• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  2/8.. 5 టైటిళ్ల ఆ జట్టుకు...

2/8.. 5 టైటిళ్ల ఆ జట్టుకు ఇంకా ఐపీఎల్ ప్లేఆఫ్స్ చాన్స్..ఇలా చేస్తేనే?

| ఐదుసార్లు టైటిల్ విజేత.. మరో ఐదుసార్లు రన్నరప్.. మొత్తం 17 సీజన్లలో 12 సార్లు ప్లే ఆఫ్స్ నకు అర్హత.

By - Tupaki Desk
Update: 2025-04-21 11:36 GMT

ఐదుసార్లు టైటిల్ విజేత.. మరో ఐదుసార్లు రన్నరప్.. మొత్తం 17 సీజన్లలో 12 సార్లు ప్లే ఆఫ్స్ నకు అర్హత. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనే అత్యంత విజయవంతమైన జట్టు.. మరే జట్టుకూ సాధ్యం కాని రికార్డు ఇది.

లీగ్ లో అత్యంత ఆదరణ ఉన్న జట్టు.. ఏ మైదానంలో ఆడినా వేలాదిమంది ఫ్యాన్స్.. టీవీల్లోనూ ఆ జట్టు మ్యాచ్ కు మాంచి వ్యూయర్ షిప్..

కానీ ప్రస్తుతం చూస్తే.. ఆడింది 8 మ్యాచ్ లు.. గెలిచింది రెండే. పాయింట్ల పట్టికలో అట్టడుగున. మ్యాచ్ మ్యాచ్ కు ప్రదర్శన డౌన్.. వరుసగా రెండో ఏడాది కూడా ప్లేఆఫ్స్ ఆశలు లేనట్లే అనే పరిస్థితి.

ఇదీ ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి. మరి ఈ సీజన్ లోనూ ఆ జట్టు ప్లే ఆప్స్ చేరడం కష్టమేనా? ఓ విధంగా చెప్పాలంటే చెన్నైకు దారులు మూసుకుపోయినట్లే..

మొత్తం 14 మ్యాచ్ లకు గాను మిగిలిన ఆరూ గెలిస్తేనే చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుంది. అయితే, అది కూడా సాదాసీదాగా కాదు. భారీ తేడాలతో. అటు బ్యాట్ తో, ఇటు బాల్ తో చెన్నై ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే ఇది సాధ్యమేనా అనిపిస్తోంది.

కెప్టెన్ మారినా..

అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పగ్గాలు అందుకున్నా సరే.. చెన్నై తమ అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీస్తుందా? అంటే అదీ చెప్పలేం. ఆదివారం నాటి ముంబైతో మ్యాచ్ ను గమనిస్తే చెన్నై తిరిగి పైకి లేస్తుందనే ఆశలు చాలా తక్కువమందికి ఉంటాయి.

రన్ రేట్ ను మెరుగుపర్చుకుంటూ అన్ని మ్యాచ్ లను గెలిస్తేనే చెన్నైకి చాన్సులు. మూడు మ్యాచ్ లను సొంత మైదానం చెపాక్‌, మూడు మ్యాచ్ లు బయట ఆడాల్సి ఉంటుంది. చెపాక్ లో ఈ నెల 25న సన్ రైజర్స్ తో ఆడాల్సి ఉంది. 30న పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లు మరింత కీలకం.

కాగా, నిరుడు కూడా ఇలాంటి పరిస్థితే బెంగళూరుకు ఎదురైంది. తొలి 8 మ్యాచ్ లలో ఒక్కటే గెలిచిన ఆ జట్టు.. 9వ మ్యాచ్‌ నుంచి 14వ మ్యాచ్‌ వరకు వరుసగా గెలిచింది. టాప్‌-4లో నిలిచి ప్లే ఆఫ్స్‌ చేరింది.

కొసమెరుపు: నిరుటి పరిస్థితి వేరు.. ఇప్పటి కథ వేరు. ఢిల్లీ, పంజాబ్, లక్నో, గుజరాత్ నిరుడు అంత ఫామ్ లో లేవు. ఈసారి అవే ప్లేఆఫ్స్ రేసులో ముందున్నాయి. కాబట్టి చెన్నై.. సూపర్ గా ఆడితేనే ఫ్లే ఆఫ్స్ చేరుతుంది. లేదంటే వరుసగా రెండోసారీ ఇంటికే.

Tags:    
  • CSK 
  • IPL2025 
  • ChennaiSuperKings 
  • Dhoni 
  • CSKFans 
  • IPLPlayoffsRace 
  • MSDhoni 
  • WhistlePodu 
  • IPLDrama 
  • CricketBuzz 
  • CSKInTrouble 
  • IPL2025Playoffs 

Similar News

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

2026-10-26 14:39 GMT

మైదానంలో తెలుగు వాగ్వాదం.. టీమిండియాకు విజయాన్ని అందించిన తెలుగు కుర్రాళ్లు!

2026-10-24 14:22 GMT

తెర‌పైకి వీ.వీఎస్ ల‌క్ష్మ‌ణ్ బ‌యోపిక్!

2026-10-24 13:37 GMT

Copyright @2026

Powered by Blink CMS