• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  పారిస్ ఒలింపిక్స్‌...

పారిస్ ఒలింపిక్స్‌ "బ్యూటీ"కి ప్రైవేటు మెసేజ్.. మేటరేంటంటే..?

| వీటిన్నింటిలో టాప్ ప్లేస్ లో ఉన్నవాటిలో పారాగ్వే కి చెందిన 20 ఏళ్ల స్విమ్మర్ లువానా అలోన్సో వ్యవహారం ఒకటి.

By - Tupaki Desk
Update: 2024-08-11 14:30 GMT

పారిస్ ఒలింపిక్స్ లో ఎన్నో సంచలన విషయాలు, వివాదాస్పద అంశాలు, వైరల్ వ్యాఖ్యలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వీటిన్నింటిలో టాప్ ప్లేస్ లో ఉన్నవాటిలో పారాగ్వే కి చెందిన 20 ఏళ్ల స్విమ్మర్ లువానా అలోన్సో వ్యవహారం ఒకటి. ఆమె అందం, ఆమె వ్యవహార శైలి కారణంగా తాము ఆటపై శ్రద్ధపెట్టడం లేకపోతున్నమని ఆ దేశ క్రీడాకారులు ఆరోపించారు.

దీంతో... ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న పరాగ్వే మేనేజ్మెంట్... ఈ ఒలింపిక్స్ లో 100 మీటర్ల బటర్ ఫ్లై కేటగిరిలో క్వార్టర్ ఫైనల్స్ కూడా గెలిచిన ఈమెను అందంగా ఉందనే కారణంగా స్వదేశానికి అర్థాంతరంగా రప్పించేసిందనే వార్తలు వచ్చాయి. ఈ సమయంలో తనకు ఓ ప్లేయర్ ప్రైవేట్ మెసేజ్ పెట్టాడంటూ సరికొత్త అంశం తెరపైకి తెచ్చింది.

అవును... పారిస్ ఒలింపిక్స్ బ్యూటీగా నెటిజన్లు సంబోధిస్తున్న లువానా ఆలాన్సో తాజాగా ఓ కీలక విషయం తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా... ఓ స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ తనకు ప్రైవేట్ గా మెసేజ్ లు చేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే... ఇంతకు మించి దీని గురించి తానేమీ చెప్పనని అంతలోనే కట్ చేసేసింది. దీంతో... ఏమి జరిగి ఉంటుందనే చర్చ ఇప్పుడు నెట్టింట మొదలైందని తెలుస్తోంది.

ఈ సందర్భంగా స్పందించిన ఆమె... బ్రెజిల్ ఫుట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ నెయ్ మర్ జూనియర్ తనకు డైరెక్టుగా మెసేజ్ చేశాడని మొదలుపెట్టింది. అయితే అదొక్కటి మాత్రమే చెప్పగలనని, అది కూడా అతడి విజ్ఞప్తి మేరకు వదిలేసినట్లు చెబుతూ... దీని గురించి తాను ఇంకేమీ చెప్పను అని వెల్లడించింది అలోన్సో.

కాగా... పారిస్ నుంచి స్వదేశానికి చేరుకున్న 20 ఏళ్ల లువానా... స్విమ్మింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ షాక్ కు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇకపై ప్రొఫెషనల్ స్విమ్మింగ్ చేయనంటూ ఆమె వెల్లడించింది. ఇంతవరకూ తనకు మద్దతుగా నిలిచిన దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపింది. అయితే... తననెవరూ స్పోర్ట్స్ విలేజ్ నుంచి పంపించేయలేదని వెల్లడించింది.

Tags:    
  • Olympics 
  • Olympics2024 
  • Paris 
  • Parisolympics 
  • Parisolympics2024 
  • Paraguayan 
  • LuanaAlonso 
  • Womenswimmer 
  • Parisolympicbeauty 

Similar News

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

2026-10-26 14:39 GMT

మైదానంలో తెలుగు వాగ్వాదం.. టీమిండియాకు విజయాన్ని అందించిన తెలుగు కుర్రాళ్లు!

2026-10-24 14:22 GMT

తెర‌పైకి వీ.వీఎస్ ల‌క్ష్మ‌ణ్ బ‌యోపిక్!

2026-10-24 13:37 GMT

Copyright @2026

Powered by Blink CMS