పార్లమెంటులో వైసీపీ అజెండా... బాబు, చినబాబులపై సీబీఐ దర్యాప్తే
ఢిల్లీలో సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైపోయాయి. అయితే ఏంటీ? ఇప్పుడే ఏమైనా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయా? అదేమీ కాదు గానీ... ఏపీ రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నందున ఈ సమావేశాలు తెలుగు ప్రజలకు ప్రత్యేకమే. ఎందుకంటే... ఏపీ రాజధాని అమరావతిలో చోటుచేసుకున్న అక్రమాలు, ఫైబర్ నెట్ కాంట్రాక్టుల్లో అవినీతిపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అయితే సీబీఐని కేంద్రం ఇంకా రంగంలోకి దించనే లేదు. ఈ క్రమంలో ఈ రెంటిపై సీబీఐని రంగంలోకి దించేలా చేయడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. ఇదే జరిగితే... టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లకు నిజంగానే వణుకు రాక తప్పదన్న మాట వినిపిస్తోంది.
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో తమ వ్యూహాలకు ఇప్పటికే పదును పెట్టిన వైసీపీ... రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పలు రకాల నిధులతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయాలని నిర్ణయించింది. మరికొన్ని విభాగాలకు సంబంధించి పెండింగ్ నిధులను కూడా రాబట్టే పనిని కూడా వైసీపీ భుజానికెత్తుకుంది. ఇవన్నీ రెగ్యులర్ గా ఉండే పనులే. అయితే ఈ దఫా పార్లమెంటు సమావేశాల్లో తమ పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్లుగా రాజధాని, ఫైబర్ నెట్ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయాలని వైసీపీపీ కేంద్రాన్ని పట్టుబట్టనుంది.
ఈ మేరకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో తమ వ్యూహమేమిటన్న విషయాన్ని సోమవారం నాడే పార్లమెంటులో వైసీపీ పక్ష నేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి చాలా స్పష్టంగానే చెప్పేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను కోరుతూనే... రాజధాని, ఫైబర్ నెట్ అక్రమాలపై సీబీఐ చేత విచారణ మొదలయ్యేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు కృషి చేయనున్నట్లుగా మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ మాట విన్నంతనే నిజంగానే చంద్రబాబు, నారా లోకేశ్ లకు షాక్ తగిలినంత పనై ఉంటుందన్న విశ్లేషణలు మొలయ్యాయి. మొత్తంగా చంద్రబాబు, లోకేశ్ ను అడ్డంగా బుక్ చేయడమే లక్ష్యంగా ఈ పార్లమెంటు సమావేశాలను వైసీపీ ఓ అస్త్రంగా మలచుకుంటోందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.