నాన్నను వదిలేస్తా: మాథ్యూ హేడెన్ కుమార్తె గ్రేస్ ఘాటు స్పందన!
తండ్రి హేడెన్ చేసిన ఈ సంచలన ఛాలెంజ్ పై మాథ్యూ హేడెన్ కుమార్తె గ్రేస్ హేడెన్ ఘాటుగా స్పందించారు.;
ఇంగ్లండ్ తో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ జోరుగా సాగుతోంది. ఇంగ్లండ్ ను ఆస్ట్రేలియా ఓడించింది. ఇప్పుడు దీని గురించే హాట్ హాట్ చర్చ సాగుతోంది. విశ్లేషకుడిగా ఉన్న ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ తాజాగా హాట్ కామెంట్స్ తో కాక రేపాడు. హేడెన్ క్రికెట్ ప్రపంచంలో తన దూకుడైన బ్యాటింగ్ తో ఎంత ఫేమస్సో.. తాజాగా ఆయన చేసిన ఛాలెంజ్ తో ఆయన కుమార్తె గ్రేస్ హేడెన్ కూడా అంతే వైరల్ అయ్యారు.
ఇంగ్లండ్ కు చెందిన బ్యాటర్ జో రూట్ గనుక సెంచరీ చేయకపోతే తాను నగ్నంగా తిరుగుతానని మాథ్యూ హేడెన్ ఛాలెంజ్ చేశారు. ఈ చాలెంజ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చివరకు జోరూట్ సెంచరీ చేసి తన బ్యాటింగ్ తో హేడెన్ ను ఆ పరిస్థితి నుంచి కాపాడారు.
ఫ్యామిలీ పరువును కాపాడిన రూట్ అన్న గ్రేస్
తండ్రి హేడెన్ చేసిన ఈ సంచలన ఛాలెంజ్ పై మాథ్యూ హేడెన్ కుమార్తె గ్రేస్ హేడెన్ ఘాటుగా స్పందించారు. రూట్ సెంచరీ చేయడంపై ఆమె ఊపిరి పీల్చుకున్నారు. గ్రేస్ మాట్లాడుతూ.. ‘జో రూట్ సెంచరీ చేసి మా ప్యామిలీ పరువు కాపాడారు. ఇంగ్లీష్ బ్యాటర్ సెంచరీ చేయాలని నేను ఇంతలా కోరుకుంటానని అనుకోలేదు. ఆయనకు చాలా చాలా థాంక్స్ ’ అంటూ గ్రేస్ ఆనందపడ్డారు. అంతేకాదు భవిష్యత్తులో తన తండ్రి ఇంకోసారి ఇలా నగ్నంగా తిరుగుతానని చాలెంజెస్ చేస్తే ఆయనను తండ్రే కాదని చెప్పేస్తా అంటూ గ్రేస్ హెడెన్ తన తండ్రికి వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఈ నగ్న చాలెంజ్ లు తన తండ్రి ఇంకోసారి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
జోరూట్ సెంచరీ సాధించిన వెంటనే.. మాథ్యూ హేడెన్ ఊపిరిపీల్చుకున్నాడు. ఈ చాలెంజ్ నుంచి తనను తప్పించినందుకు రూట్ కు థాంక్స్ చెప్పాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన వీడియోలో హేడెన్ జోరూట్ కు అభినందనలు తెలుపుతూ.. ‘అభినందనలు మేట్.. ఆస్ట్రేలియాలో సెంచరీ సాధించడానికి నీకు కొంచెం సమయం పట్టింది. కానీ నీకంటే ఈ పందెంలో ఎక్కువ స్కిన్ ఉన్నవాడిని మరొకరిని ఉండడు అంటూ తన నగ్న చాలెంజ్ పై చమత్కరించారు హేడెన్.
ఈ మొత్తం వ్యవహారంపై యాషెస్ సిరీస్ లో క్రికెట్ తోపాటు నవ్వులు పంచిన ఒక ముఖ్యమైన అంశంగా వైరల్ అవుతోంది.