మ‌రో స్టెప్‌: ఏపీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యామ్నాయం లేన‌ట్టే.. !

ముఖ్యంగా జ‌గ‌న్ వ‌స్తే.. మూడు అంశాలు ప్ర‌భావితం అయ్యే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ‌ను కూట‌మి ప్ర‌భు త్వం పెద్ద‌లు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు.;

Update: 2026-04-05 17:30 GMT

ప్ర‌స్తుతం ఏపీలో రెండే రెండు రాజ‌కీయ వ‌ర్గాలు ప్ర‌బ‌ల శ‌క్తిగ ఉన్నాయి. కూట‌మి(టీడీపీ+జ‌న‌సేన‌+ బీజేపీ) ఒక‌వైపు ఉన్నాయి. మ‌రోవైపు వైసీపీ బ‌లంగా ఉంది. ఇక‌, క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్ జ‌ట్టుక‌డ‌తాయ‌ని లెక్క లు వేస్తున్నా.. దీనికి సంబంధించిన అప్‌డేట్ ఏమీ క‌నిపించ‌డం లేదు. దీంతో ప్ర‌జ‌ల ముందున్న ఏకైక ప్ర‌త్యామ్నాయం.. కూట‌మి లేక‌పోతే వైసీపీ. ఈ రెండు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఏదో ఒక‌టే మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

అందుకే.. కూట‌మి వ్య‌తిరేక‌త త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌ని వైసీపీ అంచ‌నా వేసుకుని.. వ‌చ్చేఎ న్నిక‌ల‌కు రోజులు లెక్కించుకుంటోంది. క‌ళ్లుమూసి తెరిచే స‌రికి రెండేళ్లు అయిపోయాయ‌ని.. మ‌రోరెండేళ్లు మాత్ర‌మే ఉంద‌ని వైసీపీ అధినే త‌జ‌గ‌న్ చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు కూడా రెడీ అవుతు న్నారు. అయితే..అస‌లు చిక్కు జ‌గ‌న్‌లోనే క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు ప్ర‌జ‌ల‌ను అయోమ‌యానికి గురి చేస్తున్నాయ‌ని అంటున్నారు.

ముఖ్యంగా జ‌గ‌న్ వ‌స్తే.. మూడు అంశాలు ప్ర‌భావితం అయ్యే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ‌ను కూట‌మి ప్ర‌భు త్వం పెద్ద‌లు ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. త‌ద్వారా రాష్ట్రం ధ్వంస‌మ‌వుతుంద‌ని అంటున్నారు. 1) ప్ర‌స్తుతం వ‌స్తున్న పెట్టుబ‌డుల‌పై ప్ర‌భావం. జ‌గ‌న్ వ‌స్తే.. పెట్టుబ‌డి దారులు తిరిగి వెళ్లిపోయే అవ‌కాశం ఉంద‌ని.. దీంతో ఉపాధి, ఉద్యోగాలు రాకుండా పోతాయ‌ని అంటున్నారు. 2) రాజ‌ధాని. తాను వ‌చ్చాక అమ‌రావ‌తిని మార్చేస్తాన‌ని జ‌గ‌నే చెప్పేశారు. దీనికి ప్ర‌త్యేకంగా ప్ర‌చారం అవ‌స‌రం లేదు.

3) అరాచ‌క పాల‌న‌.. జ‌గ‌న్ వ‌స్తే.. మ‌ళ్లీ అరాచ‌క పాల‌న వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు, ప‌వ‌న్ కూడా చెబుతున్నా రు. ఈ మూడు అంశాలు క‌నుక ప్ర‌భావితం అయితే.. ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టి వ‌రకు ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఉన్న వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ‌తగ‌ల‌డం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాదు.. జ‌గ‌న్ వ్య‌వ‌హారాన్ని నిశితంగా గ‌మ‌నిస్తున్న‌వారు కూడా.. పాద‌యాత్ర ఒక్క‌టే జ‌గ‌న్‌ను కాపాడే అవ‌కాశం ఉంద‌ని.. అది కూడా విఫ‌లమైతే(నెక్ట్స్ స్టెప్‌) ఇక‌, రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయం వైపు ఎవ‌రూ ఆలోచ‌న చేయ‌ర‌ని అంటున్నారు.

Tags:    

Similar News