టీటీడీ మోర ఆలకించని కేంద్రం .. మరోసారి విన్నపం !

Update: 2020-09-16 05:30 GMT
తిరుమల తిరుపతి దేవస్థానం వినతులపై కేంద్రం నుండి సరైన స్పందన రావడంలేదు. పాతనోట్ల మార్పిడిపై కేంద్రానికి ఎన్నిసార్లు విన్నపాలు చేస్తున్నా కూడా  పట్టించుకోవడం లేదు. గతంలో చేసిన విన్నపాలపై ఎటువంటి స్పందన లేకపోవడంతో, టీటీడీ దగ్గర పేరుకుపోయిన కోట్లాది రూపాయల పాతనోట్లు మార్చాలని మరోసారి వైవి సుబ్బారెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2016లో వెయ్యి, ఐదొందల నోట్లు రద్దు చేసినప్పటి నుంచి టీటీడీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించినా.. పాతనోట్ల ప్రవాహం ఆగలేదని తెలిపారు.

ఆ తర్వాత కూడా స్వామి హుండీ ద్వారా పాతనోట్లు కానుకగా వచ్చాయని, ఈ అంశం భ‌క్తుల మ‌నోభావాల‌తో ముడిప‌డిన అంశం  కావ‌డంతో ఈ నోట్లను హుండీలో స‌మ‌ర్పించ‌కుండా నిరోధించే ఏర్పాట్లు చేయలేకపోయాని కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనేక బ్యాంకుల్లో లావాదేవీలు జ‌రుపుతున్న టీటీడీ హుండీ ద్వారా ల‌భించే కానుక‌ల‌కు ప‌క్కాగా రికార్డులు నిర్వహిస్తోంద‌ని వివరించారు. పాత‌నోట్ల మార్పిడి అంశానికి సంబంధించి 2017 నుంచి టీటీడీ అనేక‌సార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ‌, రిజ‌ర్వు బ్యాంకుకు లేఖ‌లు రాసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుని పాత నోట్లను రిజ‌ర్వు బ్యాంకులో గానీ లేదా ఏ ఇత‌ర బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాల‌ని టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి కోరారు.

నిజానికి నాలుగేళ్ల కిందటే పాతనోట్లు రద్దు అయిపోయాయి. కనీసం ఇప్పుడు చూద్దామన్నా కన్పించడం లేదు. ఆ నోట్లు ఇప్పుడు చిత్తు కాగితాలతో సమానం. కానీ తిరుమల శ్రీవారి దగ్గర అలాంటి నోట్లు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. 2016 నవంబర్‌ 8న దేశంలో ఐదొందలు, వెయ్యి నోట్లు చెల్లవని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత భక్తులు చాలా వరకు ఆ నోట్లను స్వామివారి హుండీలో వేశారు. పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చని చెప్పినా దానికి కొన్ని నిబంధనలు పెట్టారు. దీంతో కొందరు ఆ పాతనోట్లను స్వామివారి హుండీలో పడేశారు.కోట్లాది రూపాయల పాతనోట్లు టీటీడీ దగ్గర పేరుకుపోయాయి.రకరకాలుగా , టీటీడీకి భక్తుల నుంచి వచ్చిన 18కోట్ల రూపాయల విలువైన వెయ్యినోట్లు, 30 కోట్ల 17లక్షల రూపాయల 500నోట్లు కానుకగా వచ్చాయి.
Tags:    

Similar News