దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక‌.. ఎమ్మెల్యే ఆర్కేపై తీవ్ర విమ‌ర్శ‌లు.. అభ్య‌ర్థిని అప‌హ‌రించారంటున్న కుటుంబ

Update: 2022-05-04 13:46 GMT
మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. దుగ్గిరాల ఎంపీపీ పదవిని కైవసం చేసుకునేందుకు అధికార వైసీపీ, టీడీపీ నేతలు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. దుగ్గిరాల మండలంలో మొత్తం 18 ఎంపీటీసీలు ఉన్నాయి. వీటిలో తొమ్మిది టీడీపీ, ఒకటి జనసేన, 8 మంది వైసీపీ అభ్యర్థులు ఎంపీటీసీలుగా గెలిచారు. అత్యధిక సీట్లు టీడీపీకి రావడంతో దుగ్గిరాల ఎంపీపీ స్థానం టీడీపీకి వచ్చే అవకాశం ఉందనే ప్ర‌చారంలో ఉంది.

గతంలో రెండు సార్లు ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి సమావేశం ఏర్పాటు చేశారు. కానీ కోరం లేకపోవడంతో రెండుసార్లు ఎన్నిక వాయిదా వేశారు.  8 స్థానాలు వచ్చిన వైసీపీ.. ఎలాగైనా సరే దుగ్గిరాల ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్రలు పన్నుతోందని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా ఉన్న ముస్లిం మైనార్టీ అయిన జెమీనాకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వకుండా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. తెలుగుదేశం, జనసేన కలిపి 10 మంది ఎంపీటీసీలు ఉన్నారని,  వీరిలో బీసీ మహిళలు లేరని అధికారులు అంటున్నారు.

దీంతో వీరిలో వైసీపీలో ఉన్న ఇద్ద‌రు మ‌హిళా అభ్య‌ర్థుల్లో ఒకరిని వైసీపీ ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే దుగ్గిరాల-2 ఎంపీటీసీగా గెలిచిన తాడిబోయిన పద్మావతి కూడా ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఎంపీపీకి పద్మావతి మద్దతు ఇస్తారనే భయంతో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బలవంతంగా ఆమెను తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన తల్లి ఆరోగ్యం సరిగా లేకపోయినా ఎమ్మెల్యే ఆర్కే బలవంతంగా తీసుకెళ్లారని పద్మావతి కుమారుడు యుగంధర్ అంటున్నారు. పద్మావతి ఎంపీపీ కాకుండా ఉండేందుకు దుగ్గిరాల ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తమను వేధిస్తున్నాడని యుగంధర్ తెలిపారు. తమ కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని.. తమకు ప్రాణహాని ఉందని పద్మావతి కుమారుడు యుగంధర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తీరుపై ఎంపీటీసీ పద్మావతి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుగ్గిరాల-2 ఎంపీటీసీ పద్మావతిని ఎమ్మెల్యే ఆర్కే తన వెంట తీసుకెళ్లాడని ఆమె కొడుకు యుగంధర్‌ మండిపడ్డారు. గురువారం(రేపు) పద్మావతి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనుంది. ఎమ్మెల్యే ఆర్కే తీరుపై పద్మావతి కుటుంబీకుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాన్ని వైసీపీ మానసికంగా వేధిస్తోందని వైసీపీ ఎంపీటీసీ పద్మావతి కొడుకు యుగంధర్‌ ఆరోపించారు. తన తల్లి ఆరోగ్యం సరిగా లేకపోయినా.. ఎమ్మెల్యే ఆర్కే బలవంతంగా తీసుకెళ్లారని పద్మావతి కొడుకు యుగంధర్ ఆరోపించారు. దుగ్గిరాల ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి తమను వేధిస్తున్నాడని యుగంధర్‌ అన్నారు. వైసీపీ నుంచి తమకు ప్రాణహాని ఉందని ఎంపీటీసీ పద్మావతి కొడుకు యుగంధర్ తెలిపారు.
Tags:    

Similar News