షాకుల మీద షాకిచ్చిన సీఎం జగన్!

Update: 2019-06-08 13:00 GMT
బహుశా కేబినెట్ ఏర్పాటు విషయంలో సీఎం  జగన్ మోహన్  రెడ్డి ఇన్ని షాకులు ఇస్తారని ఊహించిన వారు ఎవరూ ఉండరేమో! జగన్ కేబినెట్ అంటే.. అది రొటీన్ ఫార్ములాకు కట్టుబడే ఉంటుంది! కాంగ్రెస్ హాయంలో, వైఎస్ హయాంలో ఎలాంటి కేబినెట్ లను చూశామో.. జగన్ కేబినెట్  కూడా అదే తరహాలో ఉంటుందని చాలా మంది అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఊహాగానాలు మొదలయ్యాయి!

సామాజికవర్గ సమీకరణాలతో సహా ముందుగా వినిపించిన ఊహాగానాలు వేరు! ముందుగా వినిపించిన పేర్లు వేరు! ముందుగా జగన్ కేబినెట్ గురించి ఊహించుకున్న రూపం ఇది కాదు!

ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ కేబినెట్  ఈ రీతిన ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు. ఈ విషయంలో అంచనాలకు అందనట్టుగా వ్యవహరించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ట్విస్టులు అనొచ్చు, కొంతమందికి షాకులే అని చెప్పొచ్చు! ఎలాగైతేనేం.. ఒక దాని తర్వాత మరొకటిగా ఇస్తూ సాగారు జగన్ మోహన్ రెడ్డి.

తన కేబినెట్లో ఐదు మంది డిప్యూటీ ముఖ్యమంత్రులు ఉంటారు.. అనే ప్రకటనతో మొదలు, ఒకదాని తర్వాత మరొకటిగా అసలు  పాయింట్లను రివీల్ చేస్తూ జగన్ మోహన్ రెడ్డి అటు సామాన్య ప్రజలను, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులనూ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ వచ్చారు. ఈ ట్విస్టులు, ఆశ్చర్యాల పరంపర డిప్యూటీ సీఎంల నంబర్లతో మొదలు అయ్యి, ఆఖరికి శాఖల కేటాయింపు వరకూ కూడా కొనసాగింది!

శాఖల విషయంలో కూడా జగన్ మోహన్ రెడ్డి సంచలన రీతిలోనే వ్యవహరించారు. ఊహలకు అందనట్టుగా వ్యవహరించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పదవుల విషయంలో అందరూ ఊహించిన పేర్లు కొన్ని అయితే, చివరకు  అవి దక్కిన ఎమ్మెల్యేలు మాత్రం వేరే!

మొత్తానికి కేబినెట్ ఏర్పాటు అంకంలో జగన్ మోహన్ రెడ్డి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేలా వ్యవహరించారు అని మాత్రం స్పష్టం అవుతోంది. ఊహకు అందని రీతిన కేబినెట్ ను ఏర్పాటు చేసిన జగన్ మోహన్ రెడ్డి, పాలనా పరమైన విధానాల్లో కూడా ఇంకా ఏమేం ట్విస్టు ఇస్తారో!Ys
Tags:    

Similar News