• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  మెడికల్ రిపోర్ట్ లీక్.....

మెడికల్ రిపోర్ట్ లీక్.. ఆమె (అతడు) సంచలన నిర్ణయం

| పారిస్ ఒలింపిక్స్ లో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన అంశాల్లో ఒకటి అల్జీరియాకు చెందిన బాక్సర్ వ్యవహారమే.

By - Tupaki Desk
Update: 2024-11-07 06:31 GMT

పారిస్ ఒలింపిక్స్ లో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన అంశాల్లో ఒకటి అల్జీరియాకు చెందిన బాక్సర్ వ్యవహారమే. ఈ దేశానికి చెందిన బాక్సర్‌ ఇమానె ఖెలిఫ్‌ ఆమెనా? అతడా? అనే సందేహంతో పాటు విమర్శలూ వచ్చాయి. ఖెలిఫ్ ఏకంగా స్వర్ణం నెగ్గడంతో మరింత రచ్చ జరిగింది. తాజాగా ఖెలిఫ్‌ లింగ గుర్తింపు వైద్య నివేదిక బయటపడింది. ఆమె (అతడు) శరీరంలో అంతర్గంతగా వృషణాలు, ఎక్స్‌వై క్రోమోజోములు ఉన్నట్లు తేలింది.

పారిస్‌ లోని క్రెమ్లిన్‌ బికెట్రే ఆస్పత్రి, అల్జీరియాకు చెందిన మొహమ్మద్‌ లామినే ఆస్పత్రి వైద్యులు 2023 జూన్‌లో వెల్లడించిన ఇమానె నివేదిక ప్రకారం అంతర్గతంగా వృషణాలు ఉన్నా.. గర్భసంచి లేదు. ఎంఆర్‌ఐలో ఇతర జననాంగాలు మాత్రం ఉన్నాయి. దీంతో ఆమె పురుషుడని నిర్ధరణ అయినట్లుగా పోస్టులు పెట్టారు.

ఆగస్టులో జరిగిన పారిస్‌ ఒలింపిక్స్‌లో ఖెలిఫ్ 66 కేజీల ప్రి క్వార్టర్స్‌లో 46 సెకన్లలోనే ఇటలీ బాక్సర్‌ ను ఓడించింది. ఈ బౌట్ లో ఇమానె పంచ్‌ లకు ఇటలీ బాక్సర్‌ కుప్పుకూలింది. ఇమానెలో ఇంత పవర్ కు కారణం ఆమె ‘అతడు’ అని.. పోటీల్లోకి ఎలా అనుమతించారంటూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీపైనా విరుచుకుపడ్డారు. కాగా, నిరుడు ఢిల్లీలో వరల్డ్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్ లోనే లింగ వివాదం కారణంగా ఇమానెను ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ తప్పించింది. అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ మాత్రం పారిస్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చింది. ఇక ఫైనల్లో ఆమె చైనా బాక్సర్ యాంగ్‌ లియూను ఓడించి స్వర్ణం నెగ్గింది.

వైద్య నివేదిక లీక్ తో..

ఇమానె స్వర్ణం నెగ్గడం సంచలనంగా మారగా.. ఆమె వైద్య నివేదిక ఇటీవల బటయపడడం మరింత సంచలనంగా మారింది. పైగా దీనిని ఒలింపిక్స్ జరిగిన ఫ్రాన్స్ కు చెందిన జర్నలిస్టే బయటపెట్టాడు. ఇప్పుడు ఇమానె నుంచి బంగారు పతకాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. అసలే భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కేవలం కొన్ని గ్రాముల అధిక బరువు కారణంగా పతకం కోల్పోయిన పారిస్ ఒలింపిక్స్ లో ఇమానె అంశం కూడా రగడకు దారితీస్తోంది. ‘అతడి’ నుంచి మెడల్ వెనక్కు తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. దీంతో ఇమానె కీలక నిర్ణయం తీసుకుందన చెబుతున్నారు.

మీడియాపై కోర్టుకు..

తనకు సంబంధించిన వైద్య నివేదికను బయటపెట్టిన ఫ్రెంచ్ మీడియాపై కోర్టుకు వెళ్లేందుకు ఇమానె నిర్ణయించిందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. దీనిని తాము అర్థం చేసుకుంటున్నామని చెప్పింది. ఆమె పరువునష్టం దావా వేసేందుకు సిద్ధమవుతోందని.. దీనిపై తామేమీ స్పందించబోమని తెలిపింది. అయితే, వైద్య నివేదికలు వాస్తవమైనవా? కాదా? అని తెలియకుండానే వెల్లడించేసిన జర్నలిస్ట్ పై చర్యలు తీసుకుందని పేర్కొంది.

Tags:    
  • Olympicboxer 
  • Imanekhelif 
  • Malechromosomes 
  • Imanekhelifmedicalreport 
  • Imane Khelif 
  • Parisolympics 
  • Olympicgoldmedalist 

Similar News

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

2026-10-26 14:39 GMT

మైదానంలో తెలుగు వాగ్వాదం.. టీమిండియాకు విజయాన్ని అందించిన తెలుగు కుర్రాళ్లు!

2026-10-24 14:22 GMT

తెర‌పైకి వీ.వీఎస్ ల‌క్ష్మ‌ణ్ బ‌యోపిక్!

2026-10-24 13:37 GMT

Copyright @2026

Powered by Blink CMS