ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ సీటే ముద్దంటోన్న వైసీపీ ఎమ్మెల్యే...!
జాతీయ రాజకీయాలపై వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆసక్తి చూపుతున్నారు. తనకు జాతీయ రాజకీయాల పై ఆసక్తి ఉందని..తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని అంటున్నారు. వైసీపీలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తాజాగా ఎంపీ పోస్టుపై మనసు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఆయనే నర్సన్నపేట ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్.
ఆయన గురించి నియోజకవర్గంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆయన కూడా తన మనసంతా ఢిల్లీపైనే ఉందని చెబుతున్నారట. విచిత్రంగా ఉన్నప్పటికి.. ఇది నిజమని అంటున్నారు.
లోకల్ పాలిటిక్స్ ఇలా ఉంటాయని అనుకోలేదని.. ఆయన వాపోతున్నారట. ఏం చేసినా.. విమర్శిస్తున్నా రని.. ఏం చేయకపోయినా.. విమర్శిస్తున్నారని.. సొంత పార్టీలోనే నేతలు తెరవెనక రకరకాలుగా గోతులు తీస్తున్నారని ఆయన వాపోతున్నారట. ఈ క్రమంలోనే ఢిల్లీపై మనసు పెట్టుకున్నారని చర్చ సాగుతోంది.
ఢిల్లీ అయితే.. తనకు ఏగొడవా ఉండదని.. ఫెయిర్ పాలిటిక్స్ చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని.. తనకు రెండు మూడు భాషలపైనా గట్టి పట్టుందని.. ఆయన చెబుతున్నారట. పైగా.. సినిమా ఇండస్ట్రీతో అవినాభావ సంబంధం కూడా ఉండడంతో ఎంపీగా ఉంటే.. మేలని భావిస్తున్నారు.
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్‌కు ఉమాశంకర్ గణేష్ స్వయంగా సోదరుడు. 2014లో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై స్వల్ప తేడాతో ఓడిన ఆయన గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. నియోజకవర్గంలో క్రమక్రమంగా పట్టు పెంచుకుంటూ అయ్యన్నపాత్రుడి సోదరుడిని కూడా పార్టీలోకి తీసుకువచ్చారు. అయితే ఆ తర్వాత మారుతోన్న రాజకీయ సమీకరణలు, హైకమాండ్ వద్ద తాను అనుకుందొకటి.. జరుగుతోంది మరొకటి కావడంతో ఆయన ఎమ్మెల్యే పదవిపై అయిష్టతతో ఉన్నారని అంటున్నారు.
గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి విజయం దక్కించుకున్న గణేష్ మనసు ఒక్కసారిగా ఢిల్లీ వైపు మళ్లడానికి మరో కారణం కూడా ఉందని అంటున్నారు. ఎంపీ అయితే లోకల్ రాజకీయాలకు స్కోప్ ఉండదని.. అప్పుడు అయినా తన ప్రాంతం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని అనుకుంటున్నారట.
దీంతో ఆయన ఢిల్లీ వైపే.. దృష్టి కేంద్రీక రించారని అంటున్నారు. ఇటీవల కాలంలో ఆయన విశాఖ ఎంపీతో చాలా చనువుగా ఉంటున్నా రు. వ్యక్తిగతంగా తనకు ఉన్న పరిచయంతో ఎంపీతో కలిసి ఢిల్లీ టూర్‌లు కూడా చుట్టి వస్తున్నారట. మరి ఆయన కోరిక ఏమేరకు జగన్ నెరవేస్తారో చూడాలి.