మ్యాచ్ కు రూ.3 కోట్లు.. టీమ్ ఇండియా జెర్సీ మహా ఖరీదు
ఆన్ లైన్ గేమింగ్ బిల్లు పుణ్యమాని బీసీసీఐకి ఆదాయం మరింత పెరుగుతోంది. అదేంటి..? ఆన్ లైన్ గేమ్స్ నిషేధంతో అందరూ నష్టపోతుంటే బీసీసీఐకి డబ్బులు రావడం ఏమిటనే అనుమానం కలుగుతోందా? ఔను, మీరు చదువుతున్నది నిజమే..! అక్కడే ఉంది అసలు కిటుకు. బీసీసీఐ అంటే ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు అనే సంగతి తెలిసిందే. దీనిలాగానే భారత క్రికెట్ జట్టు స్పాన్షర్ షిప్ అంటే హాట్ కేక్ అనుకోవాలి. ఇప్పుడు ఈ హాట్ కేక్ మరింత డిమాండ్ గా మారింది. డ్రీమ్ 11 పోయినా.. అంతకంటే డిమాండ్ మొన్నటివరకు టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్ షిప్ డ్రీమ్ 11ది. ఆన్ లైన్ గేమింగ్ నిషేధంతో ఈ సంస్థ వైదొలగక తప్పలేదు. సెప్టెంబరు 9 నుంచి జరిగే ఆసియా కప్ లోగా కొత్త స్పాన్సర్ ను వెదకడం కష్టమే. దీంతో ఆ కప్ లో జెర్సీ స్పాన్సర్ లేకుండానే మన జట్టు బరిలో దిగనుంది. ఇక దీనితో సంబంధం లేకుండా వచ్చే మూడేళ్లలో పురుషుల, మహిళల జట్ల జెర్సీ స్పాన్సర్ కోసం బీసీసీఐ సెర్చింగ్ మొదలుపెట్టింది. సెప్టెంబరు 30లోగా దీనిని ఖరారు చేయనుంది. 140 మ్యాచ్ లకు.. రూ.450 కోట్లు.. కొత్త జెర్సీ స్పాన్సర్ షిప్ కాంట్రాక్టు 2028 వరకు ఉండనుంది. ఈ మూడేళ్లలో ద్వైపాక్షిక సిరీస్ లు, ఆసియా కప్, ఐసీసీ టోర్నీలు అన్నీ కలిపి 140 మ్యాచ్ లకు స్పాన్సర్ షిప్ దక్కనుంది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్ లలో ఒక్కో మ్యాచ్ కు రూ.3.5 కోట్లు, ఐసీసీ, ఆసియా కప్ మ్యాచ్ లకు రూ.కోటిన్నర చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా రూ.450 కోట్లు ఆదాయం పొందాలని బీసీసీఐ చూస్తోంది. ఇది డ్రీమ్ 11 స్పాన్సర్ షిప్ కంటే దాదాపు వంద కోట్లు ఎక్కువే. మూడేళ్ల స్పాన్సర్ షిప్ నకు డ్రీమ్ 11 దాదాపు రూ.358 కోట్లకు కాంట్రాక్టు పొందింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కారణంగా మరో ఏడాది ఉండగానే తప్పుకొంది. ఇలా జరిగినందుకు బీసీసీఐ ఏమీ చెల్లిస్తుందో లేదో తెలియదు. ఒకవేళ డ్రీమ్ 11కు ఇచ్చేదేమీ ఉండకపోతే.. బీసీసీఐకి అది కూడా ఒక ఆదాయమే. ఎందుకంటే ఓ ఏడాది ముందే వైదొలగినందున రూ.150 కోట్లు (కొత్త స్పాన్సర్ షిప్ మూడేళ్లకు రూ.450 కోట్లు కాబట్టి) మిగిలినట్లే.;
ఆన్ లైన్ గేమింగ్ బిల్లు పుణ్యమాని బీసీసీఐకి ఆదాయం మరింత పెరుగుతోంది. అదేంటి..? ఆన్ లైన్ గేమ్స్ నిషేధంతో అందరూ నష్టపోతుంటే బీసీసీఐకి డబ్బులు రావడం ఏమిటనే అనుమానం కలుగుతోందా? ఔను, మీరు చదువుతున్నది నిజమే..! అక్కడే ఉంది అసలు కిటుకు. బీసీసీఐ అంటే ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు అనే సంగతి తెలిసిందే. దీనిలాగానే భారత క్రికెట్ జట్టు స్పాన్షర్ షిప్ అంటే హాట్ కేక్ అనుకోవాలి. ఇప్పుడు ఈ హాట్ కేక్ మరింత డిమాండ్ గా మారింది.
డ్రీమ్ 11 పోయినా.. అంతకంటే డిమాండ్
మొన్నటివరకు టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్ షిప్ డ్రీమ్ 11ది. ఆన్ లైన్ గేమింగ్ నిషేధంతో ఈ సంస్థ వైదొలగక తప్పలేదు. సెప్టెంబరు 9 నుంచి జరిగే ఆసియా కప్ లోగా కొత్త స్పాన్సర్ ను వెదకడం కష్టమే. దీంతో ఆ కప్ లో జెర్సీ స్పాన్సర్ లేకుండానే మన జట్టు బరిలో దిగనుంది. ఇక దీనితో సంబంధం లేకుండా వచ్చే మూడేళ్లలో పురుషుల, మహిళల జట్ల జెర్సీ స్పాన్సర్ కోసం బీసీసీఐ సెర్చింగ్ మొదలుపెట్టింది. సెప్టెంబరు 30లోగా దీనిని ఖరారు చేయనుంది.
140 మ్యాచ్ లకు.. రూ.450 కోట్లు..
కొత్త జెర్సీ స్పాన్సర్ షిప్ కాంట్రాక్టు 2028 వరకు ఉండనుంది. ఈ మూడేళ్లలో ద్వైపాక్షిక సిరీస్ లు, ఆసియా కప్, ఐసీసీ టోర్నీలు అన్నీ కలిపి 140 మ్యాచ్ లకు స్పాన్సర్ షిప్ దక్కనుంది. ఇందులో ద్వైపాక్షిక సిరీస్ లలో ఒక్కో మ్యాచ్ కు రూ.3.5 కోట్లు, ఐసీసీ, ఆసియా కప్ మ్యాచ్ లకు రూ.కోటిన్నర చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా రూ.450 కోట్లు ఆదాయం పొందాలని బీసీసీఐ చూస్తోంది. ఇది డ్రీమ్ 11 స్పాన్సర్ షిప్ కంటే దాదాపు వంద కోట్లు ఎక్కువే. మూడేళ్ల స్పాన్సర్ షిప్ నకు డ్రీమ్ 11 దాదాపు రూ.358 కోట్లకు కాంట్రాక్టు పొందింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కారణంగా మరో ఏడాది ఉండగానే తప్పుకొంది. ఇలా జరిగినందుకు బీసీసీఐ ఏమీ చెల్లిస్తుందో లేదో తెలియదు. ఒకవేళ డ్రీమ్ 11కు ఇచ్చేదేమీ ఉండకపోతే.. బీసీసీఐకి అది కూడా ఒక ఆదాయమే. ఎందుకంటే ఓ ఏడాది ముందే వైదొలగినందున రూ.150 కోట్లు (కొత్త స్పాన్సర్ షిప్ మూడేళ్లకు రూ.450 కోట్లు కాబట్టి) మిగిలినట్లే.