సఫారీలకు షాకిచ్చిన బంగ్లా

Update: 2015-07-12 22:34 GMT
బంగ్లా బెబ్బులిలా విరుచుకు పడింది. ప్రపంచ క్రికెట్ జట్లలో అత్యుత్తమ జట్లలో ఒకటైన దక్షిణాఫ్రికా జట్టుకు ఘోర అవమానం ఎదురైంది. భారత్ కు షాకుల మీద షాకులిచ్చిన బంగ్లాజట్టు.. తాజాగా సఫారీలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేయటమే కాదు..ఇకపై తాము పసికూనలం కాదన్న విషయాన్ని తేల్చి చెప్పింది.

ఇటీవల టీమిండియాను కంగుతినిపించిన బంగ్లాజట్టు  తాజాగా దక్షిణాఫ్రికాకు ఊహించని రీతిలో పరాజయం పాలయ్యేలా చేసింది. మూడు వన్డే సిరీస్ లో భాగంగా జరిగిన రెండో వన్డేలో  తొలుత బ్యాటింగ్ కు దిగిన సఫారీలు కేవలం 162 పరుగులకే కుప్పకూలిపోయింది.

163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా జట్టు.. కేవలం 27.4 ఓవర్లకే లక్ష్యాన్ని చేధించి విజేతగా అవతరించింది. దారుణమైన విషయం ఏమిటంటే.. దక్షిణాఫ్రికా జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ దాటని పరిస్థితి. ముస్తాఫిజార్ రహమాన్.. నాసిర్ హుస్సేన్ లు ఇద్దరూ చెరో మూడేసి వికెట్లు తీసి సఫారీల్ని సొమ్మసిల్లేలా చేశారు.

తాజా విజయంతో మూడు వన్డే సీరిస్ లో 1-1 అయ్యింది. నిర్ణయాత్మకమైన మూడో వన్డే మ్యాచ్ జూలై 15న జరగనుంది. మరి.. ఈ మ్యాచ్ లో బంగ్లాజట్టు బెబ్బులిలా మరోసారి చెలరేగిపోతుందా అన్నది చూడాలి.
Tags:    

Similar News