• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  ఐపీఎల్ మెగా వేలంలో 574...

ఐపీఎల్ మెగా వేలంలో 574 మంది..బంపర్ ఆఫర్.. 2 కోట్లే స్టార్లు

| ఈసారి రిటెన్షన్ లోనే దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ రూ.23 కోట్లు పెట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్.

By - Tupaki Desk
Update: 2024-11-16 14:30 GMT

అనేక మార్పులు.. కొత్త నిబంధనలు.. సరికొత్త విశేషాలతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ ఎడిషన్ కు రంగం సిద్ధం అవుతోంది. వచ్చే సీజన్ మరింత ఉత్సాహంగా సాగేందుకు మెగా వేలం జరగనుంది. అది కూడా కేవలం వారం రోజుల్లోనే ఉంది. గత సీజన్ కు మినీ వేలం జరగ్గా దాదాపు రూ.25 కోట్ల అత్యధిక ధర (ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్-కోల్ కతా) పలికిన సంగతి తెలిసిందే. ఈసారి రిటెన్షన్ లోనే దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ రూ.23 కోట్లు పెట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్.

రిటెన్షన్ పోగా..

కొద్ది రోజుల కిందట రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి ఐపీఎల్ జట్లు. ఒక్కో జట్టు కొందరిని అట్టిపెట్టుకున్నాయి. ఇక మిగిలింది మెగా వేలం. ఈ ఏడాది మెగా వేలం నిబంధనలు మారాయి. మరోవైపు వేలం బరిలో దిగేది ఎందరు? అనే సంఖ్యపై స్పష్టత వచ్చింది. మొత్తం 574 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది.

మూడో వంతు మంది

వచ్చే మెగా వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనబోతున్నారు. బీసీసీఐ గతంలో వెల్లడించిన జాబితా ప్రకారం 1,574 మంది ఆటగాళ్లున్నారు. ఇప్పుడీ జాబితాను మూడో వంతుకు కుదించారు. కాగా, వీరిలోనూ 366 మంది భారత ఆటగాళ్లు. 208 మంది విదేశీ క్రికెటర్లు. ఇక ధర ప్రకారం చూస్తే.. ఇందులో 81 మంది ఆటగాళ్ల కనీస ధర రూ.2 కోట్లు.

స్టార్లూ వేలంలో..

టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్లు వికెట్ కీపర బ్యాటర్ రిషభ్ పంత్, మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్, పేసర్ అర్ష్‌దీప్, షమీ, హైదరాబాదీ సిరాజ్, అవేశ్‌ ఖాన్, లెగ్ స్పిన్నర్ చాహల్ రూ.2 కోట్ల ప్రాథమిక ధరతో వేలంలో ఉన్నారు. విదేశీ స్టార్లలో దక్షిణాఫ్రికా పేసర్లు రబాడ, నోకియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా హిట్టర్లు బట్లర్, మ్యాక్స్‌వెల్‌ కూడా రూ.2 కోట్ల ధరకే వేలంలోకి రానున్నారు. ఇక రూ.కోటిన్నర కనీస ధరతో 27 మంది, రూ.1.25 కోట్లతో 18 మంది, రూ.కోటితో 23 మంది ఆటగాళ్లు మెగా వేలానికి సిద్ధమయ్యారు. ఈ నెల 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దాలో మెగా వేలం నిర్వహించనున్నారు.

Tags:    
  • IPL 
  • IPL2024 
  • IPL2025IndianPremiereLeague 
  • Megaauction 
  • Saudiarabia 
  • Players 
  • BCCI 
  • BoardofControlforCricketinIndia 
  • MitchellStarc 
  • HeinrichKlaasen 
  • Rohitsharma 
  • Viratkohli 
  • ShikharDhawan 
  • ShubmanGill 
  • ShreyasIyer 
  • SuryakumarYadav 
  • HardikPandya 
  • RishabhPant 

Similar News

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

2026-10-26 14:39 GMT

మైదానంలో తెలుగు వాగ్వాదం.. టీమిండియాకు విజయాన్ని అందించిన తెలుగు కుర్రాళ్లు!

2026-10-24 14:22 GMT

Copyright @2026

Powered by Blink CMS