‘పిక్చర్ అభి బాకీ హై’ పోస్టుతో మరోసారి రాఘవ్ చడ్డా నిప్పులు

ముఖ్యంగా పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన గురించి చేసిన ఘాటు విమర్శలతో రాఘవ్ చడ్డా మరింతగా ఫైర్ కావటం.. ధురంధర్ మూవీ డైలాగ్ తో ఒక్కసారి వైరల్ గా మారారు.;

Update: 2026-04-05 19:45 GMT

వేలాది కోట్ల రూపాయిల అవినీతి అంశాల్ని ప్రస్తావించకపోవచ్చు. కానీ.. దేశంలోని కోట్లాది మంది సామాన్యులు తమ రోజువారీ జీవితాల్లో ఎదుర్కొనే సమస్యల్ని ప్రస్తావించే నాయకుడు ఒకడు ఉంటే.. అతన్ని అభిమానించకుండా ఎందుకు ఉంటారు? దీనికి తోడు క్లీన్ చిట్ వ్యక్తిత్వం ఉండటం మరింత ప్లస్ గా మారుతుంది. ఇప్పుడు చెప్పేదంతా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డా గురించి. ఆయను రాజ్యసభలో పార్టీ ఉప నాయకుడి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో.. ఆయన తన రియాక్షన్ ను సోషల్ మీడియా పోస్టులతో తెలుపుతున్నారు. ముఖ్యంగా పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తన గురించి చేసిన ఘాటు విమర్శలతో రాఘవ్ చడ్డా మరింతగా ఫైర్ కావటం.. ధురంధర్ మూవీ డైలాగ్ తో ఒక్కసారి వైరల్ గా మారారు.

తాజాగా ఈ రోజు కూడా ఆయన ఒక పోస్టును పెట్టారు. ఆయన్నుపార్టీ పదవి నుంచి తప్పించటం తీవ్ర వివాదస్పదంగా మారింది. పంజాబ్ సమస్యల్ని పార్లమెంట్ లో లేవనెత్తకుండా మౌనం వహిస్తున్నారని ఆమ్ ఆద్మీ ఆరోపిస్తోంది.తనపై చేస్తున్న విమర్శలపై ఆయన మరోసారి స్పందించారు. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 12.52 గంటల సమయంలో ఎక్స్ లో ఆయన ఒక వీడియోను పోస్టు చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో కు క్యాప్షన్ గా పిక్చర్ అభి బాకీ హై (ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా మిగిలి ఉంది అన్న అర్థం వచ్చేలా) అంటూ చేసిన పోస్టు పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

ఆయన పోస్టు చేసిన మూడు నిమిషాల వీడియోలో..తన పార్టీ తనపై చేస్తున్న విమర్శలకు సమాధానాలు ఇస్తున్నట్లుగా చెప్పాలి. పార్లమెంటులో పంజాబ్ సమస్యలను తాను లేవనెత్తటంలో విఫలమయ్యారన్న ఆరోపణల్ని ఖండించేలా.. తానుఎంపీగా పంజాబ్ కోసం చేసిన పనుల్ని చూపించారు. అంతేకాదు.. తన వీడియోలో రైతులకు కనీస మద్దతుధర చట్టపరమైన గ్యారెంటీ కల్పించాలన్న డిమాండ్, పాకిస్తాన్ లో నన్ కానా సాహిబ్ కు కారిడార్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన.. పంజాబ్ లో పడిపోతున్న భూగర్భ జలాల స్థాయిపై ఆందోళన.. అమరవీరుడు భగత్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని కోరటం లాంటి అంశాలతో పాటు.. ‘‘పంజాబ్ నాకు కేవలం మాటలు చెప్పే అంశం కాదు. అది నా ఇల్లు. నా బాధ్యత. నా మట్టి.. నా ఆత్మ’’ అంటూ భావోద్వేగంగా పేర్కొన్న ఈ పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

ఈ పోస్టు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండటమే కాదు.. వేలాది కొద్దీ లైకులు.. రీపోస్టులు రావటం గమనార్హం. మిడిల్ క్లాస్ హీరోగా కొందరు అభివర్ణిస్తుంటే.. పార్టీ అంతర్గత విభేదాల ప్రతిరూపంగా పేర్కొన్నారు. శనివారం ఆయన చేసిన పోస్టులో ధురంధర్ మూవీలోని ‘నేను గాయపడ్డాను.. అందుకే ప్రమాదకరంగా మారాను’ అన్న డైలాగ్ ఇప్పుడు మీమ్స్ లోనూ.. చర్చల్లోనూ హాట్ టాపిక్ గా మారటం గమనార్హం. తమపై విరుచుకుపడుతున్న రాఘవ్ చడ్డాపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సైతం పెద్ద ఎత్తున విమర్శించటం మొదలు పెట్టారు.

రాఘవ్ చడ్డా బీజేపీకి భయపుడుతున్నారంటూ ఢిల్లీ ఆమ్ ఆద్మీ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ పేర్కొంటే.. రాఘవ్ చడ్డా గతంలో ప్రధాని మోడీతో పాటు బీజేపీని విమర్శిస్తూ చేసిన పోస్టులను తన టైమ్ లైన్ నుంచి తొలగించారని.. ఆయన వాషింగ్ మెషీన్ వ్యూహంగా ఎద్దేవా చేశారు. బీజేపీలో చేరే ముందు తాను చేసిన విమర్శలు కనిపించకుండా ఉండేలా.. క్లీన్ చేస్తున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. పార్లమెంట్ లో కీలక జాతీయ సమస్యలపై పోరాడకుండా.. ఎయిర్ పోర్టులో సమోసా ధరల లాంటి చిన్న అంశాలపై మాట్లాడుతూ.. సాఫ్ట్ పీఆర్ చేసుకుంటున్నట్లుగా మండిపడుతున్నారు. నిజమే.. పెద్ద పెద్ద సమస్యల మీద మాట్లాడినంతనే మార్పు రాదు. కానీ.. సమోసాల గురించో.. మరో అంశం మీదనో మాట్లాడిన వెంటనే మార్పులు వచ్చాయి కదా? ఆ విషయాన్ని ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు గుర్తించదు? ప్రజలు తమ తరఫు మాట్లడే గొంతుకలా రాఘవ్ ను చూస్తున్నారన్న విషయాన్ని ఆమ్ ఆద్మీ ఎప్పుడు గుర్తిస్తుందో చూడాలి.



Tags:    

Similar News