14 ఏళ్ల‌కే వైభ‌వం చూడ‌లేక‌.. సూర్య‌వంశీపై పాకిస్థానీల ఏడుపులు

దాదాపు 30 ఏళ్ల కింద‌ట‌.. పాకిస్థాన్ కు చెందిన షాహిద్ ఆఫ్రిది అంత‌ర్జాతీయ క్రికెట్ లోకి వ‌చ్చాడు.;

Update: 2025-12-16 10:49 GMT

దాదాపు 30 ఏళ్ల కింద‌ట‌.. పాకిస్థాన్ కు చెందిన షాహిద్ ఆఫ్రిది అంత‌ర్జాతీయ క్రికెట్ లోకి వ‌చ్చాడు. అప్ప‌టికి అత‌డికి 16 ఏళ్లేన‌ట‌. కానీ, చూసేందుకు 25 ఏళ్ల వాడిలా క‌నిపించేవాడు. అంద‌రూ ఇదే మాట అన్నారు. ఆఫ్రిది ఏజ్ ఫ్రాడ్ పై త‌ర్వాతి కాలంలో చాలా వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఇందులో వాస్త‌వాలు తేల‌కుండానే ఆఫ్రిది కెరీర్ ముగిసింది.

అటుఇటుగా ఆఫ్రిది వెనువెంట‌నే కేవ‌లం 14 ఏళ్ల వ‌య‌సులోనే అంత‌ర్జాతీయ క్రికెట్ లోకి వ‌చ్చాడు హ‌స‌న్ ర‌జా. ఇత‌డూ పాకిస్థాన్ వాడే. హ‌స‌న్ ర‌జా వ‌య‌సుపైనా అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అత్యంత చిన్న వయ‌సు అనే భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ రికార్డును కొట్టేయాల‌నే ఆత్ర‌మో ఏమోకానీ.. పాకిస్థాన్ హ‌స‌న్ ర‌జాను 14 ఏళ్ల‌కే అంత‌ర్జాతీయ క్రికెట్ కు ప‌రిచ‌యం చేసింది. కానీ, ఇదేమీ నిల‌వ‌లేదు. ర‌జా కెరీర్ త్వ‌ర‌గానే ముగిసింది.

క్రికెట్ చ‌రిత్ర‌లో ఇలాంటి రికార్డున్న పాకిస్థాన్ అభిమానులు.. తాజాగా భార‌త్ కు చెందిన కుర్ర సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ గురించి అవాకులు చెవాకులు పేలుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆసియా క‌ప్ అండ‌ర్ 19 టోర్నీలో యువ భార‌త్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వైభ‌వ్ సూర్య‌వంశీ దుమ్మురేపుతున్నాడు. మొన్న‌టి మ్యాచ్ లో యూఏఈపై 171 ప‌రుగులు సాధించాడు. మంగ‌ళ‌వారం మ‌లేసియాపై 26 బంతుల్లోనే 50 ప‌రుగులు చేశాడు. ఇక అత‌డిని టీమ్ ఇండియాలోకి తీసుకోవాల‌టూ డిమాండ్లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థంలో వైభ‌వ్ పై పాకిస్థాన్ అభిమానులు ఏడుపు లంకించుకున్నారు.

ఎవ‌రు ఛీట‌ర్..

పాక్ కు చెందిన ఆఫ్రిది, హ‌స‌న్ ర‌జా ఉదాహ‌ర‌ణ‌లు పైన క‌నిపిస్తుండ‌గా, వైభ‌వ్ ను ఏజ్ ఫ్రాడ్ అంటూ.. ఛీట‌ర్ అంటూ పాకిస్థానీలు ట్రోల్ చేస్తున్నారు. ఈ మేర‌కు అత‌డిని అవ‌మానించిన వీడియోలు వైర‌ల్ అవుతోంది. ఇందులో.. మూడేళ్లుగా 14 ఏళ్లే అంటున్నావ్ అంటూ అత‌డి ముందే కామెంట్లు చేశారు. దీనిపై భార‌తీయులు మండిప‌డుతున్నారు. ఆదివారం జ‌రిగిన మ్యాచ్ లో పాక్ పై భార‌త్ ఏకంగా 90 ప‌రుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ లో బౌండ‌రీ లైన్ వ‌ద్ద వైభ‌వ్ ఫీల్డింగ్ చేస్తుండ‌గా పాక్ అభిమానులు నోటికి ప‌నిచెప్పారు. చిన్న పిల్లాడిలా లేవు.. 30 ఏళ్ల వాడిలా క‌నిపిస్తున్నావ్ అంటూ వైభ‌వ్ ను ఆడిపోసుకున్నారు. వాళ్ల పాకి నోటికి స‌మాధానం ఇవ్వ‌లేక వైభ‌వ్ అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు.

-కాగా, వైభ‌వ్ వ‌య‌సుపై ఎలాంటి అనుమానాలు లేవు. బిహార్ కు చెందిన ఇత‌డు చిన్న వ‌య‌సులోనే బ్యాట్ ప‌ట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో కేవ‌లం 35 బంతుల్లోనే సెంచ‌రీ కొట్టాడు. ఆ త‌ర్వాత కూడా మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. వైభ‌వ్ క‌చ్చిత‌మైన వ‌య‌సును ఇప్ప‌టికే బీసీసీఐ ధ్రువీక‌రించింది.



Tags:    

Similar News