వైసీపీ సోషల్ మీడియా ‘తన కాళ్లు తనే నరుక్కుంటుందా?’

Update: 2020-08-31 08:10 GMT
ఎన్నికల్లో గెలిచిన వైసీపీనే ఇప్పుడు ఉంటే ఆ పార్టీ కోసం పోరాడిన వారికి న్యాయం జరిగేది. కానీ అధికారం ఆశతో పాత టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారు. అధిష్టానం పెద్దలను, ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకొని నిజమైన వైసీపీ అభిమానులను తొక్కేస్తున్నారట.. దీంతో బలమైన వైసీపీ అభిమాన గణం ఇప్పుడు దిశానిర్ధేశం లేక తమలో తామే తిట్టుకుంటున్న వైనం క్షేత్రస్థాయి నుంచి వినిపిస్తోంది. టీడీపీ నేతలను చేర్చుకోవద్దని అంటున్నా వైసీపీ అధిష్టానం లెక్కచేయకపోవడంతో నిజమైన హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్స్ నొచ్చుకుంటున్నారు.

వైసీపీ సోషల్ మీడియా అభిమానులంతా ఎన్నికల ముందు పెద్ద కుటుంబంగా ఉండేవారు. అప్పుడు జగన్ ను ఎవరు ఏమీ అన్నా ఊరుకునేవారు కాదు.. టీడీపీ వాళ్లను, లోకేష్, చంద్రబాబులు జగన్ పై విమర్శలు చేస్తే చీల్చి చెండాడేవారు.. అలాంటి వాళ్లకు ఇప్పుడు దిక్సూచి ఇచ్చే వాళ్లు లేక ఇబ్బంది పడుతున్నారట. ఏం షేర్ చేస్తున్నారో? దేనికి లైక్ కొడుతున్నారో.. ఏ పోస్ట్ పెట్టాలో అర్థం కాలేక ఇబ్బంది పడుతున్నారట.
 
ఉదాహరణకు టీడీపీ నుంచి ఎవరైనా వైసీపీలో చేరితే వాళ్లే చేరారని వైసీపీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. మళ్లీ ఆ అభిమానులే... టీడీపీ వాళ్లు వచ్చి మమ్ములను ఇబ్బంది పెట్టి మాకు పనులు కాకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చేది వాళ్లకు పనులు చేపించుకోవడానికేనన్నది వైసీపీ అధిష్టానంకు తెలియదా అని వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.  చేరిన తర్వాత చంద్రబాబు మీద కోపంతో పోస్టులు పెడుతున్నారు. మళ్లీ వాళ్లే పెత్తనం చేస్తున్నారని.. కాంట్రాక్టులు చేసుకుంటున్నారని వైసీపీ ఫ్యాన్స్ వాపోతున్నారు. ఎమ్మెల్యేలు వాళ్లకే విలువ ఇస్తూ పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొన్నీమధ్య ఇది గమనించి ఒక టీడీపీ అనుకూల పేపర్ లో వైసీపీలో నైరాశ్యం రాసింది. ఆ పేపర్ కటింగ్ వైసీపీ గ్రూపులో పెట్టి వైసీపీ వాళ్లే వైసీపీకి, ఆ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టుకోవడం చర్చనీయాంశమైంది. ఇది చూసి టీడీపీ వాళ్లు ఆనందం వ్యక్తం చేశారట.. మన ట్రాప్ లో వైసీపీ మీడియా పడిందని వాళ్లను ఆడుకోవచ్చని అనుకున్నారట.. ఎలాగూ టీడీపీ నుంచి వైసీపీలోకి వరుసగా చేరుతున్నారని.. అప్పుడు వాళ్లే పెడుతారు.. మళ్లీ వాళ్లే తిడుతారని టీడీపీ సోషల్ మీడియా సంబరాలు చేసుకుంటోందంట.. 
Tags:    

Similar News