• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మంత్రి సీదిరి స‌ర్దు...

మంత్రి సీదిరి స‌ర్దు కావాల్సిందేనా..!

By - Tupaki Desk
Update: 2022-11-29 05:21 GMT
శ్రీకాకుళం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, మంత్రి  డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు ప‌రిస్థితి క‌త్తిమీద సాములా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆయ‌న‌పై వైసీపీ సొంత నేత‌లే విరుచుకుప‌డ‌డం,  టికెట్ ఇస్తే  ఓడిస్తామని గంభీర ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం.. ఇవి మీడియాలోనూ ప్ర‌చారం జ‌ర‌గ‌డం.. వంటివి సీదిరికి ప్రాణ‌సంక‌టంగా మారింది.  వైసీపీ జిల్లా కార్యదర్శి దువ్వాడ హేమబాబు చౌదరికి.. మంత్రికి కొన్నాళ్లుగా అస్స‌లు ప‌డ‌డం లేదు.

దీంతో ఆయ‌న నాయ‌క‌త్వంలో దాదాపు 300 మంది నియోజ‌క‌వ‌ర్గం స్థాయి నాయ‌కులు.. సీదిరిపై నిప్పులు చెరుగుతున్నారు.  పలాస నియోజకవర్గంలో మంత్రి అండదండలతో కొంద‌రు దోచుకుంటున్నార‌ని కూడా వారు ఆరోపిస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము సీదిరి అన్నం పెడితే.. మాకు సున్నం కొడుతు న్నాడంటూ.. వారు ఆగ్ర‌హం చేస్తున్నారు. తాజాగా ఆదివారం నిర్వ‌హించిన వ‌న భోజ‌నాల కార్య‌క్ర‌మంలో ఇదే విష‌యంపై చ‌ర్చించ‌డం గ‌మ‌నార్హం.

'పంచాయతీ ఎన్నికల నాటి నుంచి ప్రతి గ్రామంలో వైసీపీలోనే రెండువర్గాలుగా విడగొట్టి శకుని రాజకీయాలకు పాల్పడుతున్నారు. రానున్న ఎన్ని కల్లో సీదిరి అభ్యర్థిగా దిగితే వైసీపీ నుంచి 175 స్థానాలకు గాను 174 స్థానాలే లెక్కించాలి'' అని నాయ‌కులు హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. నియోజకవర్గం లో అత్యధిక ఓటర్లుగా ఉన్న‌ అగ్నికుల క్షత్రియ, యాదవ, కాళింగ సామాజిక వర్గాల నుంచి అభ్యర్థిని ప్రకటించాలని వారు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అయ్యారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్యర్థిని మార్చకపోతే పలాసలో వైసీపీకి వ్య‌తిర‌కంగా ప‌నిచేస్తామ‌ని హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, సీదిరికి టికెట్ ఇస్తే.. పార్టీ ప్రతిష్ట దిగజారిపోతుంద‌ని అన‌డం.. సంచ‌ల‌నంగా మారింది. 'ప్రతి పనికి ఒక రేటులా మంత్రి కోటరీ మారింది' అని విమర్శించడం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో మంత్రి సీదిరిని త‌ప్పిస్తారా.. లేక వేరే నియోజ‌క‌వ‌ర్గంలో టికెట్ కేటాయిస్తారా?  ఇవ‌న్నీ కాకుండా.. సీఎం జ‌గ‌న్ ఇలా ఆరోప‌ణ‌లు చేసిన వారిపైనే చ‌ర్య‌లు తీసుకుంటారా?  సీదిరిని సేఫ్ చేస్తారా? అనేది చూడాల్సి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • APPolitics 
  • YSRCPGovernment 
  • YSJaganMohanReddy 
  • APAssemblyElections 
  • MinisterSeediriAppalaraju 
  • PalasaMLA 
  • YSRCPLeaders 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS