• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Sports >  బంగ్లా క్రికెట్ చైర్మన్...

బంగ్లా క్రికెట్ చైర్మన్ గాయబ్.. ప్రపంచ కప్ తో పాటు ఆ జట్టు టూర్లన్నీ డౌట్

| అయితే, ఇంకో కీలక పరిణామం ఏమంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజ్ముల్ నాలుగైదు రోజుల నుంచి కనిపించడం లేదు.

By - Tupaki Desk
Update: 2024-08-08 13:30 GMT

అల్లకల్లోల బంగ్లాదేశ్ లో క్రికెట్ పరిస్థితి ఏమిటన్నది తెలియరాకుండా ఉంది. ఇద్దరు బంగ్లా ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లు, మాజీ కెప్టెన్లు అయిన వారు తాజాగా పదవిని కోల్పోయిన షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఎంపీలు. వీరిలో ఒకరు మేటి పేసర్ మొష్రఫె మొర్తజా కాగా మరొకరు షకిబుల్ హసన్. తాజా ఆందోళనల సందర్భంగా మొష్రఫె మౌనంగా ఉన్నాడు. నరైల్ లోని ఇతడి ఇంటిని ఆందోళనకారులు దహనం చేశారు. షకిబుల్ కెనడాలో లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే, ఇంకో కీలక పరిణామం ఏమంటే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజ్ముల్ నాలుగైదు రోజుల నుంచి కనిపించడం లేదు. ఇతడు ఈ ఏడాది మొదటి వరకు బంగ్లా క్రీడల మంత్రి కూడా. ఆందోళనకారులు ఇతడి ఇంటినీ ధ్వంసం చేశారు.

బంగ్లాదేశ్ సీనియర్ జట్టు ఈ నెల 16 నుంచి పాకిస్థాన్ తో పాకిస్థాన్ లో సిరీస్ ఆడనుంది. ఎ జట్టు మంగళవారమే బయల్దేరాల్సి ఉంది. కానీ, ఆందోళనల కారణంగా కొన్నిరోజులుగా ప్రాక్టీస్ సెషన్ కూడా జరగలేదు. ఢాకా విమానాశ్రయం మూసివేతతో ప్రయాణమూ రద్దయింది. శనివారం నుంచి జరగాల్సిన మ్యాచ్ ను 13వ తేదీకి మార్చారు. మరోవైపు లంక నుంచి తిరిగొచ్చిన బంగ్లా మహిళల జట్టు ప్రాక్టీస్ కూడా ఆగిపోయింది.

ఇక అక్టోబరు నుంచి బంగ్లాదేశ్ లో మహిళల టి20 ప్రపంచ కప్ జరగనుంది. అయితే, ఇది రద్దయ్యే అవకాశమే ఎక్కువ. వేదికను భారత్, యూఏఈ లేదా శ్రీలంకకు మార్చే ఆలోచన చేస్తున్నారు.

ఏడాదిపైగా వ్యవధి ఉన్నా..

బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ)కి ఏడాదిపైగా అంటే 2025 అక్టోబరు వరకు వ్యవధి ఉంది. కానీ, నజ్ముల్.. మాజీ ప్రధాని హసీనాకు బాగా దగ్గరివాడు. కాబట్టి కొత్త ప్రభుత్వం ఆయనను కొనసాగించదు. అసలు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు. బీసీబీ డైర్టకర్ అయిన మరో వ్యక్తి అవామీ తరఫున ఎంపీగా ఎన్నికయ్యాడు. బోర్డులోని చాలామంది డైరక్టర్లకు హసీనా పార్టీతో లింకులున్నాయి. హసీనా బంధువులు బోర్డులో ఉన్నారు. వీరిలో ఈ నెల 5 నుంచి చాలామంది ఫోన్లు స్విచ్ఛాఫ్. వీరెవరూ అందుబాటులో లేరు.

నజ్ముల్ ఎక్కడ?

బీసీబీ చైర్మన్ అయిన నజ్ముల్ హుసేన్ ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. ఆయన దేశం విడిచిపోయారని కూడా చెబుతున్నారు. కొందరేమో బంగ్లాదేశ్ లోనే ఉన్నాడని అంటున్నారు. కిషన్ గంజ్ లోని ఇతడి పూర్వీకుల ఇంటిని దుండగులు దహనం చేశారు. అయితే, ఆయన అందులో లేకపోవడంతో ప్రాణాలు దక్కించుకున్నారు.

Tags:    
  • Bangladesh 
  • Nazmul 
  • Shakibhulhaasan 
  • Moshrafemortaza 
  • Shekihhasina 
  • Canada 
  • Bcc 
  • Srilanka 

Similar News

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ఒక నవ్వు.. ఎంబాపే కొంప మునిగింది.. చైనా నుంచి గట్టి షాక్ తగిలింది..

2026-11-02 13:54 GMT

ముంబై ఇండియన్స్ తో హార్దిక్ పాండ్యా రాజీ.. కానీ ఒక కండీషన్.. తెలుగోడికి అన్యాయం?

2026-10-30 22:30 GMT

మ్యాచ్ మధ్యలో క్రికెటర్ తల్లిపై కామెంట్.. ఏం మనుషులురా మీరు.. ఇదేం దౌర్భాగ్యం

2026-10-30 07:20 GMT

రొనాల్డోను వెనక్కి నెట్టిన గిల్.. గిల్‌కు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు!

2026-10-30 04:01 GMT

ముంబై ఇండియన్స్ కొట్టే జట్టు ఐపీఎల్ లో పుట్టలేదిక..

2026-10-29 15:30 GMT

నువ్వు 12 బంతుల్లో 50 కొట్టలేదు.. కానీ.. అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్..

2026-10-27 12:38 GMT

జెర్సీ నంబర్ కోసం ఫైటింగ్.. అంతటి సెహ్వాగ్ కు తల్లి, పెళ్లాం పోరు తప్పలేదు నాయనలారా?

2026-10-26 14:39 GMT

మైదానంలో తెలుగు వాగ్వాదం.. టీమిండియాకు విజయాన్ని అందించిన తెలుగు కుర్రాళ్లు!

2026-10-24 14:22 GMT

తెర‌పైకి వీ.వీఎస్ ల‌క్ష్మ‌ణ్ బ‌యోపిక్!

2026-10-24 13:37 GMT

Copyright @2026

Powered by Blink CMS