• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  అయోధ్య రాముడికి టీమిండియా...

అయోధ్య రాముడికి టీమిండియా తెలుగు ‘భరతుడి’ సెంచరీ అంకితం

| టీమిండియా ఈ నెల 25 నుంచి ఉప్పల్ లో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్ తో ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇది మొదటి టెస్టు కావడం గమనార్హం.

By - Tupaki Desk
Update: 2024-01-22 14:30 GMT

దేశమంతా ఇప్పుడు ఒకటే చర్చ.. ఒకటే మాట.. అదే అయోధ్య.. జై శ్రీరామ్.. భవ్యమైన మందిర ప్రారంభోత్సవ వేళ భక్తిభావంతో భారతావని పులకించిపోతోంది.. ఈ సమయంలో అధిక శాతం వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలోనూ జైశ్రీరామ్ నినాదాలతో కూడిన స్టేటస్ లే. అయోధ్య మందిర చిత్రాలే. సరిగ్గా ఇదే సమయంలో టీమిండియా భరతుడు సెంచరీ కొట్టి అయోధ్య రాముడికి తనవంతుగా హారతి ఇచ్చాడు. విశేషం ఏమంటే.. గతంలో టీమిండియాలో రాముడి పరమ భక్తుడు ‘‘హనుమంతుడు’’ ఉండేవాడు. అతడి బలం కాస్త తగ్గడంతో వెనకపట్టు పట్టాడు.. ఇప్పుడు రాముడికి తమ్ముడే అయినా భక్తిలో హనుమంతుడితో సాటిరాగల భరతుడు వచ్చాడు.

అయోధ్య రాముడి చలవతో..

టీమిండియా ఈ నెల 25 నుంచి ఉప్పల్ లో టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్ తో ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇది మొదటి టెస్టు కావడం గమనార్హం. ఇటీవలే దక్షిణాఫ్రికా పర్యటనలో కఠిన పరీక్షను ఎదుర్కొని మన జట్టు సిరీస్ ను 1-1తో డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పర్యటన ముగిశాక సంచలనాల అఫ్ఘానిస్థాన్ తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడింది. ఇప్పుడు టెస్టులను వన్డే తరహాలో ఆడే ఇంగ్లండ్ తో ఐదు మ్యాచ్ లలో తలపడనుంది. వాస్తవానికి భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ డిఫెండింగ్ చాంపియన్ గా అడుగుపెట్టి ఘోర ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. దానిని మరిచిపోయేందుకు భారత్ ను భారత్ లో ఓడించడం వారికి అత్యవసరం. ఈ నేపథ్యంలో రాబోయే ఐదు టెస్టుల సిరీస్ ను సవాల్ గా తీసుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఇక భారత్ కూ ఈ సిరీస్ చాలా కీలకం. వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో పరాజయం అనంతరం దక్షిణాఫ్రికా సిరీస్ తో టెస్టు సిరీస్ లో త్రుటిలో పరాభవం తప్పించుకుంది. ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో పాయింట్లు పెరగాలంటే.. ఇంగ్లండ్ ను క్లీన్ స్వీప్ చేయాలి. తద్వారా చాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలుస్తుంది. అందుకు పునాది ఈ నెల 25 నుంచి హైదరాబాద్ లో జరిగే తొలి టెస్టులోనే పడాల్సిన అవసరం ఉంది. కాగా.. ఈ మ్యాచ్ కు టీమిండియా వికెట్ కీపర్ ఎవరనే ప్రశ్న వస్తోంది. ఇప్పటికే జట్టులో కేఎల్ రాహుల్, విశాఖ పట్నం కుర్రాడు కేఎస్ భరత్, యూపీకి చెందిన యువ ధ్రువ్ జురెల్ రూపంలో ముగ్గురు కీపర్లున్నారు. వీరిలో కేఎస్ భరత్ కే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు.

ఐదు రోజులు వికెట్లు కాసేలా..?

టెస్టు మ్యాచ్ లో వికెట్ కీపింగ్ అంటే మాటలు కాదు. విదేశాల్లో అయితే అన్నీ ఫాస్ట్ పిచ్ లే. రాహుల్ ఇటీవలి దక్షిణాఫ్రికా సిరీస్ లో వికెట్ కీపింగ్ చేశాడు. ఓ బ్యాట్స్ మన్ ను అదనంగా ఆడించేందుకు ఇది పనికొచ్చింది. కానీ, భారత్ లో ఎక్కువ శాతం స్పిన్ పిచ్ లు. అందులోనూ అశ్విన్, జడేజా వంటి మేటి స్పిన్నర్ల బంతులను ఒడిసిపట్టడం అంత సులువు కాదు. దీనికి స్పెషలిస్ట్ కీపర్లు అవసరం. ఆ నైపుణ్యం రాహుల్ కంటే భరత్ కు ఎక్కువగా ఉంది. ధ్రువ్ జురెల్ ఇంకా కుర్రాడు. అతడికి టెస్టు అవకాశం ఇస్తారని భావించలేం. మరోవైపు భరత్ తాజాగా ఇంగ్లండ్ లయన్స్ (ఎ జట్టు)తో జరిగిన టూర్ మ్యాచ్ లో సెంచరీ కొట్టాడు. అది కూడా రెండో ఇన్నింగ్స్ లో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా సెంచరీ చేసి మ్యాచ్ డ్రా కావడంలో కీలక పాత్ర పోషించాడు.

బ్యాట్ ను విల్లును చేసి.. రాముడికి అభివాదం

ఇంగ్లండ్ లయన్స్ తో మ్యాచ్ లో సెంచరీ అనంతరం కేఎస్ భరత్ తన బ్యాట్ ను విల్లులా చూపుతూ బాణం సంధించినట్లుగా సైగలు చేశాడు. దీంతో సెంచరీని రాముడికి అంకితం ఇచ్చినట్లు అయింది. కాగా భరత్ ఇప్పటికే టీమిండియా తరఫున టెస్టులు ఆడాడు. కీపింగ్ బాగున్నా బ్యాటర్ గా ఆకట్టుకోలేదు. ఇప్పుడు రాముడికి అంకితం ఇచ్చిన సెంచరీ ద్వారా బ్యాటింగ్ పై అనుమానాలను తీర్చాడు. మరోవైపు రామాయణంలో భరతుడి పాత్ర అందరికీ తెలిసిందే. అన్న శ్రీ రాముడి పట్ల అతడికి ఉన్న ఆరాధ్య భావం గురించి గొప్పగా చెబుతుంటారు. రాముడితో పాటు లక్ష్మణుడు వనవాసానికి వెళ్లడంతో అతడికి ఎక్కువ పేరు వచ్చింది. అయితే, భరతుడి తల్లి కైకేయి కోరడంతోనే రాముడు సింహాసనం అధిష్ఠించకుండా వనవాసానికి వెళ్లాడు. కానీ, భరతుడు మాత్రం అన్న వచ్చేవరకు ఆ సింహాసనం మీద కూర్చోలేదు. సోదరుడి పాదుకలను సింహాసనంపైన ఉంచి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

Tags:    
  • Ksbharath 
  • Englandlions 
  • Century 
  • Ayodhya 
  • Rammandir 
  • England 
  • Klrahul 

Similar News

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

2026-10-26 14:39 GMT

మైదానంలో తెలుగు వాగ్వాదం.. టీమిండియాకు విజయాన్ని అందించిన తెలుగు కుర్రాళ్లు!

2026-10-24 14:22 GMT

తెర‌పైకి వీ.వీఎస్ ల‌క్ష్మ‌ణ్ బ‌యోపిక్!

2026-10-24 13:37 GMT

వన్డే క్రికెట్‌లో టాప్-10 భారీ ఛేజింగ్‌లు.. చరిత్ర సృష్టించిన శ్రీలంక!

2026-10-23 04:39 GMT

Copyright @2026

Powered by Blink CMS