు.. వన్డేల్లోనూ శ్రీలంకపై నిరాశపరిచాడు..

శ్రేయస్ అయ్యర్.. వన్డే ప్రపంచ కప్ తర్వాత టీమ్ ఇండియాకు దూరమై పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు..

శుబ్ మన్ గిల్.. రెండేళ్లుగా పెద్దగా ఫామ్ లో లేడు. ఆస్ట్రేలియాలో అన్ని టెస్టులూ ఆడించలేదు. టి20లకు ఇతడిని పక్కనపెట్టారు.

రిషభ్ పంత్.. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, భారత జట్టులోకి తిరిగొచ్చినా పూర్తి స్థాయిలో రాణించిన మ్యాచ్ ఒక్కటీ లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో వీరందరినీ రంజీ ట్రోఫీ ఆడాల్సిందేనని హుకుం జారీ చేసింది. కానీ, అందరూ ఆడింది ఎన్ని మ్యాచ్ లో తెలుసా..?

ఒక్కటంటే ఒక్కటేనా..?

బీసీసీఐ ఆదేశాల ప్రకారం.. రోహిత్, పంత్ మాత్రమే కాదు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆడింది ఒక్క రంజీ మ్యాచ్ మాత్రమే.

రోహిత్, జైశ్వాల్, అయ్యర్‌ గతవారం జమ్ము-కశ్మీర్‌తో రంజీ మ్యాచ్‌ ఆడినా దారుణంగా విఫలమయ్యారు. రోహిత్‌ 3, 28, జైశ్వాల్‌ 4, 26, శ్రేయస్‌ 11, 17 పరుగులే చేశారు. 42 సార్లు రంజీ చాంపియన్ అయిన ముంబై ఈ మ్యాచ్ లో కశ్మీర్ చేతిలో ఓడిపోవడం గమనార్హం.

ఢిల్లీకి ఆడిన పంత్‌ 1, 17 పరుగులే చేశాడు. పంజాబ్‌ కు ప్రాతినిధ్యం వహించిన గిల్‌.. రెండో ఇన్నింగ్స్‌ లో సెంచరీ కొట్టాడు. అంతే.. ఇపుడు ఆ ఒక్క మ్యాచ్ తో ప్రస్తుత రంజీ సీజన్ కు వీరు దూరమయ్యారు.

విరాట్ కోహ్లి ప్రస్తుతం ఢిల్లీతో మ్యాచ్ ఆడుతున్నాడు. తదుపరి మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడో లేడో తెలియదు.

అవార్డుల కార్యక్రమం కోసమేనా..

ఫిబ్రవరి 19 నుంచి జరిగే చాంపియన్స్ ట్రోఫీ కోసం నిర్వహించనున్న సన్నాహక శిబిరంలో పాల్గొనేందుకే టీమ్ ఇండియా స్టార్లు రోహిత్, అయ్యర్, గిల్ లు రంజీ ట్రోఫీ మ్యాచ్ కు దూరమైనట్లు చెబుతున్నారు. అయితే, ఇదే సమయంలో కోహ్లి, కేఎల్‌ రాహుల్ రంజీ మ్యాచ్‌ లు ఆడుతున్నారు. వీరికి లేని ఇబ్బంది మిగతావారికి ఎందుకొచ్చింది..? అసలు విషయం ఏమంటే.. శనివారం జరిగే బీసీసీఐ అవార్డుల కోసమే ఈ ఆటగాళ్లు గురువారం మొదలైన రంజీ మ్యాచ్‌ నుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది.

అసలు గాయాలున్నాయా?

కోహ్లి గత మ్యాచ్ లోనే ఢిల్లీకి ఆడాల్సింది. కానీ మెడ నొప్పి అంటూ తప్పుకొన్నాడు. గాయాల పేరు చెప్పి రాహుల్, సిరాజ్‌ కూడా ఆడలేదు. దీంతో అసలు వీరికి గాయాలు ఉన్నాయా? అని దిగ్గజ బ్యాటర్ గావస్కర్ ప్రశ్నించారు. గాయాలంటే జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)కు వెళ్లాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. విశాఖ పట్టణానికి చెందిన యువ ఆల్ రౌండర్ నితీశ్‌ రెడ్డి గాయపడగానే అక్కడికే వెళ్లాడు కదా?’’ అని పేర్కొన్నారు.

‘‘మీరు రంజీ లు ఆడాలి..’’ అని బీసీసీఐ ఆదేశించింది.. ‘‘ఇదిగో ఆడాం చూడు’’ అన్నట్లు ఆటగాళ్లు చేశారు. అంతే.. ‘ఖేల్’ ఖతం.

Tags:    
  • Viratkohli 
  • Rohitsharma 
  • Shreyasiyer 
  • Rishabpant 
  • BCCI 
  • BCCIAwards 
  • Ranjitrophy 
  • Championstrophy 
  • Cricket 
  • Domesticcricket 
  • Teamindia 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

2026-10-26 14:39 GMT

మైదానంలో తెలుగు వాగ్వాదం.. టీమిండియాకు విజయాన్ని అందించిన తెలుగు కుర్రాళ్లు!

2026-10-24 14:22 GMT

Copyright @2026

Powered by Blink CMS