రాజ్య‌స‌భ‌లో సుబ్బారెడ్డి కొత్త సంప్ర‌దాయం: బాబు సీరియ‌స్‌

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, సీనియ‌ర్ నేత వైవీ సుబ్బారెడ్డి వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యార‌ని తెలిసింది.;

Update: 2026-04-05 20:03 GMT

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, సీనియ‌ర్ నేత వైవీ సుబ్బారెడ్డి వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యార‌ని తెలిసింది. ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ఖండించిన ఆయ‌న‌.. దీనిపై త‌క్ష‌ణ‌మే స్పందిం చి.. ఆయ‌న దూకుడుకు బ్రేకులు వేయాల‌ని పార్టీ ఎంపీల‌ను ఆదేశించారు. దీంతో టీడీపీ పార్ల‌మెంట‌రీ ప‌క్ష నాయ‌కుడు లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు.. వైవీ వ్య‌వ‌హారాన్ని ఎండ‌గ‌డుతూ.. రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు సుదీర్ఘ లేఖ రాశారు. వైవీ చేసిన ప్ర‌తిపాద‌న‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ స్వీక‌రించ‌రాద‌ని.. కోరారు.

ఏంటి వివాదం?

అమ‌రావ‌తి రాజ‌ధానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లుపై పెద్ద‌ల స‌భ రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ జ‌రిగిన విష‌యం తెలిసిందే. గంటా 49 నిమిషాల పాటు ఈ విష‌యంపై అన్ని పార్టీల స‌భ్యులు చ‌ర్చించారు. ఆ స‌మ‌యంలో రాజ్య‌స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వైసీపీ స‌భ్యులు స‌భ‌లోనే ఉన్నారు. వారికి చైర్మ‌న్‌, ఉప‌రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్‌.. 5 నిమిషాల స‌మ‌యం ఇచ్చారు. దీంతో సుబ్బారెడ్డి స‌హా.. ప‌లువురు స‌భలోనే ప్ర‌సంగిం చారు. రాజ‌ధానికి వ్య‌తిరేకం కాద‌ని.. రైతుల స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌క‌పోవ‌డ‌మే స‌మ‌స్య‌ని పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలో తామంతా వాకౌట్ చేస్తున్నామ‌ని చెప్పి.. సుబ్బారెడ్డి స‌హా.. ఏడుగురు వైసీపీ స‌భ్యులు బ‌య‌ట కు వ‌చ్చేశారు. అంటే.. చైర్మ‌న్ ఇచ్చిన 5 నిమిషాల స‌మ‌యంలో వారు వాడుకున్న‌ది కేవ‌లం 4 నిమిషాల లోపే. అనంత‌రం.. స‌భ ఈ బిల్లును ఆమోదించింది. కానీ.. బ‌ల‌మైన వేదిక‌ను వినియోగించుకోక‌పోవ‌డంపై వైసీపీ అధిష్టానం వైవీపై ఆగ్ర‌హించ‌డంతో ఆయ‌న కొత్త సంప్ర‌దాయానికి తెర‌దీశార‌న్న‌ది టీడీపీ చెబుతు న్న మాట‌.

స‌భ‌లో చ‌ర్చ జ‌రిగి.. బిల్లును కూడా ఆమోదించిన మ‌ర్నాడు.. వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో వైసీపీ స‌భ్యులు చైర్మ‌న్ నివాసానికి వెళ్లారు. అక్క‌డ ఆయ‌న‌ను క‌లిసి.. స‌భ‌లో త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని.. ఏడుగురు స‌భ్యులు ఉన్న‌త‌మ‌కు.. కేవ‌లం 5 నిమిషాలే కేటాయించార‌ని.. కాబ‌ట్టి.. తాము స‌భ‌లో మాట్లాడాల‌ని అనుకున్న అంశాల‌ను.. లిఖిత పూర్వ‌కంగా `ఇప్పుడు` ఇస్తున్నామ‌ని.. కాబ‌ట్టి స‌భ రికార్డుల్లో దీనిని చేర్చాల‌ని వైవీ కోరారు. అయితే.. దీనికి చైర్మ‌న్ అంగీక‌రించిదీ.. లేనిదీ తెలియ‌దు.

కానీ.. ఈ స‌మాచారం అంద‌గానే సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్ అయ్యారు. వైవీ సుబ్బారెడ్డి కొత్త సంప్ర‌దా యానికి తెర‌దీశార‌ని.. దీనిని అడ్డుకోవాల‌ని.. ఎంపీల‌కు సూచించారు. దీంతో లావు చైర్మ‌న్‌కు లేఖ రాశారు. ``స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా వైసీపీ స‌భ్యుల‌కు మీరు స‌మ‌యం ఇచ్చారు. వారు దానిని స‌ద్వినియోగం చేసుకోలేదు. ఒక‌వేళ స‌మ‌యం చాల‌ద‌ని అనుకుంటే.. అప్పుడే మిమ్మ‌ల్ని అభ్య‌ర్థిస్తే.. మీరు స‌మ‌యం కేటాయించేందుకు అవ‌కాశం ఉంది. కానీ.. వారు వాకౌట్‌చేసి.. ఇప్పుడు ఇంటికి వ‌చ్చి.. ప్ర‌సంగ పాఠం ఇచ్చి.. దానిని రికార్డుల్లో చేర్చాల‌ని కోర‌డం.. సంప్ర‌దాయాల‌కు విరుద్ధం. కాబ‌ట్టి వైవీ అభ్య‌ర్థ‌న‌ను తోసిపుచ్చండి`` అని విన్న‌వించారు. మ‌రి దీనిపై చైర్మ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటా రోచూడాలి.

Tags:    

Similar News