• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  టీమ్‌ ఇండియా సిసలైన పేసు...

టీమ్‌ ఇండియా సిసలైన పేసు గుర్రం... మన హైదరాబాదీ

| ఒకవైపు బ్యాటర్లు బాదేస్తున్నా కనీసం ఆందోళన లేకుండా మరో ఓవర్‌ వేసేందుకు కూడా సిద్ధమయ్యే బౌలర్‌ ఎవరు..? ‍ఎంతటి సుదీర్ఘ స్పెల్స్‌ వేసినా కనీసం అలుపు లేనిది ఎవరు? ఈ ప్రశ్నలకు జవాబు కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

By - Tupaki Desk
Update: 2025-08-02 14:44 GMT

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడిన ఏకైక పేస్‌ బౌలర్‌ ఎవరు..? ఈ సిరీస్‌లో అందరికంటే ఎక్కువ ఓవర్లు వేసింది ఎవరు..? ఒకవైపు బ్యాటర్లు బాదేస్తున్నా కనీసం ఆందోళన లేకుండా మరో ఓవర్‌ వేసేందుకు కూడా సిద్ధమయ్యే బౌలర్‌ ఎవరు..? ‍ఎంతటి సుదీర్ఘ స్పెల్స్‌ వేసినా కనీసం అలుపు లేనిది ఎవరు? ఈ ప్రశ్నలకు జవాబు కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అయ్యో బుమ్రా లేడా..? కానీ, అతడున్నాడు..

ఇంగ్లండ్‌తో సుదీర్ఘ టెస్టు సిరీస్‌కు ముందే సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ జట్టుకు దూరమయ్యాడు. స్టార్‌ పేసర్‌ బుమ్రా ఉన్నప్పటికీ అతడికి గాయం బెడద. సిరీస్‌కు ముందే బుమ్రా ఐదు టెస్టులు ఆడడని మేనేజ్‌మెంట్‌ చెప్పేసింది. మరి ఇలాగైతే జట్టు విజయావకాశాలు దెబ్బతింటాయి కదా..? కానీ, ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అదేమీ జరగలేదు. ఇప్పటివరకు నాలుగు టెస్టులు జరగ్గా బుమ్రా లేని ఆ టెస్టు (రెండోది)లోనే భారత్‌ గెలిచింది. దీనివెనుక ఉన్నది హైదరాబాదీ పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌.

మనిషా? మెషినా..?

సిరాజ్‌ హైదరాబాద్‌ గల్లీల్లో టెన్నిస్‌ బంతితో రాటుదేలినవాడు. దీనికితోడు అతడి శరీర నిర్మాణం మరింత స్ట్రాంగ్‌. అందుకే సిరాజ్‌ బంతితో రనప్‌ తీస్తుంటే (పేసు) గుర్రం దౌడు తీస్తున్నట్లే ఉంటుంది. సిరాజ్‌ ఆదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు గాయంతో జట్టుకు దూరమైన సందర్భాలు లేవంటేనే అతడి ఫిట్‌నెస్‌ లెవల్స్‌ ఏమిటో తెలిసిపోతుంది. సిరాజ్‌ శరీర నిర్మాణమే కాదు.. అతడికి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ కూడా ఎక్కువే. అందుకే మైదానంలో అంత హుషారుగా కనిపిస్తాడు. కెప్టెన్‌ను అడిగి మరీ బౌలింగ్‌ చేస్తాడు.

బుమ్రా లేకుంటేనే..

ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో సిరాజ్‌.. నాలుగు వికెట్ల ప్రదర్శన గురించి ఎంతచెప్పినా తక్కువే. ఇంగ్లండ్‌ ఓపెనర్లు తొలుత చితకబాదినా అతడు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. మరుసటి స్పెల్‌లో పుంజుకుని వారికి చుక్కలు చూపించాడు. ఇంగ్లండ్‌ కీలక బ్యాటర్‌ జోరూట్‌ డిఫెన్స్‌ను బద్దలుకొట్టి ఎల్బీ చేసిన తీరు అమోఘం అనే చెప్పాలి. మిగతా మూడు వికెట్లు తీసిన బంతులు కూడా అద్భుతం. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 51.2 ఓవర్లు సాగితే అందులో సిరాజ్‌ వేసినవి 16.2. కెరీర్‌లో 41వ టెస్టు ఆడుతున్న సిరాజ్‌..25 సార్లు బుమ్రాతో కలిసి బరిలో దిగాడు. ఆ మ్యాచ్‌లలో 74 వికెట్లు తీశాడు. బుమ్రా లేకుండా 16వ టెస్టు ఆడుతున్న అతడు 44 వికెట్లు తీశాడు. అంటే.. బుమ్రా లేకుంటేనే సిరాజ్‌లోని అసలు సిసలు పేసు గుర్రం బయటకు వస్తుందన్నమాట. మరోవైపు ఈ సిరీస్‌లో ఐదుకు ఐదు టెస్టులు ఆడిన సిరాజ్‌ ఏకంగా 155 ఓవర్లు వేశాడు. మొదటి టెస్టులో ఎంతటి ఉత్సాహంగా ఉన్నాడో ఇప్పుడూ అంతే జోష్‌తో కనిపిస్తున్నాడు. అందుకే ఈ హైదరాబాదీ వెరీవెరీ స్పెషల్‌.

Tags:    
  • MohammedSiraj 
  • INDvsENG 
  • TeamIndia 
  • IndianCricket 
  • SirajMagic 
  • MiyaBhai 
  • TestCricket 
  • Bumrah 
  • IndianPaceAttack 
  • IndianBowlers 
  • Mohammed Siraj Bowling 
  • Cricket News 
  • సిరాజ్‌ 
  • టెస్టు సిరీస్‌ 

Similar News

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

2026-10-26 14:39 GMT

మైదానంలో తెలుగు వాగ్వాదం.. టీమిండియాకు విజయాన్ని అందించిన తెలుగు కుర్రాళ్లు!

2026-10-24 14:22 GMT

తెర‌పైకి వీ.వీఎస్ ల‌క్ష్మ‌ణ్ బ‌యోపిక్!

2026-10-24 13:37 GMT

Copyright @2026

Powered by Blink CMS