• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  సంచలనం... మైక్ టైసన్ కు...

సంచలనం... మైక్ టైసన్ కు యూట్యూబర్ చేతిలో ఓటమి!

| బాక్సింగ్ కింగ్, బాక్సింగ్ దిగ్గజం, వరల్డ్ ఫేమస్ మైక్ టైసన్ కు బిగ్ షాక్ తగిలింది.

By - Tupaki Desk
Update: 2024-11-16 06:59 GMT

బాక్సింగ్ కింగ్, బాక్సింగ్ దిగ్గజం, వరల్డ్ ఫేమస్ మైక్ టైసన్ కు బిగ్ షాక్ తగిలింది. సుమారు ఇరవై ఏళ్ల తర్వాత ప్రొఫెషనల్ రింగ్ లోకి అడుగుపెట్టిన మైక్ టైసన్ కు ఓటమి ఎదురైంది. దిగ్గజ బాక్సర్ కు 27 ఏళ్ల యంగ్ యూట్యూబర్ రింగ్ లో స్టార్స్ చూపించాడు. ఇప్పుడు ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

అవును... సుమారు ఇరవై ఎళ్ల తర్వాత ప్రొఫెషనల్ రింగ్ లోకి దిగిన దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ను యూట్యూబర్ జేక్ పాల్ (27) ఓడించాడు. మైక్ టైసన్ మునుపటి ఉత్సహం చివరివరకూ చూపించలేకపోవడంతో ఓటమిపాలయ్యారు. తాజాగా జరిగిన పోరులో 74-78 తేడాతో పరాజయం చవిచూసిన పరిస్థితి నెలకొంది.

వాస్తవానికి ఈ బౌట్ ప్రారంభానికి ముందు నుంచీ, ప్రారంభమైన మొదటి రెండు రౌండ్ల వరకూ మైక్ టైసన్ గెలుస్తారనే అంతా భావించారు. వారి అంచనాలకు బలం చేకూరుస్తూ... బౌట్ ప్రారంభమైన తర్వాత మొదటి రెండు రౌడ్లలో 58 ఏళ్ల టైసన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. దీంతో... మొదటి రెండు రౌండ్లలో పరిస్థితి 10-9, 10-9 గా ఉంది.

అయితే ఆ తర్వాత లెక్క మారిపోయింది. మైక్ టైసన్ ఈ ఉత్సాహాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. వీరిద్దరిమధ్య మొత్తం ఎనిమిది రౌండ్లు జరగ్గా... మొదటి రెండు రౌండ్లలో మాత్రమే టైసన్ ఆధిపత్యం ప్రదర్శించారు. మిగిలిన ఆరు రౌండ్లలోనూ వరుసగా జేక్ పాల్ గెలుచుకున్నాడు. దీంతో... విజయం పాల్ ను వరించింది.

కాగా... బాక్సింగ్ రింగ్ లో మహారాజుగా ఓ వెలుగు వెలుగు వెలుగుతూ.. వివాదాలను వెంటేసుకుని తిరిగిన మైక్ టైసన్ 2005లో కెవిన్ చేతిలో ఓటమి తర్వాత ప్రొఫెషనల్ బాక్సింగ్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే! తాజాగా యూట్యూబర్ తో తలపడ్డాడు. ఈ పోరుకు ముందు స్పందిస్తూ.. ఫ్యాన్స్ కోసం గెలుస్తానని అన్నాడు టైసన్.

ఇక... టైసన్ ఓ యూట్యూబర్ తో తలపడిన ఈ పోరు సందర్భంగా అమెరికా, భారత్ లలో నెట్ ఫ్లిక్స్ కాసేపు షట్ డౌన్ అయినట్లు వార్తలొచ్చాయి. ఈ బౌట్ లో తలపడటం కోసం టైసన్ సుమారు రూ.168 కోట్లు.. పాల్ దాదాపు రూ.337 కోట్లు పొందనున్నట్లు చెబుతున్నారు!

Tags:    
  • Neerajgoyat 
  • Miketyson 
  • Boxing 
  • Texas 
  • Fighter 
  • Latestnews 
  • USA 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

2026-10-26 14:39 GMT

మైదానంలో తెలుగు వాగ్వాదం.. టీమిండియాకు విజయాన్ని అందించిన తెలుగు కుర్రాళ్లు!

2026-10-24 14:22 GMT

Copyright @2026

Powered by Blink CMS