పేటలో తగ్గేది లే సీన్... ?
వైసీపీకి పాయకరావు పేటను కంచుకోటను చేసిన ఘనత గొల్ల బాబూరావుదే. ఇప్పటికి మూడు సార్లు ఆయన గెలిచారు. టీడీపీలో తప్ప అలా వేరే పాటీ తరఫున గెలిచిన మరో ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారూ అంటే అది బాబూరావే అని చెప్పాలి. ఆయన 2009లో తొలిసారి కాంగ్రెస్ తరఫున విజేత అయ్యారు.
ఇక జగన్ పార్టీ పెట్టాక వైసీపీ తరఫున 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి మళ్లీ పేట కింగ్ అనిపించుకున్నారు. 2019లో మూడవసారి గెలిచి మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే పాయకరావుపేట ఎస్సీ రిజర్వుడ్ సీటు అయినా అక్కడ సామాజికవర్గాల పరంగా చూస్తే కాపులు బలంగా ఉంటారు. అలాగే మత్య్సకారులు కూడా తమ ప్రభావాన్ని గట్టిగానే చూపిస్తారు. వారి మద్దతు ఏ పార్టీకి అయితే ఉంటుందో వారే ఎమ్మెల్యే అవుతారు. అలా అన్నీ నాడు కలసివచ్చి బాబూరావు గెలిచారు. అయితే నక్కపల్లిలోని వైసీపీ నాయకులు ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగరవేయడంతో పేట కధ ఏపీ అంతా తెలిసిపోయింది.
ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం, ఆయనను విమర్శిస్తూ మీటింగులు పెట్టడం పేటలోనే జరిగింది. ఇక పేటలో నాటి నుంచి వైసీపీ రెండు వర్గాలూ చురుకుగా పనిచేస్తున్నాయి. ఎమ్మెల్యే వర్సెస్ యాంటీ గ్రూప్ నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నాయి.
దీంతో ఈ విషయం కాస్తా హైకమాండ్ దృష్టికి చేరడంతో సమస్య పరిష్కారాన్ని ఉత్తరాంధ్రా వైసీపీ ఇంచార్జి విజయసాయిరెడ్డి మీద పెట్టారు. ఆయన రెండు వర్గాలను పిలిపించుకుని కలసికట్టుగా పనిచేయాలని చెప్పి పంపారు. అయినా తీరు మారలేదు.
మరో వైపు విశాఖ రూరల్ జిల్లాకు కొత్తగా వైసీపీ తరఫున ప్రెసిడెంట్ అయిన గుడివాడ అమరనాధ్ కూడా పేట ఇష్యూని సెటిల్ చేయాలని చూశారని భోగట్టా. ఏది ఏమైనా కూడా బలంగా ఉన్న వర్గాల మధ్య రాజీ అయితే కుదరలేదు.
ఈ నేపధ్యంలో అధినాయకత్వం పేట పంచాయతీని స్వయంగా చేపట్టిందని అంటున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి వద్దకు ఎమ్మెల్యే బాబూరావు తాజాగా వెళ్ళి కలిశారు. పేట మొత్తం మ్యాటర్ చెప్పేశారు. తనకు యాంటీగా ఉన్న గ్రూప్ ని కట్టడి చేయాలని కూడా కోరారని తెలుస్తోంది. అయితే రెండవ వర్గం బలంగా ఉండడమే కాకుండా ఎమ్మెల్యేదే తప్పు అని చెబుతోంది. ఆయనతో కలిసేది లేదని అంటోంది.
వీలు అయితే తాము పార్టీ మారే యోచన చేస్తామని కూడా హెచ్చరిస్తోంది. ఇదిలా ఉంటే ఇక్కడ జనసేన కూడా బలంగా ఉంది. దాంతో ఆ పార్టీలోకి వైసీపీ అసమ్మతి నాయకులు చేరుతారు అని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే మాత్రం పేటలో వైసీపీకి ఇబ్బందులు తప్పవు.
మరి పేటను కంచుకోటను చేసిన ఎమ్మెల్యే తానే దాన్ని కూలదోస్తారా అన్న చర్చ అయితే గట్టిగా ఉంది. చూడాలి మరి తూర్పు గోదావరికి, విశాఖకు మధ్యన ఉన్న ఈ సీటు ఏపీ రాజకీయాలను బాగా ప్రభావితం చేస్తుందనే అంటున్నారు. ఉత్తరాంధ్రా ఉభయగోదావరి జిల్లాల రాజకీయం పల్స్ ని చెప్పే పేటలో ఫేట్ మారితే మాత్రం ఎవరికైనా కష్టమే అన్న మాట వినిపిస్తోంది.